prisoner attack guards at Bhind police station సినీఫక్కీలో పోలీసులపై దాడి.. ఖైదీ పరారీ..

2 policemen violently attacked by under trial prisoner in madhya pradesh

accused attack policemen, Viral video, cctv footage, Vishnu Rajwat, Head constable, sentry, Gajraj, Umesh Babu, social media, Umri police station, Man Singh, bhind, madhya pradesh, crime

A 25-year old undertrial prisoner escaped from custody after attacking two policemen with a pickaxe in Umri police station of Bhind district in Madhya Pradesh.

ITEMVIDEOS: సినీఫక్కీలో పోలీసులపై దాడి.. ఖైదీ పరారీ..

Posted: 09/11/2018 02:53 PM IST
2 policemen violently attacked by under trial prisoner in madhya pradesh

సినీ ఫక్కీలో పోలీస్ స్టేషన్ లోని పోలీసులపై దాడి చేసిన ఓ నిందితుడు ఠాణా నుంచి పారిపోయిన ఘటన మధ్యప్రదేశ్ లో జరిగింది. పాతికేళ్ల అగంతకుడు అర్థరాత్రి వేళ పోలిస్ స్టేషన్లో వున్న హెడ్ కానిస్టేబుల్ పై దాడి చేయడంతో పాటు సెంట్రీ విధుల్లో వున్న కానిస్టేబుల్ పై విచక్షణ రహితంగా దాడి చేసి స్టేషన్ నుంచి తప్పించుకుపోయాడు. పోలిస్ స్టేషన్ లోని ఉక్కు నాగలి అకారంలో వున్న వస్తువును చేతబట్టుకుని ఇద్దరి పోలీసులను ఒక్కో ఏటు వేసి వారు అపస్మారకస్థితిలోకి జారుకోగానే తప్పించుకుపోయాడు. ఈ దారుణ ఘటన  మధ్యప్రదేశ్ లోని భిండ్ పోలీస్ స్టేషన్లో చోటు చేసుకుంది.

భిండ్ జిల్లా ఉమ్రీ పోలిస్ స్టేషన్ పరిధిలో జరిగిన ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు ఠాణా ఇంచార్జీ సిపీఎస్ చౌదరి తెలిపిన ప్రకారం ఇలా వున్నాయి. ఉమ్రిలోని స్థానిక మార్కెట్ వద్ద నానా హంగామా చేస్తున్నట్లు పిర్యాదులు రావడంతో అక్కడికి వెళ్లిన హెడ్ కానిస్టేబుల్ ఉమేష్ బాబు.. హంగామా చేస్తున్న పాతికేళ్ల అగంతకుడు విష్ణు రాజ్వత్ తో పాటు అతని స్నేహితుడు మన్ సింగ్ రాజ్ పుత్ లను అదుపులోకి తీసుకుని స్టేషన్ వచ్చాడు. స్టేషన్ లో వారిని కూర్చోబెట్టి హెడ్ కానిస్టేబుల్ ఎఫ్ఐఆర్ రాస్తువున్నాడు.

అయితే సెంట్రీగా విధులు నిర్వహించాల్సిన కానిస్టేబుల్ గజరాజ్ కూడా అర్థరాత్రి కావడంతో ఎవరూ లేరని హెడ్ కానిస్టేబుల్ వద్దకు చేరుకుని ఆయన పక్కనే కూర్చున్నాడు. అదను కోసం వేచి చూసిన విష్ణు.. స్టేషన్ లోని ఓ మూల వున్న ఉక్కు నాగలి ఆకారంలోని ఆయుధాన్ని చేతిలోకి తీసుకుని దాంతో ముందుగా హెడ్ కానిస్టేబుల్ తలపై వెనుకగా వస్తూనే వేటు వేయడంతో ఆయన వెంటనే సృహకొల్పోయాడు. ఏం జరిగిందని చూసే లోపు కానిస్టేబుల్ గజ్ రాజ్ ను కూడా అదే ఆయుధంతో తలపై మోదాడు. ఇద్దరు అపస్మారక స్థితిలోకి చేరుకోవడంలో విష్ణు తప్పించుకుని పారిపోయాడు.

పెట్రోలింగ్ విధులు ముగించుకుని వచ్చిన పోలీసులు ఘటనను చూసి అధికారులకు సమాచారం అందించారు. దీంతో అసలేం జరిగిందన్న వివరాలను తెలుసుకునేందుకు సిసిటీవీ ఫూటేజీని పోలీసులు పరిశీలించగా ఈ దారుణ ఘటన వివరాలు వెలుగులోకి వచ్చాయి. కాగా ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో చర్చనీయాంశంగా మారింది. కొందరు పోలీసులు బాధ్యతారాహిత్యం అంటుండగా, మరికొందరు మన చట్టం కల్పిస్తున్న అవకాశమంటూ కామెంట్లు పెడుతున్నారు. కాగా, పరారైన నిందితుడు విష్ణుపై హత్యాయత్నం సహా పలు సెక్షన్ల కింద కేసులు నమోదు చేశామని, త్వరలోనే నిందితుడ్ని పట్టుకుని అరెస్టు చేస్తామని చెప్పారు. ఇక ఉమేష్ ను చికిత్స నిమిత్తం ఢిల్లీకి తరలించగా.. మరో వ్యక్తిని స్థానిక జిల్లా ఆసుపత్రికి తరలించారు. ఇద్దరి పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Vishnu  Umri police  cctv footage  Bhind district  madhya pradesh  viral videos  crime  

Other Articles