BJP offered me Rs 30 cr: Lakshmi Hebbalkar కమలం పార్టీపై లక్ష్మీ బాంబు పేల్చారు.. తిప్పికోట్టిన బీజేపి

Bjp offered me rs 30 cr lakshmi hebbalkar

Lakshmi Hebbalkar, Karnataka, Congress MLA Lakshmi Hebbalkar, Congress MLA

After drawing flak from Punjab CM and the Opposition for embracing the Pakistan Army chief, cricketer-turned-politician Navjot Singh Sidhu said that he was prepared to give a strong reply to all when needed.

కమలం పార్టీపై ‘లక్ష్మీ బాంబు’.. తిప్పికోట్టిన బీజేపి

Posted: 10/06/2018 01:08 PM IST
Bjp offered me rs 30 cr lakshmi hebbalkar

కాంగ్రెస్ పార్టీని వీడి బీజేపీలో చేరితే మంత్రి పదవితో పాటు రూ.30 కోట్ల నగదు ఇస్తామని తనకు బీజేపి నేతల నుంచి భలే మంచి ఆఫర్‌ వచ్చిందని కాంగ్రెస్‌ ఎమ్మెల్యే లక్ష్మీ హెబ్బాల్కర్‌ సంచలన ఆరోపణలు చేశారు. బెళగావి రూరల్ ఎమ్మెల్యే మీడియాతో మాట్లాడుతూ ఆపరేషన్ కమళం ప్లాన్ అంటూ కొన్ని విషయాలను వెల్లడించారు. హైదరాబాద్‌లో ఉన్న సమయంలో ఓ బీజేపీ నేత తనకు ఫోన్‌ చేశారని తెలిపారు. కాంగ్రెస్‌ పార్టీకి రాజీనామా చేసి బీజేపీలో చేరితో ముందుగా రూ.30 కోట్ల నగదు ఇస్తామన్నారని అమె విషయాన్ని వెల్లడించారు.

అంతా సవ్యంగా జరిగి కర్ణాటకలో బీజేపీ అధికారంలోకి వస్తే కచ్చితంగా మంత్రి పదవి ఇస్తామని హామీ ఇచ్చారు. ఈ ఆఫర్ కు సంబంధించిన సంభాషణల్ని మొబైల్ లో రికార్డ్ చేసి రాష్ట్ర హోం మంత్రి పరమేశ్వర్‌ దృష్టికి తీసుకెళ్లానని కూడా లక్ష్మీ చెప్పారు. దక్షిణాదిపై జరుగుతున్న ‘ఆపరేషన్‌ కమలం’ గురించి రాష్ట్ర కాంగ్రెస్ కీలక నేతలతో చర్చించా. అయితే కర్ణాటకలో ప్రస్తుతం కొలువుదీరిన సంకీర్ణ ప్రభుత్వం ఐదేళ్లు అధికారంలో కొనసాగుతుందని అమె ధీమా వ్యక్తం చేశారు.

కాగా తమ ప్రభుత్వానికి ఎలాంటి డోకా లేదని’ చెప్పిన అమె అరోపణలను బీజేపి తిప్పకొట్టే ప్రయత్నం కూడా చేస్తుంది. జర్కిహోళి సోదరులతో తాజా వివాదాలతో పార్టీలో ఆదరణ కరువైన నేపథ్యంలో మహిళా ఎమ్మెల్యే బీజేపీపై విమర్శలు చేసి లబ్ది పొందాలని చూస్తున్నారని రాజకీయ వర్గాలు భావిస్తున్నాయి. త్వరలో చేపట్టనున్న రాష్ట్ర మంత్రి వర్గ విస్తరణలో చోటు కోసమే హెబ్బాల్కర్ ఈ ఆరోపణలు చేశారంటూ బీజేపీ నేతలు ఆమె ఆరోపణల్ని ఖండించారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Lakshmi Hebbalkar  Karnataka  Congress MLA Lakshmi Hebbalkar  Congress MLA  

Other Articles