IndiGo offloads doctor of mosquito menace complaint దోమలున్నాయంటే.. వదిలేసి వెళ్తారా.?

Indigo offloads doctor after complaining of mosquito menace

Indigo Airlines, Indigo flight, Saurabh Rai, planes, doctors, airline staff, mosquitoes, Lucknow, bengaluru, cardiologist, viral news

A Bengaluru-based cardiologist, Dr Saurabh Rai, was offloaded from an IndiGo flight at Lucknow airport after his complaints about mosquitoes aboard the aircraft turned into an altercation with flight crew.

ఇండిగొ మరో బ్లండర్: దోమలున్నాయంటే.. వదిలేసి వెళ్తారా.?

Posted: 04/10/2018 02:07 PM IST
Indigo offloads doctor after complaining of mosquito menace

బడ్జెట్ విమానయాన సంస్థ ఇండిగో మరోసారి వివాదాల్లో చిక్కుకుంది. ఇటీవల ఓ వృద్ద ప్యాసింజర్ పై ముష్టిగాతాలకు పాల్పడి.. కిందపడేసి మరీ దాడి చేసిన విమానయాన సంస్థగా పేరొంది.. ప్యాసింజర్లను కష్టపెట్టడంలో కానీ లేక ఇబ్బందులకు గురిచేయడంలో కానీ విమర్శలను ఎదుర్కొంటున్న దేశీయ విమానయాన సంస్థల్లో ముందున్న సంస్థ ఇండిగో అని కూడా నెట్ జనులు విమర్శలు గుప్పిస్తున్నారు. అయినా ఈ సంస్థ స్టాప్ లో మాత్రం కాసింతైనా మార్పు కోసం యత్నించడం లేదు. తాజాగా విమానంలో దోమలున్నాయని చెప్పినందుకు తనను కొట్టి గెంటేశారని ఓ ప్రయాణికుడు ఆరోపించాడు. వివరాల్లోకి వెళితే..

బెంగళూరుకు చెందిన సౌరభ్ రాయ్ అనే ప్రయాణికుడు లక్నో విమానాశ్రయం నుంచి బెంగళూరు వెళ్లేందుకు ఇండిగో విమానయాన సంస్థలో టికెట్ బుక్‌ చేసుకున్నారు. అయితే విమానంలోకి ఎక్కగానే దోమలు ఎక్కువగా ఉండటంతో సిబ్బందికి ఫిర్యాదు చేశారు. కాగా.. విమాన సిబ్బంది ఫిర్యాదును పట్టించుకోలేదు సరికదా తనపై చేయిచేసుకున్నారని సౌరభ్‌ ఆరోపించారు. అంతేగాక తనను విమానం నుంచి దింపేశారని పేర్కొన్నారు.

అయితే దీనిపై ఇండిగో కూడా వివరణ ఇచ్చింది. సదరు ప్రయాణికుడు హైజాక్‌ లాంటి పదాలు ఉపయోగించాడని.. భద్రతా కారణాల దృష్ట్యా అతన్ని విమానం నుంచి దింపేశామని పేర్కొంది. ‘సౌరభ్‌ విమానంలోకి ఎక్కగానే దోమలు ఎక్కువగా ఉన్నాయంటూ ఫిర్యాదు చేశాడు. విమాన సిబ్బంది స్పందించేలోపే ఆయన ఆగ్రహానికి గురయ్యాడు. బెదిరింపులకు పాల్పడ్డాడు. ఇక విమానం తలుపు మూసివేయగా పరిస్థితి మరింత ఉద్రిక్తంగా మారింది. విమానాన్ని ధ్వంసం చేద్దామంటూ మిగతా ప్రయాణికులను రెచ్చగొట్టాడు. హైజాక్‌ లాంటి పదాలను ఉపయోగించాడు. దీంతో ప్రయాణికుల భద్రత దృష్ట్యా ఆయనను విమానం నుంచి దింపేశాం’ అని ఇండిగో తెలిపింది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles