ఆప్త అంటే అగ్రరాజ్యంలో స్థిరపడిన తెలుగువారి ఐక్యతను చాటే ఓ తెలుగువారి సంస్థ . స్థానిక తెలుగువారికి తామున్నామన్న భరోసాన కల్పించడంతో పాటు అగ్రరాజ్యంలో వున్నా తెలుగు సంస్కృతి, సంప్రదాయాలను కాపాడుతూ.. తెలుగు బాషను, భాష ప్రాముఖ్యతను చాటుతున్న సంస్థ. తెలుగు విశిష్టతను చాటుతున్న ఈ సంస్థ.. "మానవ సేవయే మాధవ సేవ" అనే సిద్ధాంతాన్ని నమ్మిన ఆప్త సంస్థ 2008 సంవత్సరములో ఏర్పడి నేటికి ఒక దశాబ్ద కాలం పూర్తి చేసుకుంది.
అటు అమెరికాలో స్థాపించబడినా.. తమ మూలాలను మర్చిపోకుండా తమ దేశం, అందులోనూ తమ రాష్ట్రానికి సేవ చేసేందుకు నడుంచుట్టింది ఆప్త. వైద్యం అందని గ్రామాలలో ఉచిత మెగా వైద్య శిభిరాలను ఏర్పాటు చేసి అక్కడి పేద, బడుగు బలహీన వర్గాల ప్రజలకు ఉచితంగా అరోగ్య, వైద్య పరీక్షలను కూడా నిర్వహిస్తుంది ఆప్త. సరస్వతీ కటాక్షం వుండి లక్ష్మీ ప్రసన్నం చేసుకోలేని వారికి ఆప్త శ్రీమహాలక్ష్మిలా అభయాన్ని అందిస్తూ వారికి స్కాలర్ షిప్ లను అందిస్తూ వారి ఉజ్వల భవిష్యత్తుకు దోహదపడుతుంది. తొలిసారిగా 36 మంది విద్యార్ధులకు అందించిన సాల్కర్ షిప్ పది వసంతాలకు చేరుకునే క్రమంగా వరుసగా ప్రతీ ఏడాది పెరుగుతూ నేడు 1500 విద్యార్థులకు విస్తరింపజేశారు. ఈ స్కాలర్ షిప్ ల విలువ దాదాపుగా రెండున్నర కోట్ల రూపాయలు కావడం అభినందనీయం.
ఇటు రాష్ట్రంలోని అనగారిన వర్గాల మహిళలు, యువతులకు బాసటగా నిలుస్తూ వారిని నేటి తరం యువతులు పాటింటే పద్దతులవైపు ప్రేరణ కల్పిస్తుంది. పేద, బడుగు వర్గాల యువతులకు ఉచితంగా శానిటరీ నామ్ కిన్స్ అందిస్తంది. మరీ ముఖ్యంగా గ్రామాలలో యువతుల పట్ల వుండే అంక్షలను దాటుకుని వచ్చేలా చేస్తుంది. వారిని జాగృత పర్చి సమాజాంలో మహిళాశక్తిని కూడా మేల్కోపేలా చైతన్యం చేస్తుంది ఆప్త. దశాబ్దకాలాన్ని పూర్తి చేసుకున్న నేపథ్యంలో గత విజయాలను గుర్తుచేసుకుంటూ, భవిష్యత్ ప్రణాళికలను రచించుకుంటూ మరింత ముందుకు సాగేందుకు.. మరింతగా తమ సేవా కార్యక్రమాలను విస్తరించేందుకు అంగరంగ వైభవంగా జాతీయ సమావేశాన్ని నిర్వహించింది ఆప్త. ఈ శుభ సందర్భములో ఆప్త సంస్థ ఘనంగా ఆగస్టు 31 నుండి సెప్టెంబర్ 2 వరకు 3 రోజుల పాటు నేషనల్ కన్వెన్షన్ ను నిర్వహించింది.
అగ్రరాజ్యంలోని మేరీల్యాండ్ రాష్ట్రం.. బాల్టీమోర్ పట్టణం ఈ వేడుకులకు వేదికగా నిలించింది. ఈ నగరంలోని జోసెఫ్ మెయిర్హోఫ్ సింఫనీ హాల్ లో ఆప్త నేషనల్ కన్వెన్షన్ ఘనంగా నిర్వహించారు. ఆప్త జాతీయ సదస్సుకు ప్రపంచ నలుమూలల 4000 మంది తెలుగు వారు హాజరయ్యారు. అతిధులందరికి ఆప్త అతిధ్యమిచ్చింది.
ఆప్త కన్వెన్షన్ టీం తరుపున ఆప్త బోర్డు చైర్ పర్సెన్ శ్రీమతి రాధిక నైగాపుల, ఆప్త ప్రెసిడెంట్ గోపాల గూడపాటి, ఆప్త కన్వెన్షన్ 2018 కన్వీనర్ ధీరజ్ ఆకుల, కో కన్వీనర్లు లలిత బైరా, నటరాజు ఇల్లూరి, రెడ్డియ్య ప్రత్తిపాటి, శ్రీనివాస్ సిద్ధినేనిలు అతిధులకు శుభాభినందనలు తెలుపుతూ వారికి అన్ని ఏర్పాట్లను సమకూర్చారు. ఓ వైపు అతిధులకు ఎలాంటి అసౌకర్యాలు కలగకుండా వ్యవహరిస్తున్న వీరు.. మరోవైపు ఆప్త జాతీయ కన్వెన్షన్ లో ఏర్పాట్లును కూడా పర్యవేక్షించారు.
అయితే వీరికి ఆప్త ఫౌండర్స్ ప్రసాద్ సమ్మెట శ్రీనివాస్ చందు, శ్రీనివాస్ చిమట మరియు కన్వెన్షన్ కమిటీ సెక్రటరీ ఆనంద్ జవ్వాజి, సభ్యులు వీరబాబు ప్రత్తిపాటి, రాజ్ సిరిగిరి, శివ యర్రంశెట్టి, మధు దాసరి, రవీంద్రనాథ్ కొట్టే, రవి ముళ్ళపూడి, కిషోర్ ముత్యాల, రాజేష్ అంకం, ప్రవీణ్ అండపల్లి, బోర్డు సెక్రటరీ శివ కొప్పరాతి, జనరల్ సెక్రటరీ శౌరి ప్రసాద్ కొచ్చెర్ల, ఇతర కన్వెన్షన్ కమిటీ సభ్యులతో పాటు ఇతర తెలుగువారు కూడా అందుబాటులో వుండి అటు అతిధులతో పాటు ఇటు సాంస్కృతిక కార్యక్రమాలు అన్ని సవ్యంగా, సక్రమంగా జరగడంలో దోహదపడ్డారు. ఈ దశాబ్ద వేడుకులు అంగరంగ వైభవంగా జరగాడం వెనుక ఆప్త వ్యవస్థాపక సభ్యుడు, జాతీయ కన్వెన్షన్ చైర్మపర్సెన్ గా వ్యవహించిన శ్రీనివాస్ చందు కృషి, అహర్నిష శ్రమ కూడా దోహదపడింది. వేడుకల కోసం ఆయన ఎన్నో నెలలగా శ్రమించారు. చివరికి అవి ఘనంగా ముగియడంతో ఆయన ఆప్త కుటుంబసభ్యులందరితో సంతోషాన్ని పంచుకున్నారు.
కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీవారి శ్రీనివాస కళ్యాణంతో జాతీయ కన్వెన్షన్ కార్యక్రమాలు ప్రారంభమయ్యాయి. ఆ తరువాత తెలుగు వారి గోప్పదనాన్ని నలుదిశలా చాటిచెప్పేలా సాంస్కృతిక ప్రదర్శనలు ఆహుతులను ఎంతగానో అలరించాయి. ఈ వేడుకలకు తెలుగురాష్ట్రం నుంచి అనేక మంది ప్రముఖులు కూడా హాజరయ్యారు. ఈ సందర్భంగా విశ్వ విఖ్యాత నట చక్రవర్తి స్వర్గీయ ఎస్వీ రంగారావు (ఎస్వీఆర్) శత జయంతి ఉత్సవాలను కూడా ఆప్త కన్వెన్షన్ ఘనంగా నిర్వహించింది.
ఇక ఆప్త దశాబ్ద వారికోత్సవాల్లో సుస్వర సంగీత మాంత్రికుడిగా ఖ్యాతిగడించిన సంగీత దర్శకుడు దేవిశ్రీప్రసాద్ (డీఎస్పీ) కూడా సంగీత విభావరిని నిర్వహించారు. తన సంగీతంలో అహుతులను ఓలలాడించారు. అనేక చిత్రాలలోని పాటలను అలపించి.. ఇటు కుర్రకారుతో పాటు అటు ఆప్త వేడుకలలోని పాల్గోన్న అబాలగోపాలం డీఎస్సీ సంగీతానికి తాళం వేస్తూ ఎంజాయ్ చేశారు. ఈ కార్యక్రమాలతో పాటు ఆప్త ఆద్వర్యంలోని పలువురు పెద్దలు మరియు పిల్లలు నిర్వహించిన అనేక కార్యక్రమాలు అహుతులను అలరించాయి.
ఈ వేడుకలలో తెలుగు చిత్రసీమ రంగ అభివృద్దికి నిర్మాతగా తన వంతుగా కృషి చేస్తున్న గీతా అర్ట్స్ అధినేత అల్లు అరవింద్ కు అత్యున్నత పురస్కారం రఘుపతి వెంకయ్యనాయుడి అవార్డును ఇచ్చి సత్కరించారు. మేరీల్యాండ్ సెక్రటరీ అఫ్ స్టేట్ జాన్ సి. వబెన్ స్మిత్.. ఆప్తా తరపున అవార్డుని అల్లు అరవింద్ కి అందించి సత్కరించారు. విశ్వవిఖ్యాత నట చక్రవర్తి ఎస్వీ రంగారావు శతజయంతోత్సావాలను పురస్కరించుకుని అల్లు అరవింద్ చేత ఎస్వీఆర్ విగ్రహావిష్కరణ చేయించారు. అనంతరం ఎస్పీ రంగారావు పేరున ఎస్వీఆర్ సిల్వర్ కాయిన్ ను ఆయన మనవడి చేతికి తమ జాతీయ సదస్సులో అవిష్కరింపజేసి.. అందించింది ఆప్త. ఆ తరువాత ఎస్వీఆర్ పైన ప్రముఖ గేయరచయిత అనంత శ్రీరామ్ రచించిన అద్భుతమైన పాటను, ఆప్తవాణి సౌవెనీర్ పుస్తకాన్ని ఆవిష్కరించింది ఆప్త. సుబ్బు కోటకు లైఫ్టైమ్ అచివ్మెంట్ అవార్డుడును కూడా ఆప్త అందించింది.
ఆప్తా పది వసంతాలు పూర్తి చేసుకున్న మైలురాయి సందర్భంగా జరిగిన జాతీయ కన్వెన్షన్ లో హాజరుకాలేకపోయిన ప్రముఖ నటుడు, రాజ్యసభ సభ్యుడు మెగాస్టార్ చిరంజీవి.. ఆప్త సేవలను ప్రశంసిస్తూ తన వీడియో సందేశాన్ని పంపారు. ఈ సందర్భంగా ఆయన ఆప్త అధ్వర్యంలో చేస్తున్న సామాజిక సేవలను కొనియాడారు. ఆప్త కార్యక్రమాలు అత్యంత సూర్ఫిదాయకంగా నిలుస్తుందని.. అందులోని సామాజశ్రేయస్సును కాంక్షించే పెద్దలు ఎందరో వున్నారని వారి వల్లే.. ఆప్త చేపట్టిన కార్యక్రమాలు ప్రయోజనకరంగా మారుతున్నాయన్ని చిరంజీవి ప్రశంసించారు. ఇదే ఐక్యత, పట్టుదల, కృషితో ఆప్త మరింతగా ముందుకు సాగాలని, చిరుదీపంగా ప్రారంభమైన పయనం దేదీప్యమానంగా వెలుగోందాలని చిరంజీవి అకాంక్షించారు.
ఇక ఆప్త దశాబ్దఉత్సవాలను విజయవంతం చేయడానికి ప్రముఖ రాజకీయ నేతలు పల్లం రాజు, కన్నా లక్ష్మి నారాయణ, బొత్సా సత్యనారాయణ, సి రామచంద్రయ్య, కదిరి బాబు రావు, పి విజయ బాబు, రత్నం ముత్యాల, కృష్ణ రావు ముత్తంశెట్టి, దిలీప్ బైరా, రత్నాకర్ పండుగాయల, సామినేని ఉదయ భాను, వేణు గోపాల రావులు అగ్రరాజ్యానికి విచ్చేసి ఆప్త అతిధ్యాన్ని పోందారు. మూడు రోజుల పాటు సాగిన కార్యక్రమాల్లో పాల్గొన్నారు.
ఈ సందర్భంగా దాసరి అరుణ్ కుమార్, రవణం స్వామి నాయుడు, ప్రముఖ పారిశ్రామికవేత్త తులసి రామచంద్ర ప్రభు, ప్రముఖ సాహితివేత్త యర్రంశెట్టి సాయి, ప్రముఖ గాయకుడు జి ఆనంద్, ప్రముఖ టీటీ ప్లేయర్ ఉమేష్ ఆచంటలను ఆప్తి తమ జాతీయ వేడుకలను పురస్కరించుకుని ఘనంగా సత్కరించింది. రుచికరమైన తెలుగింటి విందు భోజనాలు ఆహూతులకు వడ్డించడమైనది. ఆప్త జాతీయ వేడుకలలో తమ ప్రదర్శించిన పలు సాంస్కృతిక కార్యక్రమాలు ఆహుతులను అకట్టుకున్నాయి.
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more