CBI chargesheets Lalu, others in IRCTC case లాలూ, రబ్రీ, తేజస్వీలపై బిగుస్తున్న ఐఆర్సీటీసీ ఉచ్చు..

Irctc hotel case cbi files chargesheet lalu rabri and tejashwi

CBI chargesheets Lalu, others in IRCTC case, cbi chargesheet in irctc case, cbi chargesheers lalu in irctc case, hotel contracts, Tejashwi, rabri devi, Lalu Prasad yadav, tejaswi yadav, IRCTC, CBI, railway, Bihar, BJP, PM Modi, politics

The CBI chargesheeted former railway minister and RJD supremo Lalu Prasad, his wife Rabri Devi and son Tejaswi Yadav and eleven others for alleged irregularities in hotel maintenance contracts given by the railway’s hospitality arm.

లాలూ సహా భార్య, తనయుడి చుట్టూ బిగుస్తున్న ఐఆర్సీటీసీ ఉచ్చు..

Posted: 04/17/2018 04:48 PM IST
Irctc hotel case cbi files chargesheet lalu rabri and tejashwi

ఆర్జేడీ నేత లాలు ప్రసాద్ యాదవ్, ఆయన సతీమణి, మాజీ సీఎం రబ్రీదేవి, చిన్న కుమారుడు తేజస్వీ యాదవ్‌ తో పాటు మరో 11 మందిపై ఐఆర్సీటీసీ అవినీతి కేసులో సీబీఐ తాజాగా చార్జిషీట్ దాఖలు చేసింది. తేజస్విపై చార్జిషీట్ దాఖలు చేయడం ఇదే తొలిసారి. యూపీఏ ప్రభుత్వ హయాంలో రైల్వే మంత్రిగా పనిచేసిన లాలు ప్రసాద్ తన పదవిని దుర్వినియోగం చేశారన్న అభియోగాలు ఉన్నాయి. నిబంధనలకు వ్యతిరేకంగా బీఎన్ఆర్ రాంచి, బీఎన్ఆర్ పూరి అనే రెండు రైల్వే హోటళ్ల నిర్వహణకు సుజాతా హోటల్స్ కు కాంట్రాక్ట ఇచ్చినట్టు సీబీఐ ఆరోపిస్తోంది.

ఈ హోటల్స్ డీల్ చేసినందుకుగాను.. పాట్నాలోని అత్యంత ఖరీదైన ఈ ప్రాంతంలో వున్న మూడెకరాల స్థలాన్ని సుజాతా హోటల్స్ ఓ బినామీ కంపెనీ పేరున రిజిస్టర్ చేయించి.. దానిని లాలూకు కట్టబెట్టినట్టు సీబిఐ అభియోగాలు దాఖలు చేసింది. హోటళ్ల కోసం అత్యంత చవగ్గా భూమి ఇవ్వడాన్ని తప్పుబట్టిన సీబీఐ ‘క్విడ్ ప్రో కో’ లో భాగంగానే ఈ డీల్ జరిగినట్టు ఆరోపిస్తోంది. ఈ హోటల్ ప్రమోటర్లు లాలు కుటుంబానికి చాలా సన్నిహితులని పేర్కొంది. ఇందుకు సంబంధించిన అన్ని ఆధారాలు తమ వద్ద ఉన్నట్టు పేర్కొన్న సీబీఐ లాలు కుటుంబ సభ్యులతో పాటు రైల్వే అధికారులపైనా చార్జిషీటు దాఖలు చేసింది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Tejashwi  rabri devi  Lalu Prasad yadav  tejaswi yadav  IRCTC  CBI  railway  Bihar  BJP  PM Modi  politics  

Other Articles