novelist yaddanapudi sulochana rani passed away అక్షరానికి హార్ట్ ఎటాక్: యద్దనపూడి కన్నుమూత

Famous novelist yaddanapudi sulochana rani passed away

famous novelist sulochana rani, telugu novelist yaddanapudi, yaddanapudi sulochana rani passed away, yaddanapudi sulochana rani no more, yaddanpudi no more, california, america, last rites, california, america, last rites

famous telugu novelist yaddanapudi sulochana rani passed away in califonia due to heart attack in sleep last night.

అక్షరానికి హార్ట్ ఎటాక్: యద్దనపూడి కన్నుమూత

Posted: 05/21/2018 10:32 AM IST
Famous novelist yaddanapudi sulochana rani passed away

తన రచనలతో కోట్లాది తెలుగు పాఠకులకు సుపరిచితురాలైన ప్రముఖ నవలా రచయిత్రి యద్దనపూడి సులోచనారాణి ఇక లేరు. అమె అమెరికాలోని కాలిఫోర్నియా పరిధిలో ఉన్న కుపర్టినోలో గుండెపోటుతో కన్నుమూశారు. 79 సంవత్సరాల సులోచనా రాణి వృద్దాప్యంలో కాలిఫోర్నియాలోని కుమార్తె నివాసంలో ఆమె గుండెపోటుతో తుది శ్వాస విడిచారు. యద్దనపూడి మృతిని ఆమె కుమార్తె శైలజ ధ్రువీకరించారు. ఆమె మృతి పట్ల ఎమెస్కో విజయకుమార్ ప్రగాఢ సంతాపాన్ని తెలిపారు.

1940లో కృష్ణా జిల్లా మొవ్వ మండలంలోని కాజా గ్రామంలో జన్మించిన ఆమె, మధ్యతరగతి మహిళల ఊహలను, వాస్తవాలను తన నవలల్లో అత్యద్భుతంగా తీర్చిదిద్దారు. 1970వ దశకంలో ప్రతి చదువుకునే స్త్రీ ఇంటా యద్దనపూడి నవల కనీసం ఒకటన్నా నిత్యమూ ఉండేదంటే అతిశయోక్తి కాదు. అమె రచనల్లో భార్యాభర్తల మధ్య ప్రేమలు, కుటుంబ సంబంధాలు ప్రధానాంశంగా వుండేవి. గత కొన్నేళ్లుగా ఆమె రచనలకు దూరంగా ఉంటున్నారు. చదువుకునే పిల్లలకు సాయం చేయడం, మానసిక సమస్యలు ఉన్న పిల్లల కోసం ఆమె ఓ పాఠశాల నడుపుతున్నారు.

అగ్నిపూలు, మీనా, విజేత, బహుమతి, బంగారు కలలు, అమరహృదయం, మౌన తరంగాలు, సెక్రటరీ తదితర నవలలు రాశారు. ఆమె రచనలు సినిమాలుగా, టీవీ సీరియళ్లుగా వచ్చాయి. ఆమె రచనల్లో మధ్యతరగతి మహిళల పట్ల ప్రేమ, ఆప్యాయతలు కనిపిస్తాయి. సగటు మహిళ జీవితం ఆధారంగా ఆమె రచనలు సాగాయి. ఆమెకు శైలజ మాత్రమే ఏకైక సంతానం. సెక్రటరీ నవలను గర్భవతిగా ఉండగానే సులోచనారాణి రాశారు. మనుషులు - మమతలు, మీనా, జీవన తరంగాలు, సెక్రటరీ, రాధాకృష్ణ, అగ్నిపూలు, ఛండీప్రియ, ప్రేమలేఖలు, విచిత్రబంధం, బంగారుకలం లాంటి అమె నవలలు సినిమాలుగా వచ్చాయి.

గత రాత్రి నిద్రలోనే ఆమె కన్నుమూశారని అమె కూతురు శైలజ వెల్లడించారు. గుండెపోటు వచ్చిందన్న విషయం ఎవరికీ తెలియదని, కనీసం ఆసుపత్రికి తీసుకెళ్లే సమయం కూడా లేకపోయిందని ఆమె తెలిపారు. తన తల్లి అంత్యక్రియలు స్వదేశంలో చేయాలని ఉన్నప్పటికీ, పరిస్థితులు అనుకూలించని కారణంగా కుపర్డినోలోనే ముగించనున్నట్టు స్పష్టం చేశారు. తమకు ఎంతో మంది ఫోన్ కాల్స్ చేసి సంతాపం చెబుతున్నారని, వారందరూ చూపుతున్న అభిమానానికి కృతజ్ఞతలని అన్నారు. 

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles