perished food served by railway to jawans సీఆర్పీఎఫ్ జవాన్ల కడుపుమాడ్చిన రైల్వే..

Perished food served by railway to jawans

CRPF Jawans, Chhattisgarh elections, assembly elections, election duty, bandobast, jharkhand to chhattisgarh, train, Raigarh railway station, Railway staff, food packets, spoiled food, train delay, railway tracks, railway food

CRPF Jawans who are travelling by train from jharkhand to chhattisgarh on election duties, were served spoiled food by railway staff at Raigarh, The Hungry jawans thrown the food packets on tracks demanding new food packet as that was spoiled.

బడాయిలు జాస్తి.. ఆచరణలో నాస్తి.. రైల్వే ఫుడ్డా.. మజాకా..!

Posted: 10/22/2018 03:00 PM IST
Perished food served by railway to jawans

ధేశంలో రైల్వేకు మూడేళ్ల క్రితం వరకు ప్రత్యేక బడ్జెట్ వుండేది. దేశంలోని ఏక్కడెక్కడ కొత్త మార్గాలు, కొత్త కోచ్ ప్యాక్టరీలు వస్తున్నాయన్న సమస్త సమాచారంతో పాటు రైళ్లు కూడా ఏయే మార్గల్లో వస్తున్నాయన్న వివరాలను ఈ బడ్జెట్ సందర్భంగా తెలుసుకునే వారు దేశప్రజలు. ఇలా దేశంలో ప్రత్యేక స్థానం వున్న రైల్వేను కూడా సాధారణ బడ్జెట్ లోకే తీసుకువచ్చింది కేంద్రంలోని నరేంద్రమోడీ సర్కార్. ఈ సందర్భంగా ప్రత్యేక బడ్జెట్ వుండటం వల్ల లాభాలు ఏంటని ప్రశ్నించి.. ఇకపై అలా కాదని బడాయిలకు పోయింది.

దేశంలో ప్రతీఏడు కొత్త ప్రతిపాదనలు, తీసుకువచ్చి అనేక ప్రాజెక్టులు ప్రకటించినా.. ఇప్పటి వరకు అనేక ప్రాజెక్టులు ఎక్కడవేసిన గొంగలి అక్కడే అన్న చందంగా వుందని, ఇకపై అలాకాకుండా తమ ప్రభుత్వం ఇచ్చిన హామీలను నెరవేర్చే విధంగా లక్ష్యసాధనపై దృష్టి కేంద్రీకరిస్తుందని తెలిపారు. ఇలా ఇదొక్కడే కాదు రైల్వే అధికారులు అనేక బడాయిలకు పోయారు. దేశంలోనే తొలిసారిగా బుల్లెట్ ట్రయిన్ ను తీసుకువస్తున్నామని, ఇక రైల్వేల్లో స్వచ్చా భారత్ పేరుతో బయో టాయిటెల్లు అని ఇంకా మరెన్నో.

ఇందులోభాగంగా రైలు ప్రయాణికులపై కూడా భాగానే బరుపును కూడా మోపారు. మునుపెన్నడూ లేని విధంగా రైల్వే బుక్కింగ్ సమయానుచితంగా రైల్వే చార్జీలు మారే విధానాన్ని కూడా తీసుకువచ్చారు. అటు తత్కాల్ నుంచి అన్ని ప్రయాణ చార్జీలపై వాయింపులు చేశారు. వీటన్నిపట్లు కిమ్మనకుండా వున్న ప్రయాణికులు.. ముందుగా రైల్వే అధికారులు రైల్వేలో వడ్డిస్తున్న అహారంపై కూడా చర్యలు తీసుకోవాలని డిమాండ్ ను లేవనెత్తారు. దీంతో ఆ దిశగా కూడా రైల్వే అధికారులు చర్యలు చేపట్టారు.

ఇకపై రైల్వేలో ఆహారం ఇలా అందుతుందంటూ కొన్ని నిబంధనలు కూడా తీసుకువచ్చారు. వాటి ధర విషయంలోనూ పలు జాగ్రత్తలు పాటిస్తున్నామని, వాటికన్నా అదనంగా ఎవరూ విక్రయించకూడదని కూడా చెప్పారు. అయితే ఇది కొంత మేర నిజం అవుతుందని ప్రయాణికులు బావిస్తున్నా.. వాస్తవికంగా మాత్రం రైల్వే భోజనం అంటే ఎలా వుంటుందో.. ఈ ఘటన మనకు అర్థమైయ్యేలా చేస్తుంది. రైల్వే అధికారులు జాస్తిగా బడాయిలకు పోతున్నారే తప్ప.. అచరణలో మాత్రం అవి రూపుదాల్చడం లేదని విమర్శలు కూడా వినిపిస్తున్నాయి.

జార్ఖండ్ నుంచి ఛత్తీస్ గడ్ కు ఎన్నికల విధుల నిర్వహణ నిమిత్తం వెళ్తున్న సుమారు రెండు వేల మంది సీఆర్పీఎఫ్ జవాన్లు కూడా రైల్వే బోజనం రుచి, సుచి, క్వాలిటీ, క్వాంటిటీ అన్ని మారాయని భ్రమించారు. ఈ క్రమంలో ఆకలవుతుండటంతో వారంతా తమకు భోజనం అందించాలని రైల్వే అధికారులకు సమాచారం అందించారు. అయితే వారందరికీ రాయగఢ్ రైల్వే స్టేషన్ లో ఆహారం అందింది. ఆకలిగా వున్న వారంతా అన్నం తిందామని తమకిచ్చిన ప్యాకెట్లను తెరచి చూసి అవాక్కయ్యారు.

వారికిచ్చిన ఆహారం కంపు కొడుతూ ఉండటమే ఇందుకు కారణం. రైల్వే సిబ్బంది అందించిన అహారం పాడైంది. అంతేకాదు ఒకటి రెండు రోజుల పాటు నిల్వవుంచిన ఆహారం కంపుకోట్టినట్లు దుర్వాసన వెదజల్లుతుంది. దీంతో తమ చేతుల్లో వున్న అహార పోట్లాలను జవాన్లు రైల్వే ట్రాక్ పై విసిరివేశారు. తమకు తిరిగి నాణ్యమైన ఆహారం అందించాలని డిమాండ్ చేశారు. అయినా అధికారులు ససేమిరా అన్నారు. దీంతో వారు మంచినీరు, టీ తాగి ఖాళీ కడుపుతోనే వారు ప్రయాణించాల్సి వచ్చింది.

దీనిపై రైల్వే శాఖ స్పందిస్తూ, రావాల్సిన సమయం కన్నా రైలు నాలుగు గంటల ఆలస్యంగా వచ్చిందని, ఈ కారణంతో పప్పు పాడైపోయి వాసన వచ్చిందని వివరణ ఇచ్చింది.  నాలుగు గంటలు అలస్యంగా రైలు వస్తే దానికి సీఆర్పీఎఫ్ జవాన్లు ఎలా బాధ్యులవుతారో అర్థంకానీ ప్రశ్న. రైలు అలస్యానికి జవాన్లు తమ కడుపులను ఎందుకు మాడ్చుకోవాలో కూడా అర్థంకానీ ప్రశ్నే. ఇక నాలుగు గంటల పాటు కూడా నిల్వ వుండని నాణ్యమైన అహారాన్ని జవాన్లకు వడ్డించారా.? అన్న ప్రశ్నలు కూడా ఉత్పన్నమవుతున్నాయి. ఏమైనా బడాయిల రైల్వే.. ఆహారంలోని నాణ్యత ఇలా మరోమారు వార్తల్లోకి ఎక్కింది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : CRPF Jawans  jharkhand  Chhattisgarh  Raigarh railway station  spoiled food  railway food  

Other Articles