Mahad food poisoning is murder: police టీవీ సీరియళ్ల ప్రభావం.. అత్తింటివారిపై కొడలి ప్రతీకారం..

Fed up by taunts over her skin colour cooking skills woman poisons food 5 died 120 fell sick

Prandya, Jyoti Suresh Surwase, Subhash Mane, Mahad village, raigad, Anil Paraskar, maharashtra, woman poisons food, raigad police

Prandya alias Jyoti Suresh Surwase told the police that she took the step committed as she was fed up with constant taunts from the family and relatives over her complexion and her lack of cooking skills.

టీవీ సీరియళ్ల ప్రభావం.. అత్తింటివారిపై కొడలి ప్రతీకారం..

Posted: 06/23/2018 03:53 PM IST
Fed up by taunts over her skin colour cooking skills woman poisons food 5 died 120 fell sick

టీవీ సీరియల్స్‌ను తలదన్నే రీతిలో ఓ మహిళ తన అత్తింటివారికి హతమార్చింది. తనను అందవీహీనంగా వున్నారని అవమానించినందుకు అమె ఇంతవరకు తెగించింది. మహారాష్ట్రలోని రాయగఢ్‌ జిల్లాలో జూన్ 18న జరిగిన ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. వివరాల్లోకి వెళ్తే.. మహారాష్ట్రకు చెందిన ప్రగ్యా సర్వేష్‌ అలియాస్‌ జ్యోతి, సురేష్‌ సర్వసేకు రెండేళ్ల క్రితం వివాహమైంది. అప్పటి నుంచి ఆమె అత్తింటి వారు, బంధువులు ఆమెను నల్లగా ఉన్నావని, అందంగా లేవని వేధిస్తుండేవారు. అంతేకాదు వంట కూడా చేతకాదు.. రుచిగా వండటం తెలియదని అవమానించేవారు.

వీటన్నింటిని మనసులో పెట్టుకున్న ప్రగ్యా తన అత్తవారింటికి ఎలాగైనా బుద్ధి చెప్పాలని నిర్ణయించుకుంది. ఇదే సమయంలో పహాడ్ గ్రామంలో తన బంధువు అయిన సుభాష్ ఇంట్లో జూన్ 18న శుభకార్యం ఉందని ఆహ్వానం అందింది. ఇదే అదునుగా భావించింది. అత్తింటి వారితో కలిసి జ్యోతి కూడా అక్కడికి వెళ్లింది. అక్కడ విందు భోజనంలో విషం కలిపి అత్తింటివారిని మొత్తాన్ని చంపాలని నిర్ణయించి.. భోజనంలో విషం కలిపింది. ఈ భోజనం అందరికీ వెళ్లింది. దాన్ని అడ్డుకుంటే తన కుట్ర ఎక్కడ బయట పడుతుందో అని సైలెంట్‌గా ఉంది. విషం కలిపిన ఆహారాన్ని 100 మంది వరకు తిన్నారు.

ఆ వెంటనే విషపూరిత అహారం తిన్నవారందరికీ వాంతులు అయ్యాయి. అందర్నీ ఆస్పత్రికి తరలించారు. వీరిలో 5 నుంచి 13 సంవత్సరాల మధ్య ఉన్న నలుగురు చిన్నారులు చనిపోయారు. 50 ఏళ్ల మరో వృద్ధుడు కూడా చనిపోయారు. మరికొంత మంది ఆరోగ్యం విషమంగా ఉంది. శుభకార్యంలో ఇంత మంది అస్వస్థకు గురవ్వటంతో.. పోలీసులు విషయాన్ని సీరియస్‌గా తీసుకున్నారు. ఆహార పదార్ధాలను ల్యాబ్ కు పంపించారు. అందులో విషం ఉందని నివేదక తేల్చింది. అయితే ఎవరి విషం కలిపారన్న కోణంలో పోలీసులు విచారణ చేపట్టారు.

పోలీసుల విచారణలో జ్యోతి విషం కలిపినట్లు తేలింది. దీంతో అమెను అదుపులోకి తీసుకున్న పోలీసులు.. అసలు విషం కలపాల్సిన అవసరం ఎందుకు వచ్చిందని విచారించగా.. అసలు విషయం బయటపడింది. రెండేళ్ల క్రితం తనకు పెళ్లయిందని, పెళ్లయిన నాటి నుంచి తన శరీర రంగుపై నానా రకాల కామెంట్లు చేసేవారని, వంటకూ వంకలు పెట్టేవారని, అందుకే కుటుంబంలోని అందరినీ చంపేందుకు నిశ్చయించుకుని భోజనంలో విషం కలిపానని ఆమె అంగీకరించింది. అత్తింటిపై పగ.. ఐదుగురు ప్రాణాలు తీసింది. అన్నెంపున్నెం ఎరుగని చిన్నారుల జీవితాలను సమాధి చేసింది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles