Bakra Eid, Eid-ul-Adha country wide celebrations దేశవ్యాప్తంగా బక్రీద్ వేడుకలు.. ప్రముఖుల శుభాకాంక్షలు

Bakra eid eid ul adha country wide celebrations

bakrid, greetings, KCR, chief minister, K,Chandrashekar Rao, governor, ESL Narasimhan, telangana goverment, PM Modi, Rahul Gandhi, eid 2018 eid 2018 date eid 2018 date india eid al adha 2018 bakra eid bakra eid 2018 date bakra eid 2018 date in india happy bakra eid happy bakra eid 2018 eid al adha 2018 date eid al adha 2018 date in india eid al adha 2018 wishes

Bakrid, Eid al-Adha is celebrated in order to pay respects to Ibrahim, who was considered to be one of the most dutiful admirers of Allah and was ready to sacrifice his son on Allah's request.

దేశవ్యాప్తంగా బక్రీద్ వేడుకలు.. ప్రముఖుల శుభాకాంక్షలు

Posted: 08/22/2018 11:09 AM IST
Bakra eid eid ul adha country wide celebrations

దేశవ్యాప్తంగా బక్రీద్ వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. ప్రవక్త హజ్రత్ ఇబ్రహీం ఆయన కుమారుడు ఇస్మాయిల్ చేసిన త్యాగాన్ని స్మరించుకుంటూ ముస్లిం సోదరులు ఈ పండుగను ఘనంగా చేసుకుంటున్నారు. ఈద్గాలు, మసీదుల్లో ముస్లిం సోదరులు ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు. మసీదులు, ఈద్గాలు ముస్లిం సోదరులతో కిక్కిరిసి పోయాయి. ఇబ్రహీం స్ఫూర్తితో దైవమార్గంలో ప్రాణాన్ని కూడా త్యాగం చేస్తామంటూ ముస్లింలంతా బక్రీద్ రోజు నమాజ్ పూర్తయిన తర్వాత ఖుర్భానీ ఇస్తారు. ప్రపంచ వ్యాప్తంగా లక్షలాది మంది హజ్ యాత్రికులు బక్రీద్ రోజు మక్కాను సందర్శించి ప్రత్యేక ప్రార్థనలు చేస్తారు. ఇస్లాం సాంప్రదాయం ప్రకారం బక్రీద్ పండుగను పవిత్ర దినంగా భావిస్తారు.

బక్రీద్‌ను పురస్కరించుకొని తెలంగాణలోని ముస్లింలకు రాష్ట్ర గవర్నర్‌ ఈఎస్‌ఎల్‌ నరసింహన్‌, సీఎం కేసీఆర్ శుభాకాంక్షలు  తెలిపారు‌. త్యాగానికి ప్రతీకగా ముస్లింలు ఈ పండుగను జరుపుకుంటున్నారని తెలిపారు సీఎం కేసీఆర్. త్యాగనిరతి, భక్తిభావానికి బక్రీద్ ప్రతీక అన్నారు గవర్నర్ నరసింహన్. ఈ పండుగ సందర్భంగా ముస్లింలకు ఉపముఖ్యమంత్రులు మహమూద్‌ అలీ, కడియం శ్రీహరి, మంత్రులు కేటీఆర్‌, హరీశ్‌రావు, ఎంపీ కల్వకుంట్ల కవిత శుభాకాంక్షలు తెలియజేశారు. ముస్లింల సంక్షేమంలో తెలంగాణ దేశంలో మొదటి స్థానంలో ఉందని డిప్యూటీ సీఎం మహమూద్‌ అలీ అభివర్ణించారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : bakrid  greetings  KCR  K  Chandrashekar Rao  ESL Narasimhan  telangana goverment  

Other Articles