man rapes minor taking selfie video మైనర్ బాలికరేప్‌ చేస్తూ సెల్ఫీ వీడియో.. ఫ్రెండ్స్ తో షేర్..

Man rapes minor taking selfie video shares with friends

minor girl, sex assault on minor girl, rape on minor girl, inter boy molestation, minor girl molest, minor girl molest by neighbour, nizambad minor girl rape, minot girl selfie video, minor girl, intermiediate boy, neighbour, selfie video, molest, sex assault, nizambad, crime

A young boy, who finished intermediate raped a minor girl taking selfie video, shares with friends in nizambad.

మైనర్ బాలికరేప్‌ చేస్తూ సెల్ఫీ వీడియో.. ఫ్రెండ్స్ తో షేర్..

Posted: 06/23/2018 06:17 PM IST
Man rapes minor taking selfie video shares with friends

చేతిలో మొబైల్.. వీలైతే ఓ సెల్ఫీ, సమయం దొరికితే ఓ పోర్న్ వీడియో.. ఇదీ నేటితరం పోకడ. ఈ అలవాటు క్రమేనా పైశాచిక రూపం దాల్చుతోంది. ఎదిగీ ఎదగని వయస్సులో క్షమించరాని తప్పులకు పురిగొలుపుతోంది. నిజామాబాద్‌లో వెలుగులోకి వచ్చిన ఈ దారుణం గురించి తెలిస్తే.. యువత ఎంతగా చెడిపోతున్నారో అర్థమవుతుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. నిజామాబాద్‌కు చెందిన బాలుడు (17).. ఇంటి పక్కనే ఉంటున్న బాలిక (15)తో పరిచయం పెంచుకున్నాడు.

ఆరు నెలల కిందట ఆమె పుట్టినరోజు సందర్భంగా అతడు తన స్నేహితులతో కలిసి ఆమెను నాగారం ప్రాంతానికి తీసుకెళ్లి కేక్ కట్ చేయించాడు. అనంతరం స్నేహితులతో కలిసి అత్యాచారయత్నం చేశాడు. ఈ సందర్భంగా కొన్ని అభ్యంతరకరమైన ఫొటోలు, వీడియోలు తీశాడు. కొద్ది రోజుల తర్వాత ఆ ఫొటోలు, వీడియోలతో ఆమెను బెదిరించడం మొదలుపెట్టాడు. ఆమెతో అసభ్యకరంగా వ్యవహరిస్తూ మరికొన్ని ఫొటోలు, వీడియోలు తీస్తూ హింసించేవాడు. ఏప్రిల్ 25న ఆమె ఇంట్లో ఒంటరిగా ఉండటాన్ని గమనించి అత్యాచారానికి పాల్పడ్డాడు.

ఈ సందర్భంగా సెల్ఫీ వీడియో తీసి.. దాన్ని స్నేహితులకు వాట్సాప్‌లో షేర్ చేశాడు. బాలిక తండ్రి మొబైల్ ఫోన్ చోరీ కావడంతో ఆయన ఇంట్లో ఫోన్‌ను వాడటం మొదలుపెట్టాడు. ఓ రోజు ఆ నెంబరుకు నిందితుడు పదే పదే కాల్ చేయడంతో అనుమానం వచ్చి బాలికను ప్రశ్నించగా అసలు విషయం బయటపడింది. దీంతో, ఆయన బాలుడిని పిలిపించి ఫోన్లో ఉన్న ఫొటోలు, వీడియోలు తొలగించాలని హెచ్చరించాడు. ఇందుకు నిందితుడు ఒప్పుకోలేదు. దీంతో ఆయన నేరుగా పోలీసులను అశ్రయించి జరిగిన విషయాన్ని పిర్యాదు చేయడంతో.. నిందితుడిని అదుపులోకి తీసుకున్న పోలీసులు విచారిస్తున్నారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : minor girl  intermiediate boy  neighbour  selfie video  molest  sex assault  nizambad  crime  

Other Articles