WhatsApp trick used on Tamil actress for prostitution సెక్స్ రాకెట్ గుట్టును రట్టు చేసిన నటి కాంప్లెట్

Cops arrest duo for making indecent proposal to actress

film actresses, Jaya lakshmi, Puzhal Central Prison, actress, VVIPs, AVS, facebook, twitter, relationship service, price tags, youth, movie female artists, kollywood, movies, entertainment

Anti-vice squad officials of the Tamil Nadu police arrested two men for sending indecent messages to Kollywood actress Jayalakshmi. In her complaint, she said the men offered her money to entertain some VVIPs and politicians.

సెక్స్ రాకెట్ గుట్టును రట్టు చేసిన నటి కంప్లైంట్

Posted: 07/14/2018 10:27 AM IST
Cops arrest duo for making indecent proposal to actress

సోషల్ మీడియా వేదికగా నిర్వహిస్తున్న భారీ సెక్స్ రాకెట్ ను పోలీసులు గుట్టురట్టు చేశారు. ఇందుకు మూలకారణమైన ఇద్దరు నిందితులను కూడా అదుపులోకి తీసుకున్నారు. చెన్నై కేంద్రంగా రాష్ట్రంతో పాటు పోరుగు రాష్ట్రాల యువకులకు వల వేసి ట్రాప్ చేస్తున్న ఇద్దరు సభ్యుల ముఠాను అదుపులోకి తీసుకున్న పోలీసులు వారిని విచారిస్తున్నారు. విటులను సిద్దం చేసుకున్న తరువాత ఈ ముఠా సభ్యులు తమిళ నటీమణులను కూడా టార్గెట్ చేస్తూ వారిని కూడా ట్రాప్ లోకి దింపేందుకు చేస్తున్న ప్రయత్నాలే వారిని కటకటాలు లెక్కించేలా చేశాయి.

అన్నానగర్ లో నివసించే తమిళ సినీ నటి జయలక్ష్మి ఫిర్యాదుతో సెక్స్ రాకెట్ గుట్టు రట్టు అయింది. రిలేషన్ షిప్ డేటింగ్ సర్వీస్ పేరుతో కొన్ని రోజులుగా రెండు నంబర్ల నుంచి తన వాట్సాప్‌కు అభ్యంతరకరమైన మెసజ్ లు వస్తున్నట్టు ఆమె తన ఫిర్యాదులో పేర్కొన్నారు. డేటింగ్ ఇష్టపడేవారి కోసం ఇది ప్రత్యేకమని, డేటింగ్ చేసేందుకు వీఐపీలు కూడా సిద్ధంగా ఉన్నారని, రూ.30 వేల నుంచి రూ.3 లక్షలు వరకు చెల్లించేందుకు రెడీగా ఉన్నారని మెసేజ్‌లు వస్తున్నట్టు ఆమె తన ఫిర్యాదులో పేర్కొన్నారు.

నటి ఫిర్యాదుతో రంగంలోకి దిగిన పోలీసులు వాట్సాప్ సందేశాలు ఎక్కడి నుంచి వస్తున్నదీ గుర్తించారు. విరుగంబాక్కానికి చెందిన మురుగ పెరుమాన్, కవియరసన్‌‌లే వీటిని పంపుతున్నట్టు నిర్ధారించుకుని ఇద్దరినీ అదుపులోకి తీసుకున్నారు. యువకుల నుంచి స్వాధీనం చేసుకున్న సెల్‌ఫోన్లలోని ఫొటోలను, అందులోని వివరాలను చూసి పోలీసులు నిర్ఘాంతపోయారు. అందులో బోలెడంతమంది కోలీవుడ్ మహిళా నటుల ఫొటోలు, వారి ధరలతో సహా ఉన్నాయి.

ఆ ఫొటోల్లో ఉన్న ప్రముఖ యువ నటితో గడిపేందుకు రూ.40 లక్షలు చెల్లించాల్సి ఉంటుందని ఓ కస్టమర్‌కు మెసేజ్ పెట్టినట్టు పోలీసులు తెలిపారు. ఇలా మొత్తం 70 మంది యువతుల అసభ్య ఫొటోలు, వారి రేట్లతో సహా ఉన్నట్టు పేర్కొన్నారు. వాట్సాప్ చాటింగ్‌లను సేకరించిన పోలీసులు.. ఫొటోలు, రేట్లు ఉన్న ఫొటో ఆల్బమ్‌ను స్వాధీనం చేసుకున్నారు. ఈ మొత్తం వ్యవహారంపై ఎవరైనా పెద్దల హస్తం ఉందా? అన్న కోణంలో పోలీసులు దర్యాప్తు చేపట్టారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : film actresses  Jaya lakshmi  Puzhal Central Prison  actress  VVIPs  AVS  kollywood  

Other Articles