IMERG Calculates Monsoon Rainfall Over India కేరళ, కర్ణాటకలో వరదల బీభత్సం అందుకే..

Imerg calculates monsoon rainfall over india

nasa, IMERG, GPM, Global Precipitation Measurement mission, India, India monsoon, Kerala flood, karnataka floods, odisha rains, bay of bengal,

Rainfall accumulations from Aug. 13 to 20, 2018 showed two bands of heavy rain across India. The first band appeared much broader and extends across the northern part of the peninsula.

ITEMVIDEOS: కేరళ, కర్ణాటకలో వరదల బీభత్సం అందుకే..

Posted: 08/23/2018 04:32 PM IST
Imerg calculates monsoon rainfall over india

గత వారం ఇండియాలో కురిసిన భారీ వర్షాల తాలూకు శాటిలైట్ డేటాను ఉపయోగించి నాసా ఓ వీడియో రిలీజ్ చేసింది. ఈ వీడియో ఆధారంగా కేరళలో కురిసిన భారీ వర్షాలపై ఓ అంచనా వచ్చింది. ఎడతెరపి లేని వానల వల్ల కేరళతోపాటు కర్ణాటకలోని కొన్ని ప్రాంతాల్లోనూ వరదలు వచ్చిన విషయం తెలిసిందే. సాధారణంగా ఈ సమయంలో దేశంలో భారీ వర్షాలు కురుస్తుంటాయి. దీనికితోడు అల్పపీడనాల వల్ల మరిన్ని భారీ వర్షాలు కురుస్తున్నాయి. కేరళ అయితే గత వందేళ్లలో ఎన్నడూ చూడని వర్షాల బారిన పడింది. మొత్తం 231 మంది ఈ వరదల్లో మృత్యువాత పడగా.. కొన్ని లక్షల మంది ఇళ్లు వదిలి పునరావాస కేంద్రాల్లో తలదాచుకుంటున్నారు.

ఆగస్ట్ 13 నుంచి 20 వరకు ఇండియాలో భారీ వర్షాలు కురిసినట్లు నాసా ఒక ప్రకటనలో వెల్లడించింది. ముఖ్యంగా దేశంలోని పశ్చిమ ప్రాంతంలో అతి భారీ వర్షాలు కురిసినట్లు నాసా తెలిపింది. నాసా శాటిలైట్ ప్రతి అరగంటకోసారి డేటాను పంపిస్తుంది. దీనివల్ల ఎప్పటికప్పుడు ప్రపంచవ్యాప్తంగా కురుస్తున్న వర్షపాతంపై శాస్త్రవేత్తలు ఓ అంచనాకు వచ్చే వీలు కలుగుతుంది. ఈ క్రమంలో ఈ నెల 13 నుంచి 20 వరకు భారత్ పై వాయుగుండాల ప్రభావంతో కురిసిన వర్షాలు ప్రభావాన్ని తెలియజేస్తూ తాజాగా ఓ నివేదికను పంపింది.

ఈ నివేదిక ప్రకారంలో 13వ తేదీ నుంచి భారత్ దేశంలో రెండు బ్యాండ్ లతో భారీ నుంచి అతిభారీ వర్షాలు కురిసాయని స్పష్టం చేస్తుంది. తొలి బ్యాండ్ విస్తీర్ణం విస్తారంగా వుండటంతో పాటు ఉత్తర భారతావనిలో కూడా వర్షాలు సమృద్దిగా కురిసాయని తెలుపుతుంది. ఈ వారం రోజుల్లో ఉత్తర భారతావనిలో దాదాపుకుగా 120 మిల్లీమీటరల్ వర్షపాతం (ఐదించుల వర్షం) నమోదైందని తెలుస్తుంది. ఇక ఉత్తరం నుంచి పశ్చిమ భారత వరకు విస్తరించిన ఈ బ్యాండ్ లో పశ్చమంలో మాత్రం సుమారుగా 350 మిల్లీమీటరల్ వర్షపాతం దాదపుగా 14 ఇంచుల వరకు నమోదైందని స్పష్టం చేస్తుంది.

ఇదిలావుండగా కేరళ, కర్ణాటక సహా తెలుగురాష్ట్రాలలో ప్రభావం చూసిన వర్షం జోరుగా, ఏకధాటిగా ప్రాంతాలకు పరిమితమై కురవడంతో అత్యంత అధిక వర్షపాతం నమోదైందని, దీని ప్రభావంతోనే వరదలు సంభవించి ఆయా రాష్ట్రాల్లో ప్రజా జీవనం స్థంభించిపోయిందని కూడా వెల్లడించింది. వాయువ్య నుంచి పశ్చియ ఘాట్ల వరకు కుండపోత వర్షం పడిందని, ఆయా ప్రాంతాలలో ఏకంగా 250 మిల్లీమీటర్ల వర్షపాతం నుంచి 400 మిల్లీమీటర్ల (16 ఇంచుల) వర్షపాతం నమోదైందని నివేదిక వెల్లడించింది. సగటున ఈ ప్రాంతంతో 18.5 ఇంచుల వర్షపాతం నమోదైందని కూడా తెలిపింది. ఇంత పెద్దఎత్తున్న వర్షపాతం నమోదు కావడంతోనే కేరళ, కర్ణాటక సహా తెలుగు రాష్ట్రాల్లో వరదలు బీభత్సం సృష్టించాయి.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : nasa  IMERG  GPM  India monsoon  Kerala flood  karnataka rains  bay of bengal  

Other Articles