Pawan kalyan appeal middle class people పోరాటంలో మధ్యతరగతి ప్రజలు ముందుకు రావాలి: పవన్

Pawan kalyan appeal middle class people not to be mere spectator

pawan kalyan, janasena, Pawan Kalyan amaravati, pawan kalyan tweet, pawan kalyan twitter, pawan kalyan appeals middle class people, pawan kalyan middle class politcis, pawan middle class fight, andhra pradesh, politics

Actor turned politician Jana Sena chief pawan kalyan appeals middle class people not to be mere spectator, and run away from politics out of disgust.

పోరాటంలో మధ్యతరగతి ప్రజలు ముందుకు రావాలి: పవన్ వినతి

Posted: 06/23/2018 11:54 AM IST
Pawan kalyan appeal middle class people not to be mere spectator

రాజకీయాలపై సగటు మధ్యతరగతి విద్యావంతులైన యువతీ యువకులతో పాటు అందరూ అనాసక్తిని కనబరుస్తూ.. దూరంగా వెళ్లిపోతున్నారని.. ఇకపై అలా వ్యవహరించవద్దని మధ్యతరగతి ప్రజలను జనసేన అధినేత, పవన్ స్టార్ పవన్ కల్యాణ్ కోరారు. రాజకీయాలంటేనే నిరాశ, నిసృహ, అసంతృప్తిని సగటు మధ్యతరగతి పౌరుడు వ్యక్తం చేస్తున్నాడని అభిప్రాయపడిన పవన్.. తాను కూడా దిగువ మధ్యతరగతి కుటుంబం నుంచే వచ్చానని తెలిపాడు. మౌన ప్రేక్షకుడిలా మిగిలిపోయే కంటే బలహీన వర్గాల సంక్షేమం కోసం పోరాడాలనే తాను నిర్ణయించుకున్నానని జనసేనాని తెలిపాడు. మన జీవితాన్ని అనునిత్యం ప్రభావితం చేసే రాజకీయాలకు దూరంగా జరగొద్దని పవన్ పిలుపునిచ్చారు.


‘పోరాడకపోతే.. మనల్ని వెన్నెముక లేని వారిలా మార్చేస్తారు. పోరాట స్ఫూర్తిని వీడొద్దు. రాజకీయాల్లో దిగువ మధ్యతరగతి, ఎగువ మధ్యతరగతి ప్రజలు రాజకీయాల్లో చురుగ్గా మారాలని కోరుకుంటున్నా. రాజకీయ పార్టీలను ప్రశ్నించే హక్కును కోల్పోవద్దు. 1977లో ఎమర్జెన్సీకి వ్యతిరేకంగా మధ్యతరగతి వర్గం పోరాడింది. మధ్యతరగతి ఎదగాలని ఆశిస్తున్నా. మన మాతృభూమికి వారి భాగస్వామ్యం అవసరం’ అని పవన్ ట్వీట్ చేశారు.

జనసైనికుల కోసం రాష్ట్ర వ్యాప్తంగా బూత్ స్థాయిలో రాజకీయ శిక్షణ కార్యక్రమాలు నిర్వహించనున్నట్టు పవన్ తెలిపారు. ఉత్తరాంధ్ర నుంచి దీనికి శ్రీకారం చుడతామన్నారు. జూన్ చివరి నుంచి జనసేన వ్యూహకర్త దేవ్ ఆధ్వర్యంలో విశాఖలో ఈ కార్యక్రమాలు నిర్వహిస్తారని జనసేనాని చెప్పారు. పోరాటం చేసేవారికి తెగువతోపాటు సమర్థత, విషయ పరిజ్ఞానం తెలిసి ఉండాలని పవన్ అభిప్రాయపడ్డారు. నాయకులు వస్తుంటారు, పోతుంటారు. కానీ నాతో ఎప్పటికీ ఉండేది మీరేనని జనసైనికులను ఉద్దేశించి పవన్ ట్వీట్ చేశారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : pawan kalyan  janasena  middle class  educated middle class  andhra pradesh  politics  

Other Articles