Allu Aravind Unveils The Statue Of SV Ranga Rao ఆప్త జాతీయ కన్వెన్షన్ లో ఎస్వీఆర్ విగ్రహావిష్కరణ..!

Allu aravind unveils the statue of sv ranga rao

Allu Aravind, SVR centenary celebrations, SVR statue, SVR latest, SVR news, SVR statue in USA, SVR statue in Baltimore, Allu Aravind unveils SVR statue, APTA 2018, APTA celebrations

Allu Aravind unveiled the statue of legendary actor SV Ranga Rao in the presence of the guests and the APTA members.

ఆప్త జాతీయ కన్వెన్షన్ లో ఎస్వీఆర్ విగ్రహావిష్కరణ..!

Posted: 09/17/2018 03:43 PM IST
Allu aravind unveils the statue of sv ranga rao

విశ్వవిఖ్యాత నట చక్రవర్తి.. నట సార్వబౌమ, నట సింహంగా ఖ్యాతి గడించిన సుప్రసిద్ద తెలుగు సినికళామతల్లి ముద్దుబిడ్డ, స్వర్గీయ సామర్ల వెంకట రంగారావు.. అలియాస్ ఎస్వీ రంగారావు.. తెలుగు ప్రేక్షకులు ముద్దుగా పిలుచుకునే ఎస్వీఆర్ శతజయంతి ఉత్సవాలను అగ్రరాజ్యం వేదికగా ఘనంగా నిర్వహించింది ఆప్త, అమెరికాలోని మేరీల్యాండ్ రాష్ట్రంలోగల బాల్టీమోర్ పట్టణంలోని జోసెఫ్ మెయిర్హోఫ్ సింఫనీ హాల్ లో ఆప్త నేషనల్ కన్వెన్షన్ లో భాగంగా ఎస్వీఆర్ శతజయంతి ఉత్సవాలను అంగరంగ వైభవంగా నిర్వహించారు ఆప్త సభ్యులు. ఎస్వీఆర్ విగ్రహాన్ని అవిష్కరించడంతో పాటు ఆయన శతజయంతి ఉత్సవాలను పురస్కరించుకుని వెండి నాణేన్ని కూడా విడుదల చేశారు.

Allu Aravind Unveils SV Ranga Rao Statue

ఎస్వీఆర్ అంటే..

 

పాత్రలలోకి పరకాయ ప్రవేశం చేసి.. నటనకు బదులు ఆయా పాత్రలకు జీవంపోసే ఎస్వీ రంగరావుకు సాటి గలరా చిత్రపరిశ్రమనందూ.. అంటూ తెలుగు సమా పరబాషల ప్రేక్షకుల చేత కూడా బహుపరాక్ ఎస్వీఆర్ బహుపరాక్ అనిపించుకన్న నటకోవిదుడ, నట యశస్వీ ఆయన అని చెప్పడంలో అతిశయోక్తి లేదు. పాత్రలలో జీవించి.. ఆయనను తెలుగు ప్రేక్షకులు తమ మనస్సులలోనూ గూడుకట్టుకున్నారు. తరాలు మారినా.. తన పేరు తెలియని తెలుగు ప్రేక్షకులు లేరని చాటుకుంటున్నారు.

SV Ranga Rao

ఇందు నటించగలడు.. అందు జీవించగలడు.. ఎందెందు వెతికినా అందందు తన నటనా కౌశల్యాని చాటగలడు అనేలా.. ప్రేక్షకులు కూడా ఔరా అనేలా మెప్పించగలడు ఎస్వీ రంగారావు. ప్రతినాయకుడి పాత్రైనా, కథానాయకుడి పాత్రైనా, ప్రధాన పాత్రైనా.. అంధుని పాత్రైనా.. మధ్యతరగతి వ్యక్తిగానైనా.. న్యాయమూర్తిగానైనా.. డాక్టరుగా, రైతుగా.. అన్నయ్యగా, తండ్రిగా, తాతగా ఇలా ఏ ప్రాతలకైనా జీవం పోసి.. ఎస్వీఆరే తప్ప మరోకరు కారు.. లేరు అన్నట్లుగా.. తన నటనతో మెప్పించగల నట మాంత్రికుడు ఎస్వీఆర్.

డిగ్రీ పట్టాను అందుకుని అగ్నిమాపక శాఖలో ఉన్నత ఉద్యోగిగా విధులు నిర్వహిస్తున్న ఆయన.. అదే సమయంలో ఇటు నాటకరంగస్థల కాళాకారుడిగా కూడా యుక్తవయస్సులోనే గుర్తింపును తెచ్చుకున్నారు. వరూధిని చిత్రంలో ప్రరాఖ్యుడిగా నటించి తెలుగు చిత్రసీమకు పరిచయమైన ఆయన.. మనదేశం, పల్లెటూరి పిల్ల, షావుకారు, పాతాళాభూరవి, పెళ్లిచేసి చూడు, బంగారు పాప, బాలనాగమ్మ, తాతా మనవడు, పండంటి కాపురం, ఇలా అనేక చిత్రాల్లో నటించి.,. తనదైన నటనతో మెప్పించి ప్రేక్షకులకు గుండెల్లో గూడుకట్టుకున్నారు.


(Video Source: JoinAPTA)

ఆప్త పదవ వసంతోత్సవ నేపథ్యంలో జాతీయ సమావేశాలను నిర్వహించిన ఆప్త.. ఎస్వీ రంగరావు శతజయంతి వేడుకలను కూడా ఘనంగా నిర్వహించింది. ఈ శుభసందర్భాన్ని పురస్కరించుకుని ఎస్వీఆర్ విగ్రహాన్ని అవిష్కరించింది. టాలీవుడ్ నిర్మాత, గీతా అర్ట్స్ అధినేత, రఘుపతి వెంకయ్యనాయుడు అవార్డు గ్రహీత, మెగా ప్రోడ్యూసర్ అల్లు అరవింద్ స్వర్గీయ ఎస్వీ రంగరావు విగ్రహాన్ని ఆవిష్కరించారు. వేదికపైనున్న అహుతులు, అతిరధ మహారాధులతో పాటు వేడుకలకు హాజరైన ఆప్త కుటుంబ సభ్యులు, అతిధి ప్రముఖుల సమక్షంలో అందరూ ఉత్కంఠగా ఎదురుచూస్తుండగా, ఆ శుభముహూర్తం వచ్చేసింది. వేలాది మంది ప్రేక్షకుల కరతళధ్వనుల మధ్య కేరింతలు, ఈలల మధ్య అల్లు అరవింద్.. ఎస్వీఆర్ విగ్రహాన్ని అవిష్కరించారు.

Allu Aravind Unveils SV Ranga Rao Statue Photos

Allu Aravind Speech At APTA Event

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఆప్త దశాబ్దవారికోత్సవాలలో నట శిఖరం, నట యశస్వి స్వర్గీయ ఎస్వీఆర్ విగ్రహాన్ని అవిష్కరించడం తన అదృష్టంగా భావిస్తున్నాని అన్నారు. తనకు ముందస్తుగా ఎలాంటి సమాచారం ఇవ్వకుండానే.. ఇక్కడకు వచ్చిన తరువాత తన చేతుల మీదుగా ఎస్వీఆర్ విగ్రహాన్ని ఆవిష్కరించాలని కోరడంతో తాను అశ్చర్యానికి లోనయ్యానని అల్లు అరవింద్ చెప్పారు. ఆప్త వేడుకలు హాజరయ్యేందుకు వచ్చిన తనను.. నిర్వాహకులు రిసీవ్ చేసుకుని ఘనంగా స్వాగతం పలికారని.. ఇది తనకు సంతోషాన్నిచ్చిందని వారికి అభినందనలు తెలిపారు అల్లు అరవింద్.

ఇక ఆప్త దశాబ్ద వేడుకలలో భాగంగా నిర్వహించిన జాతీయ కన్వెన్షన్ లో స్వర్గీయ ఎస్వీ రంగరావు వెండి నాణేన్ని కూడా విడుదల చేశారు. ఎస్వీ రంగారావు మనవడు చేతికి ఆప్త ఈ వెండి నాణేన్ని అందిందింది. తన తాత ఎస్వీ రంగారావు పేరున వెండి నాణేన్ని విడుదల చేయడం ఎంతో ఆనందంగా వుందని ఎస్వీఆర్ మనవడు సంతోషాన్ని వెలిబుచ్చాడు. ఈ నాణేం ఎస్వీ రంగరావు కుటుంబసభ్యులందరికీ సంతోషాన్నిస్తుందని ఆయన వ్యాఖ్యానించారు. ఆప్త దశాబ్ద వేడుకలలో ఈ నాణెం విడుదల చేయడం సంతోషాన్ని రెట్టింపు చేసిందని అన్నారు.

SV Ranga Rao Coin

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Allu Aravind  SV Ranga Rao  SVR centenary celebrations  

Other Articles