5 behind bars for street racing with auto rickshaws కటకటాల్లోకి పోలీసులకు సవాల్ విసిరిన అటోడ్రైవర్లు..

Illegal auto race menace challenge cops to catch them chennai

Vandalur, Minjur, Nemilichery, auto racing, autorickshaw racing, Kundrathur, Chennai, street racing, Tamil Nadu, crime

Illegal auto racing menace in the city, a group of 15 auto races, causing nuisance to the locals in Chennai, cops seized 6 autos and arrested 5 drivers. They ignored police warnings infact challenged cops to catch them.

ITEMVIDEOS: కటకటాల్లోకి పోలీసులకు సవాల్ విసిరిన అటోడ్రైవర్లు..

Posted: 07/06/2018 10:19 AM IST
Illegal auto race menace challenge cops to catch them chennai

రోడ్డు నిర్మాణాలు అందరి సౌలభ్యం కోసం. కానీ రోడ్డపైకి వెళ్లాలంటేనే భయాందోళనగా వుంటుంది. ఓ వైపు అతుకులు, గతుకుల రోడ్లు మరోవైపు ట్రాఫిక్ జామ్. ఈ నేపథ్యంలో నగర ట్రాఫిక్ కు దూరంగా రింగ్ రోడ్డు నిర్మాణాన్ని నూతనంగా చేపట్టగా దానిపై బైక్ రేసులు, కారు రేసులు వాహనదారులను హడలెత్తిస్తున్నాయి. అసలు రేసులు అన్నవి చట్టవిరద్దమని చెప్పి. పోలీసులు ఎన్నో రకాలుగా అటు బైక్, కారు వాహనదారులకు అవగాహన తీసుకువచ్చి వాటిని అదుపు చేశారు.

అయితే ఇప్పుడు తాజాగా బైక్ రేసులు, కారు రేస్‌లు కాకుండా ఆటో రేస్‌లు వాహనదారులను భయకంపితుల్ని చేస్తున్నాయి. ఇదేం ప్రశ్ని షాకవ్వకండి.. చెన్నైలో ఈ మధ్య ఈ రేస్‌లు బాగా జరుగుతున్నాయట. విషయం తెలుసుకొని పట్టుకుందామని పోయిన పోలీసులకు డ్రైవర్లు షాకిచ్చారు. దమ్ముంటే పట్టుకోవాలని సవాల్ విసిరారు. సినిమా రేంజ్‌లో సాగిన ఈ ఛేజ్ సీన్ వీడియోలో సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. చెన్నై సమీపంలోని అవుటర్ రింగ్ రోడ్డుపై ఈ రేస్‌లు జోరుగా సాగుతున్నాయి. వీళ్ల రేస్‌లతో జనాలు రోడ్డుపైకి వెళ్లాలంటే భయపడిపోతున్నారు.

ఓవర్ స్పీడ్‌తో ఏ ఆటో వచ్చి ఢీకొడుతుందోనని వణికిపోతున్నారు. రేస్‌ల వ్యవహారం ఆ నోటా ఈ నోటా పోలీసులకు చేరింది. వెంటనే రంగంలోకి దిగి రేస్‌లు నిర్వహిస్తున్నవారిని పట్టుకుందామని రింగ్ రోడ్డు వైపు వెళ్లారు. పోలీసులు రావడాన్ని డ్రైవర్లు గమనించారు. ఆటోలను స్పీడ్‌ పెంచి వాళ్లకు దొరక్కుండా దూసుకెళ్లారు. పోలీసులు కూడా బైక్‌పై వారిని ఛేజ్ చేశారు. అరగంట తర్వాత కాని వారికి దొరకలేదు. ఆటోలను సీజ్ చేసి కొంతమందిని అరెస్ట్ చేశారు. పరారీలో ఉన్న మరికొందరు కోసం గాలిస్తున్నారు. చాలా రోజులుగా ఆటో డ్రైవర్లు ఈ రేసులు నిర్వహిస్తున్నట్లు స్థానికులు చెబుతున్నారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Vandalur  Minjur  Nemilichery  auto racing  autorickshaw racing  Kundrathur  Chennai  street racing  Tamil Nadu  crime  

Other Articles