pawan kalyan slams on TDP government in shettipally ప్రభుత్వంపై ధ్వజమెత్తిన జనసేనాని పవన్

Pawan kalyan slams on tdp government in shettipally

pawan kalyan, janasena, Pawan Kalyan Road Show In Chittoor, Pawan Fans, Janasena Party, Pawan Kalyan Shettipally Road Show, Pawan Kalyan Latest News, Pawan Kalyan, Pawan Kalyan New Pics, JanaSena Party, PawanKalyan Chittoor district, Sri kalahasthi Temple, andhra pradesh, politics

Actor turned politician Jana Sena chief pawan kalyan slams Andhra Pradesh Government and chief minister Chandrababu for not keeping his poll promise, says TDP must be aware of his own party people are working against party at present.

ప్రభుత్వంపై ధ్వజమెత్తిన జనసేనాని పవన్

Posted: 05/16/2018 12:33 PM IST
Pawan kalyan slams on tdp government in shettipally

2019లో జరగనున్న తెలుగు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలలో ప్రత్యక్ష రాజకీయాల్లోకి వస్తామని ప్రకటించిన జనసేనాని, పవర్ స్టార్ పవన్ కల్యాణ్.. ఆ మేరకు వేగంగా తన ఏర్పాట్లలో నిమగ్నమవుతూనే పార్టీని క్షేత్రస్థాయి నుండి బలోపేతం చేసుకునే ప్రక్రియకు కూడా స్వయంగా నడుం చుట్టారు. ఇందులో భాగంగా అమరావతి ఏర్పాటులో భూములను కోల్పోయిన రైతులు మొదలుకుని ఇప్పటి వరకు అనేక సమస్యలపై స్పందించారు. శ్రీకాకుళంలోని ఉద్దానం కిడ్నీ బాధితుల సమస్యలను వెలుగులోకి తీసుకువచ్చారు. పాతిమా మెడికల్ కాలేజీ విద్యార్థుల సమస్య సహా అనేక సమస్యలపై తన గళం విప్పారు. అటు నేతలన్నల సమస్యల నుంచి ఇటు రైతన్నల సమస్యలపై పోరాట పంథాను సాగించారు.

ఇదే క్రమంలో చిత్తూరు జిల్లా శెట్టిపల్లికి చెందిన రైతన్నలు తమ భూములు అన్యాక్రాంతం అవుతున్నాయని పవన్ ముందు తమ గోడును వెళ్లబోసుకున్నారు. ప్రభుత్వం ఎన్నికలకు ముందు ఇచ్చిన హామీని విస్మరించిందని అవేదన వ్యక్తం చేశారు. దీంతో చిత్తూరు జిల్లాలోని ఈ గ్రామాన్ని ఇవాళ జనసేనాని సందర్శించారు. ప్రభుత్వానికి మానవతా దృష్టి లేకుంటే ప్రజలు ఇబ్బంది పడతారని అన్నారు. పైడిపల్లిలో ఇదే తరహా భూములకు పట్టాలిచ్చి శెట్టిపల్లికి ఎందుకు అన్యాయం చేస్తున్నారని ప్రశ్నించారు. శెట్టిపల్లిలో భూసమీకరణ చేస్తే ప్రజలే ఎదురు తిరగాలని పవన్ వ్యాఖ్యానించారు.

రైతుల మధ్య ప్రభుత్వమే విభజన తీసుకువస్తుందని అక్షేపించారు. భూసేకరణ విధానంలో మార్పు తీసుకురావాలని, శెట్టిపల్లి భూములను సమీకరించే ప్రయత్నాన్ని ప్రభుత్వం విరమించుకోవాలని సూచించారు. ప్రభుత్వం శెట్టిపల్లి భూములను లాక్కునే ప్రయత్నం చేస్తే పోరాటం చేస్తామని హెచ్చరించారు. ఒక గ్రామానికి ఒక విధానాన్ని అమలు చేస్తున్న ప్రభుత్వం మరో గ్రామానికి మరో విధానాన్ని వర్తింపజేస్తూ.. వారి బలహీనతలే తమ బలంగా మార్చుకుంటుందని ఎద్దేవా చేశారు.

ఎన్నికలకు ముందు శెట్టిపల్లి గ్రామ ప్రజలకు ఇచ్చిన హామీలను కూడా ప్రభుత్వం నిలబెట్టుకోలేకపోతుందని ఆయన దుయ్యబట్టారు. టీడీపీకి ఓట్లేసి గెలిపించిన ప్రజలనే అధికారంలోకి వచ్చిన తరువాత విస్మరిస్తుందని ఇది సముచితం కాదని అన్నారు. తమకు ఓట్లేవేసి ప్రజలే తమకు వ్యతిరేకంగా గళం విప్పుతున్న విషయాన్ని ఇప్పటికైనా ప్రభుత్వం గుర్తించాలని చెప్పారు. ఈ సందర్భంగా ఆంధ్రప్రదేశ్ లో రైతు రుణమాఫీ పథకంపై పవన్ కల్యాణ్ విమర్శలు గుప్పించారు. ఏపీలో రైతు రుణ మాఫీ వ్యవహారం ఎలా ఉందంటే.. బిందెడు నీళ్లు ఆశ చూపి మూడు స్పూన్ల నీళ్లు తాగించినట్టుగా ఉందని విమర్శించారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : pawan kalyan  janasena  chitoor  shettipally  chandrababu  TDP  andhra pradesh  politics  

Other Articles