Director bobby surenders to jubilee hills police జూబ్లీహిల్స్ పోలీసుల ఎదుట లొంగిపోయిన దర్శకుడు

Tollywood director ks ravindra surenders to jubilee hills police

Telugu film actor, Telugu film director, KS Ravindra, tollywood actor, tollywood director, jubilee hills police, harminder, ameerpet, software engineer, Bobby, Telangana, crime

Telugu film actor-director KS Ravindra aka Bobby has been booked for rash driving and hit and run case, he surenders today to police who was absconding after the incident

జూబ్లీహిల్స్ పోలీసుల ఎదుట లొంగిపోయిన దర్శకుడు

Posted: 05/25/2018 10:53 AM IST
Tollywood director ks ravindra surenders to jubilee hills police

జూబ్లీహిల్స్ పోలిస్ స్టేషన్ పరిధిలో ఓ కారును ఢీకొట్టి, అసలు తానేం తప్పు చేయలేదన్నట్లు ప్రవర్తించి.. ఘటనాస్థం నుంచి వెళ్లిపోయిన సీని ప్రముఖుడు.. అజ్ఞాతవాసం బాటపట్టాడు. పోలీసులు తనకోసం అన్వేషిస్తున్నారని, తాను కనిపించిన వెంటనే నోటీసులు జారీ చేయనున్నారని తెలుసుకున్న అతను ఇక గత్యంతరం లేని పరిస్థితుల్లో పోలీసులకు లొంగిపోయాడు. అసలేం జరిగింది.? ఎవరా సీనీ ప్రముఖుడు అంటారా.? అయన టాలీవుడ్ సిని పరిశ్రమకు చెందని దర్శకుడు కెఎస్ రవీంద్ర. అలియాస్ బాబీ.

పోలీసుల కథనం ప్రకారం.. అమీర్ పేటకు చెందిన హర్మిందర్ సింగ్ తన కారులో కుటుంబ సభ్యులతో కలిసి అయ్యప్ప సొసైటీలో జరిగిన ఓ శుభకార్యానికి వెళ్లి వస్తున్నారు. ఈ క్రమంలో జూబ్లీహిల్స్ రోడ్డు నంబరు 33లో వారి కారును దర్శకుడు బాబీ కారు వెనక నుంచి వచ్చి బలంగా ఢీకొట్టింది. ఈ ఘటనలో హర్మిందర్ కారు వెనక భాగం పూర్తిగా ధ్వంసం కావడంతో బాబీని నిలదీశాడు. బాబీతో పాటు కారు దిగిన మరో ముగ్గురు హర్మిందర్ ను బెదిరించే ప్రయత్నం చేశారు.

హర్మిందర్ వారితో మాట్లాడుతుండగానే.. ఏం చేసుకుంటారో చేసుకోండని చెప్పి మరీ ఏం జరగనట్టగా వెళ్లిపోయారు. దీంతో బాధితుడు సామాజిక మాద్యమం ద్వారా విషయాన్ని వెలుగులోకి తీసుకువచ్చాడు. తన పేస్ బుక్ అకౌంట్ ద్వారా.. నేను చాలా అశ్చార్యానికి గురయ్యాను. సనీ పరిశ్రమకు చెందిన ఓ ప్రముఖ దర్శకుడు.. పొరబాటునో, గ్రహపాటునో తన కారును వెనుక నుంచి వచ్చి ఢీకొని కారును పూర్తిగా ధ్వంసం అయ్యేలా చేసి ఓ పెద్ద తప్పుచేశాడు. ఇంతచేసి అసలు తాను ఏం చేయలేదన్నట్లు అతను వెళ్లిపోవడం విస్మయానికి గురిచేసిందని.. కనీసం తాను క్షమాపణలు కూడా చెప్పలేదు.. ఘటన సమయంలో అతను మధ్యం తీసుకున్న ప్రభావంలో వున్నాడంటూ మెసేజ్ పెట్టాడు.

అంతటితో అగకుండా జూబ్లీహిల్స్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. దీంతో కేసు నమోదు చేసిన పోలీసులు అతనిపై ఐసీసి సెక్షన్ 297 కింద కేసు నమోదు చేశారు. అతనికి నోటీసులు జారీ చేయడానికి అతని ఇంటికి వెళ్లి విచారించగా అతను ఇంట్లో లేరని, ఈ సిటీలోనే లేరన్న సమాచారం లభించిందని తెలిపారు. దీంతో అతను ఎప్పుడు నగరంలోకి వస్తే అప్పుడు అతనికి నోటీసులు జారీ చేస్తామని జూబ్లీహిల్స్ సిఐ పి చంద్రశేఖర్ తెలిపిన విషయాన్ని మీడియా ద్వారా తెలుసుకున్న బాబీ.. నిన్న రాత్రి వెళ్లి పోలీసులకు లొంగిపోయారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : KS Ravindra  actor  director  jubilee hills police  harminder  ameerpet  software engineer  Bobby  Telangana  crime  

Other Articles