Telangana to hire a whopping 18000 cops! పోలీసు కానిస్టేబుల్ అశావహులకు గుడ్ న్యూస్

Tslprb sct police constable notification released for 18 428 posts

police recruitment, police constable recriutment, Police Constable Notification, telangana police constables, Telangana State Level Police Recruitment Board (TSLPRB), unemployed youth, police constable jobs, police constable posts, telangana

The Telangana State Level Police Recruitment Board (TSLPRB) released notification for recruitment for 18,428 police constable posts.

పోలీసు కానిస్టేబుల్ ఆశావహులకు గుడ్ న్యూస్

Posted: 06/01/2018 09:47 AM IST
Tslprb sct police constable notification released for 18 428 posts

తెలంగాణ నిరుద్యోగులకు శుభవార్తను అందించింది. పోలీసుశాఖలో ఉద్యోగాల కోసం ఎదురుచూస్తున్న నిరుద్యోగులకు తెలంగాణ రాష్ట్రస్థాయి పోలిస్ రిక్రూట్ మెంట్ సంస్థ ఏకంగా 18 వేల 428 పోస్టులకు ఉద్యోగాలను భర్తీ చేసేందుకు నోటిఫికేషన్ విడుదల చేసింది. పోలీస్‌ శాఖలోని పలు విభాగాల్లో ఎస్సై, కానిస్టేబుల్‌ ఉద్యోగాలను పెద్ద సంఖ్యలో భర్తీ చేయాలని నిర్ణయించింది. ఈ నియామకాలకు సంబంధించి నోటిఫికేషన్లను జారీ చేసింది. రాష్ట్రంలో మొత్తం 18,428 ఉద్యోగాల నియామకం చేపట్టాలని నిర్ణయించారు.

పోలీసుల కానిస్టేబుల్ పోస్టులు 16,925, కాగా.. 1503 ఎస్సై ఉద్యోగాలు భర్తీ చేయనున్నారు. గత కొంతకాలంగా పోలీసు నియామక సంస్థ ఈ నియామకాలకు సంబంధించి కసరత్తు చేసింది. అన్ని అనుమతులు పొందాక ఈ రోజు ఉద్యోగ ప్రకటన జారీ చేసింది. పోలీసు శాఖలోని వివిధ విభాగాల్లో కానిస్టేబుళ్లు, ఎస్సై పోస్టులకు ఈ ప్రకటనలు జారీ చేసింది. మొత్తం 18428 ఉద్యోగాలకు సంబంధించి నాలుగు వేర్వేరు నోటిఫికేషన్లను విడుదల చేసింది. ప్రధానంగా కానిస్టేబుళ్లను అధిక సంఖ్యలో నియమించాలని నిర్ణయించింది.

ఈ ఉద్యోగానికి ఇంటర్మీడియెట్‌ ప్రధాన అర్హతగా పేర్కొన్నారు. వీటికి జూన్‌ 9 నుంచి 30వరకు ఆన్‌లైన్‌లో దరఖాస్తులు స్వీకరించనున్నారు. గరిష్ఠంగా వయో పరిమితి ఇవ్వాలనే ప్రతిపాదన వచ్చినప్పటికీ కొన్ని పోస్టులకు మాత్రమే ఇచ్చారు. హోంగార్డులుగా ఒక ఏడాది పనిచేసిన వారికి ఈ సడలింపు ఇచ్చారు. దరఖాస్తులు స్వీకరించాక వివిధ పరీక్షలు నిర్వహించి నియామక ప్రక్రియను వీలైనంత త్వరగా పూర్తిచేయాలని పోలీసు నియామక సంస్థ భావిస్తోంది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles