Conspiracies behind my arrest alleges comedian hari కుట్రపూరితంగా కేసుల్లో ఇరికించారు: జబర్దస్త్ హరి

Conspiracies behind my arrest alleges comedian hari

Red Sandal Smuggler, Hari babu, constable, jabardast, Lady getup artist, comedian, conspiracy, Red Sandal, jabardast artist, jabardasth comedian, Jabardast, tirupati, tollywood, Crime

comedian Hari babu alleges that a conistable conspiracy is behind his arrest after he complaiting on him to his superiors

కుట్రపూరితంగా కేసుల్లో ఇరికించారు: జబర్దస్త్ హరి

Posted: 07/18/2018 11:37 AM IST
Conspiracies behind my arrest alleges comedian hari

పూట గడవక పోవడంతో పొట్టపోసుకునేందుకు జబర్ధస్త్ షోలో లేడీ గెటప్ వేసి అర్టిస్టుగా నవ్వించి.. ఆ తరువాత ఎర్రచందనాన్ని అక్రమంగా రవాణా చేసి కోట్లు గడించి సినిమాల్లో పెట్టుబడుటు పెట్టే స్థాయికి ఎదిగినట్టు ఆరోపణలు ఎదుర్కొంటున్న కమేడియన్ హరిబాబు అలియాస్ శ్రీహరి, తన అరెస్టు విషయంలో కుట్ర దాగివుందని అరోపించారు. పోలీసులకు లొంగిపోయిన తరువాత మీడియాతో మాట్లాడుతూ, తనను ఓ కానిస్టేబుల్ కావాలనే ఈ కేసులో ఇరికించాడని ఆరోపించారు.

తాను ఒక్కసారి చేసిన తప్పును పదే పదే చేశానని, అక్రమ రవాణతో కోట్లకు పడగలెత్తానని ఉన్నతాధికారులకు చెప్పి.. తనపై కేసులు నమోదయ్యేలా చేశాడని హరిబాబు అరోపించారు. అయితే ఇదే సమయంలో తాను గతంలో తన పరిస్థితి బాగాలేక ఒకే ఒక్కసారి ఎర్రచందనం స్మగ్లింగ్ చేశానని, ఆ తరువాత ఎన్నడూ ఆ పని చేయలేదని చెప్పాడు. అయితే జబర్దస్థ్ కామేడీ షో ద్వారా మంచి పేరు ప్రఖ్యాతులు తెచ్చుకుని ఎదుగుతున్న తనను స్థాయిని చూసి ఓర్వలేక కానిస్టేబుల్ తనపై కుట్రపూరితంగానే కేసులు బనాయించాడని అన్నారు.

ఓ పోలీస్ కానిస్టేబుల్ ఎర్రచందనాన్ని అక్రమంగా రవాణా చేస్తుంటే, తాను పోలీసు ఉన్నతాధికారులకు సమాచారం ఇచ్చి పట్టించానని, ఆ కోపంతో తనపై పగను పెంచుకున్న కానిస్టేబుల్ తనపై అనేక తప్పుడు కేసులు పెట్టి ఇరికించాడని చెప్పాడు. కాగా, హరి ఇటీవల షకలక శంకర్ హీరోగా నటించిన 'శంభోశంకర' చిత్రానికి ఫైనాన్స్ చేసినట్టు వార్తలు వచ్చిన సంగతి తెలిసిందే. గత ఐదు రోజులుగా అతని కోసం గాలిస్తుండగా, తన న్యాయవాదితో పాటు వచ్చిన హరి, తిరుపతి టాస్క్ ఫోర్స్ ఐజీ కాంతారావు ఎదుట లొంగిపోయాడు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Hari babu  constable  jabardast  Lady getup artist  comedian  conspiracy  Red Sandal  Crime  

Other Articles