ten injured in bee attack in YS Jagan praja sankalpa yatra ఫ్యాను వీచింది.. జగన్ సంకల్పానికి తలొగ్గిన తేనెటీగలు..

Ten injured in bee attack in ys jagan praja sankalpa yatra in west godavari

ys jagan padayatra, honey bee attack on ysrcp leaders, honey bee attack ycp followers, honey bee attack Police personnel, honey bee attack at kanuru cross road, honey bee attack at nidadavolu constituency, honey bee attack in west godavari district, bee attack, ysrcp leaders, ycp followers, Police personnel, kanuru cross road, nidadavolu constituency, west godavari district, bee attack

At least ten people including ysr party leaders, followers and police personnel were injured in bee attack during opposition leader ys jagan praja sankalpa yatra in kanuru cross roads at nidadavolu in west godavari district on thursday. They were send to hospital for treatment.

ITEMVIDEOS: ఫ్యాను వీచింది.. జగన్ సంకల్పానికి తలొగ్గిన తేనెటీగలు..

Posted: 06/07/2018 11:30 AM IST
Ten injured in bee attack in ys jagan praja sankalpa yatra in west godavari

ప్రజా సమస్యలను తెలుసుకునేందుకు దివంగత ముఖ్యమంత్రి, తన తండ్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి చూపిన బాటలోనే ప్రయాణిస్తున్నారు అంద్రప్రదేశ్ ప్రతిపక్ష నేత వైఎస్ జగన్. ప్రజా సంకల్పయాత్రతో సాగుతున్న ఈ యాత్ర గత 182 రోజులుగా కొనసాగి ఇవాళ 183వ రోజుకు చేరుకుంది. కడప జిల్లా ఇడుపులపాయ నుంచి ప్రారంభమైన జగన్ సంకల్పయాత్ర ఇవాళ పశ్చిమ గోదావరి జిల్లా తణుకు, నిడదవోలుకు నియోజకవర్గంలో విజయవంతంగా కోనసాగుతుంది.

నిడదవోలు నియోజకవర్గంలోని ఇవాళ ఉదయం నడిపల్లికోట శివారు నుంచి పాదయాత్రను ప్రారంభించారు. అక్కడి నుంచి కానూరు క్రాస్‌ రోడ్డుకు రాజన్న బిడ్డ పాదయాత్ర చేరుకుంటుంది. అయితే సరిగ్గా జగన్ పాదయాత్ర పెరవలి మండలం కానూరు కొండాలమ్మ గుడి వద్ద నుంచి తన యాత్ర ప్రారంభించగా.. అక్కడ జోరుగా గాలి వీచింది. దీంతో రోడ్డుకు ఇరువైపులా వున్న చెట్లకు తెట్ట కట్టిన తేనెటీగలు ప్రజాసంకల్ప యాత్రంలో కలకలం రేపాయి. కార్యకర్తలు, ప్రజలు అందోళనకు గురయ్యారు.

దీంతో జగన్ ను పోలీసుల, రక్షణ వలయం అధికారులతో పాటు స్థానిక నేతలు కూడా ఆయన చుట్టూ కవచంలా రక్షణగా నిలిచారు. అయితే అక్కడే వుంటే తమ పార్టీనేతలతో పాటు పోలీసులకు కూడా సవాల్ గా మారుతుందని భావించిన జగన్.. తన ప్రజాసంకల్ప యాత్రను కొనసాగించారు. తేనెటీగలు దూసుకువస్తున్నా.. వాటిని చేధించుకుని ముందుకు కదిలారు. జగన్ లోని మొక్కవోని ధైర్యానికి తేనెటీగలు కూడా తలొగ్గాయి. దీంతో జగన్ పాదయాత్ర ముందుకు సాగింది.

అయితే ఈ సందర్భంగా జగన్ పార్టీ గుర్తు (ఫ్యాను)ను పోలీసులు, కార్యకర్తలు, నాయకులు గుర్తుచేసుకున్నారు. తమ జేబుల్లోంచి కర్చీఫులు తీసి వాటిని ఫ్యాను మాదిరిగా చుట్టూ తిప్పుతూ.. ఆయన గుర్తును ప్రచారం చేశారు. తేనెటీగల దాడిలో పార్టీకి చెందిన 10 మందికి నాయకులు, కార్యకర్తలకు గాయాలయ్యాయి. వారిని చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. కాగా, పశ్చిమ గోదావరి జిల్లాలో జోరువానను సైతం లెక్కచేయకుండా జగన్‌ ప్రజా సంకల్ప యాత్రను కొనసాగిస్తున్నారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles