PM Modi to visit flood-hit Kerala కేరళ వరద ప్రభావిత ప్రాంతాలలో ప్రధాని ఏరియల్ సర్వే..

Death toll rising pm modi to visit flood hit state today

floods in kerala, heavy rain in kerala, kerala floods, kerala rains, Pinarayi Vijayan, narendra modi, periyar river, unprecedented rainfall, Trichur, Aluva, Muvattupuzha, Cochin International Airport, K J Alphons, Onam festival

Prime Minister Narendra Modi is expected to arrive in Kerala on Friday and undertake an aerial survey of the flood ravaged areas on Saturday as the death toll has risen to 167.

ITEMVIDEOS: ఒనమ్ వేడుకలకు మళయాలీలు దూరం.. కేరళ పర్యటనకు ప్రధాని

Posted: 08/17/2018 12:24 PM IST
Death toll rising pm modi to visit flood hit state today

మళయాలీ ప్రజలు అత్యంత పవిత్రంగా దాదాపు పది రోజుల పాటు జరుపుకునే ఒనమ్ పండుగకు దూరం కానున్నారు. పంటల పండాలని జరుపుకునే ఒనమ్ పండగ ఈ నెల 15 నుంచి ప్రారంభం కాగా, ఈ నెల24 వరకు కొనసాగనుంది. అయితే ఏకధాటిగా కురుస్తున్న వర్షంతో పాటు వరదల ప్రభావం.. కొండచరియలు విరిగిపడటంతో కేరళవ్యాప్తంగా వరుణుడు విలయ తాండవం చేస్తున్నాడు. పది రోజులుగా కురుస్తోన్న భారీ వర్షాలతో కేరళ అతలాకుతలమవుతోంది. వరదలకు ఒక్క గురువారమే 30 మంది మృత్యువాతపడ్డారు.

ఆగస్టు 8 నుంచి ఇప్పటిదాకా వరదల వల్ల రాష్ట్రవ్యాప్తంగా 167 మంది ప్రాణాలు కోల్పోయారు. భారీ వర్షాలకు తోడు అనేక ప్రాంతాల్లో కొండచరియలు విరిగిపడ్డటంతో కేరళ అతలాకుతలం అవుతుంది. వాయు, రోడ్డు, రైలు సహా నీటి మార్గాలన్నింటిపై వర్ష ప్రభావం నెలకొంది. రాష్ట్ర వ్యాప్తంగా జనజీవనం స్థంభించింది. రాష్ట్రంలోని వరద ముంపు ప్రాంతాల్లోని సుమారు 1.67 లక్షల మంది ప్రజలను ఆర్మీ, నావికా, రెస్కూ టీమ్ లు సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్నాయి. వరద బాధితుల కోసం ప్రభుత్వం ఏకంగా 1,165 సహాయ పునరావాస శిబిరాలను ఏర్పాటుచేసింది. దీంతో రాష్ట్రంలోని ఏకంగా 14 జిల్లాల్లో ప్రభుత్వం రెడ్ అలర్ట్ ప్రకటించింది.

అయితే తాజాగా భారత వాతావరణ శాఖ అందించిన సమాచారం మేరకు ఉత్తర కేరళలో వర్షం కొండ ఎడతెరపినిచ్చినా.. సెంట్రల్ కేరళలో మాత్రం ఇంకా వర్షబీభత్సం కొనసాగుతూనే వుంది. కోచితో పాటు కేరళలోని అనేక ప్రాంతాలు ముంపులో చిక్కుకున్నాయి. రిజర్వాయర్లు పూర్తిగా నిండిపోయి ప్రమాదకర స్థాయికి చేరుకున్నాయి. కేరళలోని 39 ప్రాజెక్టులలో చరిత్రలోనే తొలిసారిగా 35 ప్రాజెక్టుల నుంచి నీటిని విడుదల చేస్తున్నారు. ఇక కోచి అంతర్జాతీయ విమానాశ్రయాన్నిఈనెల 26 వరకు మూసివేస్తున్నట్టు అధికారులు ప్రకటించారు.

కేరళలో వరుణుడు విలయతాండవం చేయడంతో అతలాకుతలమైన ప్రభావిత ప్రాంతాలను ప్రధాని నరేంద్ర మోదీ ఏరియల్ సర్వే నిర్వహించనున్నారు. ఇవాళ సాయంత్రం కేరళకు చేరుకుని శనివారం ఉదయం వరద ప్రభావిత ప్రాంతాల్లో ఏరియల్ సర్వే నిర్వహిస్తారు. రాష్ట్రంలో వరద పరిస్థితిపై కేరళ ముఖ్యమంత్రి విజయన్ ప్రధాని మోదీకి వివరించారు. మరోవైపు మారుమూల ప్రాంతాల్లో సహాయక చర్యలకు ఆంటకం ఏర్పడంతో మృతుల సంఖ్య ఇంకా పెరిగే అవకాశం ఉందని అధికారులు తెలిపారు. ప్రాణాలను దక్కించుకోడానికి వందలాది మంది ప్రజలు ఇంటి పైకప్పులు, పొడవైన భవంతులపైకి ఎక్కి తలదాంచుకుంటున్నారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles