governor inaugrates 2nd phase metro rail అమీర్ పేట్ టు ఎల్బీనగర్ మెట్రో రైలు ప్రారంభం..

Hyderabad metro starts operations on ameerpet lb nagar route

Governor, ESL Narasimhan, inaugration, Hyderabad Metro Rail, ameepet-lb nagar route, metro rail 2nd phase, ameerpet to lb nagar route, K.T. Rama Rao, Bandaru Dattatreya, Minister ktr, twitter, LB nagar, Miyapur

The Hyderabad Metro Rail commenced its operations on the 16-km Ameerpet-LB Nagar route, Governor E.S.L. Narasimhan flagged off the train at the Ameerpet station.

అమీర్ పేట్ టు ఎల్బీనగర్ మెట్రో రైలు ప్రారంభం.. పచ్చజెండా ఊపిన గవర్నర్

Posted: 09/24/2018 02:49 PM IST
Hyderabad metro starts operations on ameerpet lb nagar route

నగరవాసులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూసిన అమీర్‌పేట్-ఎల్బీనగర్ మెట్రో రైలు సర్వీసును ఇవాళ లాంఛనంగా ప్రారంభించారు గవర్నర్ నరసింహన్. తన చేతుల మీదుగా మాజీ కేంద్రమంత్రి బండారు దత్తాత్రేయ, రాష్ట్ర మంత్రి కేటీఆర్ సహా పలువురు రాష్ట్ర మంత్రులు, మెట్రో రైలు అధికారుల సమక్షంలో పచ్చజెండాను ఊపిన గవర్నర్ రైలును లాంఛనంగా ప్రారంభించారు. రైలును ప్రారంభించిన అనంతరం ఆయన మంత్రులు, ఎంపీలతో కలసి ఎల్బీనగర్ వరకు ప్రయాణించారు.

సోమవారం మధ్యాహ్నం 12.15 గంటలకు గవర్నర్ నరసింహన్ అమీర్‌పేటలో అమీర్‌పేట-ఎల్బీనగర్ సేవలను జెండా ఊపి ప్రారంభించారు. అమీర్‌పేట నుంచి ఎల్బీనగర్ వరకు గవర్నర్ నరసింహన్ తో పాటు మంత్రులు కేటీఆర్, తలసాని శ్రీనివాస్ యాదవ్, పద్మారావు, నాయిని నర్సింహారెడ్డి, ఎంపీలు పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి, బండారు దత్తాత్రేయ, మెట్రో ఎండీ ఎన్వీఎస్ రెడ్డితో పాటు పలువురు అధికారులు ప్రయాణించారు. 16కిలోమీటర్ల ఈ మార్గంలో 17స్టేషన్లను ఏర్పాటు చేశారు. ప్రతి ఐదు నిమిషాలకు ఒక మెట్రో రైలును నడపనున్నారు.

కాగా ఇవాళ సాయంత్రం ఐదు గంటల నుంచి ఈ రూట్ లో ప్రజలకు ప్రయాణ సేవలు అందుబాటులోకి రానున్నాయి. ఎల్బీనగర్ మెట్రో ప్రారంభంతో నగర వాసులకు కొంత ఊరట కలగనుంది. ఇప్పటికే నాగోల్- మియాపూర్ సేవలు అందిస్తున్న మెట్రోకు విశేష స్పందన లభిస్తోంది. దాదాపు లక్షకుపైగా రోజు మెట్రోలో ప్రయాణిస్తున్నారు. ఎల్బీనగర్ రూట్ ప్రారంభం కావడంతో ఈ సంఖ్య రెండులక్షలను దాటుతుందని అధికారులు అంచనా వేస్తున్నారు. దేశంలోనే రెండో అత్యంత పొడవైన మెట్రో హైదరాబాద్ నగరంలో ప్రారంభం కావడం విశేషం.  

ఎల్బీనగర్ నుంచి మియాపూర్ రోడ్డు మార్గంలో వెళ్లాలంటే కనీసం రెండు గంటల సమయం పడుతుంది. అయితే మెట్రోలో మాత్రం ఈ ప్రయాణ సమయం సగానికి పైగా తగ్గిపోనుంది. మెట్రో ద్వారా ప్రయాణికులు ఇక ఎంతో వేగంగా తమ గమ్యస్థానాలకు చేరుకునే వెసలుబాటు కలుగుతుంది. మియాపూర్ నుంచి ఎల్బీ నగర్ కు మెట్రో రైలు 52 నిమిషాల్లోనే ప్రయాణిస్తుందని అధికారులు తెలిపారు. ఈ రూట్ లో 18 రైళ్లు తిరుగుతూ ఉంటాయని, ప్రస్తుతం ప్రతి 5 నిమిషాలకూ ఓ రైలును అందుబాటులో ఉంచేలా ప్రణాళికలు రూపొందించామని అన్నారు.

ఈ రెండు స్టేషన్ల మధ్యా 16 కిలోమీటర్ల దూరం ఉండగా,  పంజాగుట్ట, ఎర్రమంజిల్, ఖైరతాబాద్, లక్డీకపూల్, అసెంబ్లీ, నాంపల్లి, గాంధీభవన్, ఉస్మానియా మెడికల్ కాలేజ్, ఎంజీబీఎస్ జంక్షన్, మలక్ పేట, న్యూ మలక్ పేట, మూసారంబాగ్, దిల్ సుఖ్ నగర్, చైతన్యపురి, విక్టోరియా మెమోరియల్ స్టేషన్లు ఉన్నాయి. ఇక ఏసీ బస్సులో కూర్చుని మియాపూర్ నుంచి ఎల్బీ నగర్ వెళ్లాలంటే రూ. 78 చెల్లించాల్సివుంటుంది. అదే మెట్రోలో రూ. 60కే చేరుకోవచ్చు. పైగా వేగంగా కూడా వెళ్లవచ్చు. మధ్యలో నాంపల్లి రైల్వే స్టేషన్, ఎంజీబీఎస్ ఉండటంతో దూరప్రాంతాల నుంచి రైల్వే స్టేషన్, బస్టాండ్ లకు చేరుకునే ప్రయాణికులతో మెట్రోకు మరింత ప్రజాదరణ ఉంటుందని అంచనా.

ఎంజీబీఎస్ ఆసియాలోనే అతిపెద్ద మెట్రో స్టేషన్

ఎంజీబీఎస్ ఇంటర్‌చేంజ్ మెట్రో స్టేషన్ ఆసియాలోనే అతిపెద్దదని హెచ్‌ఎంఆర్‌ఎల్ ఎండీ ఎన్వీఎస్‌రెడ్డి పేర్కొన్నారు. ఇది కారిడార్ 1 మియాపూర్-ఎల్బీనగర్, కారిడార్ 2 జేబీఎస్-ఫలక్‌నూమాతో కలుపుతుంది. కారిడార్ 1ను జేబీఎస్ స్టేషన్‌లోని ఒకటి, రెండు అంతస్థులలో ఏర్పాటు చేశారు. కారిడార్ 2ను జేబీఎస్ మెట్రో స్టేషన్‌లోని మూడు, నాలుగు అంతస్థులలో ఏర్పాటు చేశారు. జేబీఎస్ రైల్వే స్టేషన్ను 140మీటర్ల పొడవు, 45మీటర్ల వెడల్పులో నిర్మించారు. అంతర్జాతీయ పర్యాటకాన్ని ఆకర్శించేలా స్టేషన్లను అభివృద్ధి చేస్తున్నట్టు ఎండీ పేర్కొన్నారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles