'Sex for secret:' Church suspends five priests పాప పరిహారం కోసం వచ్చిన యువతిపై పాస్టర్ల అత్యాచారం..

Sex for secret malankara orthodox church suspends five priests

Sex for secret, Malankara Orthodox Church, five priests, Canon Law, sexually exploit, confession, P C Elias, Kerala, crime

Five priests have been directed to keep away from their official duties following a complaint from a believer alleging they have been blackmailing his wife for sexual favours.

పాప పరిహారం కోసం వచ్చిన వివాహితపై పాస్టర్ల అత్యాచారం..

Posted: 06/27/2018 11:17 AM IST
Sex for secret malankara orthodox church suspends five priests

క్రైస్తవ మతస్థులకు వారు ఏదైనా తప్పు, లేక పాపం, లేక నేరం చేసిన దానిని బాపుకునేందుకు చర్చికి వెళ్లి అక్కడ వుండే పాప పరిహార బోనులోకి వెళ్లి వారు తమ పాపాన్ని వివరించి.. క్షమించమని జీసస్ ను వేడుకుంటారు. దేవుడికి, భక్తుడికి మధ్య వారధిగా వున్న పాస్టర్లు.. అదే బోనులోని అవతలి వైపున వుంటూ పూర్తి పాపాన్ని విన్ని.. వారిన క్షమించి.. ఇకపై ఇలాంటివి పునారవృతం చేయరాదని.. వారి తప్పులను క్షమించమని కోరుతూ ప్రార్థనలు చేస్తారు. తప్పులు చేసిన అందరూ ఇలా తమ పాపపరిహారాన్ని చేసుకుంటారు.

ఇలానే తాను చేసిన ఓ తప్పుకు పాప పరిహారం చేసుకోవడం కోసం చర్చికి వచ్చిన వివాహితను.. పాప పరిహార బోనులో అవతలి వైపు వున్న పాస్టర్లు.. కామపిచాలు మాదిరిగా తయారై.. తమ పాపాన్ని చెప్పుకున్న వివాహితను బ్లాక్ మెయిల్ చేస్తూ.. అమెపై అత్యాచారం చేశారు. ఈ ఘోరం కేరళలో చోటు చేసుకుంది. పెళ్లికి ముందు జరిగిన ఒక పొరపాటును ప్రభువుతో చెప్పుకుని, పాప పరిహారం చేసుకోవాలనుకున్న బాధితురాలు మలంకర ఆర్థొడాక్స్ చర్చ్ కు వచ్చింది. తిరువళ్లకు చెందిన ఈ మహిళ పెళ్లికి ముందు ఓ ఫాదర్ తో సన్నిహితంగా మెలిగింది. పెళ్లైన తర్వాత ఈ తప్పును పదేపదే తలుచుకుంటూ కుమిలిపోయింది.

ఈ నేపథ్యంలో, చర్చికి వచ్చి మరో ఫాదర్ తో చేసిన తప్పును చెప్పుకుంది. ఆమె బలహీనతను ఆసరాగా తీసుకున్న ఆ ఫాదర్... ఆమెపై లైంగిక దాడికి పాల్పడ్డారు. అంతేకాదు.... ఆమె తనతో ఉన్న అశ్లీల చిత్రాలను, వీడియోలను మరో ఫాదర్ కు పంపాడు. ఇలా ఫొటోలు, వీడియోలు మరికొందరు ఫాదర్లకు చేరాయి. వీరంతా వాటిని ఆమెకు చూపిస్తూ, బ్లాక్ మెయిల్ చేస్తూ, ఆమెపై అత్యాచారానికి పాల్పడ్డారు. మొత్తం ఐదుగురు ఫాదర్లు ఆమెపై లైంగిక దాడి చేశారు.

గత ఫిబ్రవరి తన భార్య మెయిల్ కు ఓ హోటల్ కు సంబంధించి, భారీ బిల్లు వచ్చింది. దీన్ని చూసిన భర్త షాక్ కు గురయ్యాడు. భార్యను నిలదీసి అడగడంతో... జరిగిన ఘోరాన్ని ఆమె వివరించింది. వెంటనే ఆయన ఫాదర్లపై చర్చి నిర్వహణ కమిటీకి ఫిర్యాదు చేశాడు. విచారణ జరిపిన కమిటీ... ఐదుగురు ఫాదర్లను సస్పెండ్ చేసింది. అయితే, మొత్తం ఎనిమిది మంది ఫాదర్లు తన భార్యపై అత్యాచారం చేశారని భర్త ఆరోపిస్తున్నాడు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles