hyderabad high court squashes gazette on expelled mlas కోమటిరెడ్డి, సంపత్ లకు హైకోర్టులో ఊరట

Hyderabad high court squashes gazette on expelled mlas

hyderabad high court, governor speech, budget session, komatireddy venkat reddy, sampath, expelled mlas, expulsion letter, Justice B. Siva Sankar Rao, congress, TRS, Telangana assembly, politics

hyderabad high court squashes gazette on expelled mlas giving judgement on congress mlas komatireddy venkatreddy and sa sampath saying mlas cannot be expelled from house.

కేసీఆర్ సర్కార్ కు హైకోర్టు తీర్పు చెంపపెట్టు

Posted: 04/17/2018 01:47 PM IST
Hyderabad high court squashes gazette on expelled mlas

తెలంగాణ ప్రభుత్వ నిర్ణయానికి చెంపపెట్టులాంటి తీర్పునిచ్చింది రాష్ట్రోన్నత న్యాయస్థానం హైదరాబాద్ హైకోర్టు. తెలంగాణ కాంగ్రెస్ నేతలు కోమటిరెడ్డి వెంటకర్ రెడ్డి, సంపత్ కు ఊరటనిస్తూ ఇవాళ హైకోర్టు తీర్పును వెలువరించింది. సదరు సభ్యులు అసెంబ్లీలో దురుసుగా ప్రవర్తించారని ఆరోపిస్తూ వారి శాసనసభ్యత్వాలను రద్దు చేస్తూ తెలంగాణ అసెంబ్లీ విడుదల చేసిన గెజిట్ నోటిఫికేషన్ హైకోర్టు రద్దు చేసింది. తక్షణం కోమటిరెడ్డి, సంపత్ ల శాసనసభ్యత్వాలను పునరుద్ధరించాలని హైకోర్టు ప్రభుత్వాన్ని ఆదేశించింది.

అదే విధంగా గతంలో ఉన్న అన్ని బెనిఫిట్స్ వర్తింపజేయాలని సూచించిన న్యాయస్థానం.. వారిని ఎమ్మెల్యేలుగా కొనసాగించాలని ఆదేశించింది. కాగా, వీరి బహిష్కరణ కేసు విచారణ నేపథ్యంలో కేంద్ర ఎన్నికల సంఘాన్ని నివేదిక సమర్పించాలని కోరిన న్యాయస్థానం.. తీర్పును వెలువరించే క్రమంలో ఎన్నికల కమీషన్ ఇచ్చిన నివేదికను కూడా తోసిపుచ్చుతూ 169 పేజీల తీర్పును వెల్లడించింది. అయితే అసెంబ్లీలో ఎమ్మెల్యేల తీరుపై క్రిమినల్ చర్యలు తీసుకోవాలని భావిస్తే తమ తీర్పు అడ్డంకి కాదని న్యాయమూర్తి జస్టిస్ బి.శివ శంకర్ రావు తీర్పును వెలువరించారు. ఈ మేరకు ఈ నెల 9నే తీర్పును రిజర్వు చేసిన న్యాయమూర్తి ఇవాళ తీర్పును వెలువరించారు.

తుది విడత బడ్జెట్ సమావేశాల ప్రారంభాన్ని పురస్కరించుకుని మార్చి 12న ఉభయ సభలను ఉద్దేశించి ప్రసంగిస్తున్న గవర్నర్ నరసింహన్ ప్రసంగాన్ని అడుకోవడంతో పాటు మైక్ విరిచి గవర్నర్ పైకి విసరి అనుచితంగా వ్యవహరించారు. ఆ మైక్ కాస్తా.. గవర్నర్ పక్కనున్న మండలి చైర్మన్ స్వామిగౌడ్ కంటికి తగిలి గాయం కావడంతో.. అస్పత్రికి తరలించి చికిత్సనందించారు. ఈ పరిణామాల క్రమంలో మార్చి 14వ తేదీన వీరిద్దరి శాసనసభ సభ్యత్వం రద్దు చేస్తూ అసెంబ్లీ స్పీకర్ మధుసూదనాచారి నిర్ణయం తీసుకున్నారు. కాగా స్పీకర్ ఆదేశాలకు సవాల్ చేస్తూ న్యాయస్థానాన్ని అశ్రయించిన కాంగ్రెస్ ఎమ్మెల్యేలకు ఊరట లభించింది.

హైకోర్టు తీర్పు.. టీఆర్ఎస్ ప్రభుత్వానికి చెంపపెట్టు..

టీఆర్‌ఎస్‌ ప్రభుత్వానికి రాష్ట్ర సర్వోన్నత న్యాయస్థానం హైకోర్టు తీర్పు చెంపపెట్టులాంటిదని కాంగ్రెస్‌ ఎమ్మెల్యే డీకే అరుణ పేర్కోన్నారు. ఈ విషయంపై డీకే అరుణ మీడియాతో మాట్లాడుతూ... తెలంగాణ ముఖ్యమంత్రికి ఏ మాత్రం సిగ్గున్నా తన పదవికి రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తున్నానని అన్నారు. టీఆర్‌ఎస్‌ సర్కారు ఇష్టం వచ్చిన రీతిలో ప్రవర్తిస్తోందని, అసెంబ్లీలో తమకు ఇష్టం ఉన్న వారినే లోపలికి రానిస్తామనేలా వ్యవహరిస్తోందని డీకే అరుణ అన్నారు. ముఖ్యమంత్రికి అనేక సందర్భాల్లో హైకోర్టు మొట్టికాయలు కొట్టిందని, అయినప్పటికీ ఆయన తీరు మారడం లేదని ఆమె అన్నారు. తెలంగాణలో కేసీఆర్‌ నిరంకుశ పాలన కొనసాగిస్తున్నారని అన్నారు. 

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles