మలివిడత ఉత్తరాంధ్ర పోరాట యాత్రలో భాగంగా విశాఖలో పర్యటిస్తున్న జనసేన అధినేత పవన్ కల్యాన్ ప్రస్తుతం విశాఖలో పర్యటిస్తున్నారు. ఈ సందర్భంగా ఆయన మధురవాడలోని సర్వే నెంబర్ 336ను పరిశీలించారు. ఈ సర్వేనెంబరులో వున్న కొండపై వివిధ ఐటీ శాఖలకు ఏపీ ప్రభుత్వం స్థలాలను కేటాయించింది. ఈ స్థలాలను జనసేన అధినేత పవన్ కల్యాణ్ ఈరోజు పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ఇక్కడ నెలకొల్పుతున్న స్థలాల్లో ఎక్కువ ఉద్యోగాలు స్థానికులకే ఇవ్వాలని డిమాండ్ చేశారు.
స్థానికులకు అవకాశాలు ఇవ్వకుండా, స్థానికేతరులకు ఉద్యోగాలు ఇస్తుండటం వల్లనే ప్రాంతీయ భేదాలు వస్తున్నాయని అన్నారు. చంద్రబాబు వస్తే జాబు వస్తుందని ప్రకటనలు చూసి తాను నమ్మానని.. అయితే ఆయన నిరుద్యోగ కొడుక్కు ఎమ్మెల్సీగా, మంత్రిగా బాబు జాబు ఇప్పించుకున్నాడే.. కానీ ఆయన రాష్ట్ర యువతకు ఇచ్చిన హామీని మాత్రం గంగలో కలిపాడని విమర్శించారు. తాను శ్రీకాకుళం జిల్లా పాడేరు తదితర ప్రాంతాలను పర్యటించి అక్కడున్న యువత గురించి వాకాబు చేస్తే.. కొందరు యువకులు గంజాయి సేవించడం, ఆ మొక్కలు పెంచి వ్యాపారంగా మార్చుకున్నారని పలువురు అరోపించారన్నారు.
అయితే వారిని తప్పబట్టని పవన్ కల్యాన్ వారికి సక్రమంగా మార్గనిర్ధేకత్వం చేయలేకపోవడం ప్రభుత్వాల తప్పు కానీ.. చెడు మార్గం పట్టడం యువత తప్పుకాదని అన్నారు. ప్రభుత్వాలకు యువతను తిట్టే హక్కు లేదని వారికి కావాల్సిన విద్యను అందించకుండా, వారిలో నైపుణ్యాలను పెంచేందుకు కేంద్రాలను ఏర్పాటు చేయకుండా.. వారు వక్రమార్గం పట్టడానికి ప్రభుత్వ వైఫల్యమే కారణం కానీ యువత నైపుణ్యం లేదన్నది కారణం కాదని పవన్ అన్నారు. ఇక విదేశాల్లో తక్కువ స్థలాల్లోనే తమ కార్యకలాపాలను కొనసాగిస్తున్న కంపెనీలకు... ఇక్కడ ఇంత పెద్ద మొత్తంలో స్థలాలను కేటాయించాల్సిన అవసరం ఏమొచ్చిందని ప్రశ్నించారు. విశాఖ నగరంలో అన్ని అంశాల్లో స్థానికులకే పెద్ద పీట వేయాలని చెప్పారు.
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more