Devotees witness rare event at Arasavalli ఆదిత్యుడిని తాకిన సూర్యకిరణాలు.. పులకించిన భక్తులు

Devotees witness rare event at arasavalli

Devotees, Arasavalli, Sun God temple, Sri Suryanarayana Swamy, sun rays, Suryanarayana Swamy diety, skin diseases, belief, srikakulam, Andhra pradesh

The Sun God temple in Arasavalli witnessed devotees rush on Tuesday to witness the phenomenal event of sun rays touching the presiding deity of Sri Suryanarayana Swamy shrine.

ఆదిత్యుడిని తాకిన సూర్యకిరణాలు.. పులకించిన భక్తులు

Posted: 10/02/2018 10:57 AM IST
Devotees witness rare event at arasavalli

శ్రీకాకుళం జిల్లాలోని ప్రముఖ పుణ్యక్షేత్రమైన అరసవల్లి సూర్యనారాయణస్వామి దేవాలయంలో స్వయంగా ఆదిత్యుడే స్వయంబుగా వెలిశాడని ఐతిహ్యం.  కలియుగ ప్రజలకు ప్రత్యక్ష దైవంగా ప్రతీ పగలు దర్శనమిచ్చే సూర్యనారాయణుడి పవిత్ర ఆలయంలో ఇవాళ అద్భుత దృశ్యం ఆవిష్కృతమైంది. గత మూడేళ్ల స్వామివారి మూలవిరాట్ పై పరిపూర్ణంగా సూర్యకిరణాలు ఎప్పుడెప్పుడు పడతాయన్న అన్న భక్తుల నిరీక్షణకు ఎట్టకేలకు తెరపడింది.

మూడేళ్ల తర్వాత ఇవాళ సూర్యకిరణాలు ఏడు నిమిషాల పాటు స్వామివారిని తాకాయి. ఆదిత్యుని పాదాలను స్పృశించేందుకు భానుడు చేసిన ప్రయత్నానికి గత మూడేళ్లుగా మేఘాలు అడ్డుపడుతున్నాయి. ఇవాళ ఉదయం 6 గంటల 6 నిమిషాల సమయంలో స్వామివారి పాదాల నుంచి శిరస్సు వరకు బంగారం ఛాయ లేలేత కిరణాలు తాకాయి. దీంతో భక్తులు ఆనందోత్సాహాలతో పరవశించారు. అనేక మంది ఈ దృశ్యాలను ప్రత్యక్షంగా వీక్షించడంతో పులకించిపోయారు.

ఏటా ఉత్తరాయనం నుంచి దక్షిణాయనానికి మారే సందర్భంలో ఈ కిరణ స్పర్శ భాస్కరుడిని తాకుతుంది. స్వామివారి పాదాలను తాకి శిరస్సు వరకు వెళ్ళే ఈ అద్భుత ఘట్టం ఏటా భక్తులను కనువిందు చేస్తోంది. ఈ అపురూప దృశ్యాన్ని తిలకించేందుకు జిల్లా నుంచే కాకుండా రాష్ట్రంలోని ఇతర ప్రాంతాలు, వేరే రాష్ట్రాల నుంచి భక్తులు తరలివచ్చారు. ప్రతి సంవత్సరం మార్చి నెల 9, 10, అక్టోబరు 1, 2 తేదీల్లో సూర్యకిరణాలు మూలవిరాటును తాకుతాయి. మంగళవారం స్వామివారిని దర్శించుకునేందుకు వచ్చిన భక్తులు ఈ అద్భత దృశ్యాన్ని తిలకించి పరవశించిపోయారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Devotees  Arasavalli  Sun God temple  Sri Suryanarayana Swamy  sun rays  srikakulam  Andhra pradesh  

Other Articles