Tollywood Sex racket busted in Chicago అమెరికాలో టాలీవుడ్ సెక్సు రాకెట్ గుట్టురట్టు

Tollywood sex racket busted in us run by indian origin couple

high profile sex racket in Chicago, tollywood actress high profile sex racket, Kishan Modugumudi, Vibha Jayam, Chennupati, Tollywood actresses, anchors, temporary visas, Belmont Cragin, chicago, US, America

In a major expose, a Chicago-based couple of Indian descent have been accused of running a high-end racket that was luring female actors from Tollywood and advertising them for sex work at events across the United States.

అమెరికాలో టాలీవుడ్ సెక్సు రాకెట్ గుట్టురట్టు

Posted: 06/14/2018 10:31 AM IST
Tollywood sex racket busted in us run by indian origin couple

అమెరికాలోని చికాగో నగరంలో టాలీవుడ్ హీరోయిన్ల హైప్రోఫైల్ సెక్స్ రాకెట్ గుట్టురట్టైంది. అగ్రరాజ్యంలో స్థిరపడిన టాలీవుడ్ సహనిర్మాత, ఆయన భార్య ఇద్దరూ కలసి తెలుగునటీమణులను సినిమా షూటింగులంటూ తాత్కాలిక వీసాపై అమెరికాకు రప్పించి అక్కడ వారిత వ్యభిచారం చేయించేవారని కనుగొని భట్టబయలు చేసిన చికాగో పోలీసులు వారిని అరెస్టు చేసి న్యాయస్థానంలో హాజరుపర్చారు. ఈ క్రమంలో వారిపై 42 పేజీల క్రిమినల్ నివేదికను వారు చికాగో జిల్లా కోర్టులో సమర్పించారు.

అమెరికాతో పాటు తెలుగు రాష్ట్రాల్లో సంచలనం కలిగిస్తున్న ఈ సెక్స్ రాకెట్ వివరాల్లోకి వెళ్తే.. పలు చిత్రాలకు సహనిర్మాతగా వ్యవహరించిన ఎన్నారై మోదుగుమూడి కిషన్, ఆయన భార్య చంద్రలు కలసి టాలీవుడ్ నటీమణులను సినీమా షూటింగ్ ల పేరుతో తాత్కాలిక వీసాలపై అమెరికాకు రప్పించుకుని వారితో తెలుగువారు నిర్వహించే సాంస్కృతిక కార్యక్రమాలలో, లేదా ఈవెంట్లలో వారితో స్థానికుల చేత కామదాహం తీర్పించేవారని పోలీసులు నివేదికలో పేర్కోన్నారు. వీరి చేతిలో పడి బలవంతాన అమెరికాకు వచ్చిన ఓ క్యారెక్టర్ అర్టిస్ట్ అక్కడి పోలీసులకు పిర్యాదు చేయడంతో ఈ గుట్టురట్టైంది.

అయితే ఇప్పటికే వీరి చేతితో ఐదుగురు టాలీవుడ్ అగ్ర కథానాయకులు పడ్డారని, ఆ వివరాలన్నింటీని చంద్ర మెయింటైన్ చేసిందని తెలిపారు. ఇక వీరి ఇంటిపై దాడి చేసిన క్రమంలో 70 కండోమ్ ప్యాకెట్లు కూడా లభ్యమయ్యాయని నివేదికలో పోలీసులు స్పష్టం చేశారు. గత కొంత కాలంగా ఈ రాకెట్ నడుస్తోందని, హీరోయిన్లను డల్లాస్, న్యూజెర్సీ, వాషింగ్టన్ తదితర ప్రాంతాల్లోని హోటళ్లకు పంపే కిషన్, చంద్రలు, వారి వద్దకు కస్టమర్లను తీసుకెళ్లేవారని, స్వల్ప సమయం వారితో గడిపేందుకు విటుల నుంచి 3 వేల డాలర్స్ వసూలు చేస్తారని పోలీసు వర్గాలు వెల్లడించాయి. వీరిద్దరినీ అరెస్ట్ చేశామని, కేసు విచారణ సాగుతోందని తెలిపాయి.

 

 

 

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles