janasena crosses 17 lakh memberships 19 రోజుల్లో 17 లక్షలకుపైగా జనసేన సభ్యత్వాలు..

17 lakh membership enrollments janasena to bring new app

Jana sena, Pawan Kalyan, membership, janasainiks app, digital platform, vijaya nirmala, kuldeep, miriyala srinivas, andhra pradesh, Telangana, politics

Jana sena leaders say they are bringing a special app for party membership apart from missed call, which will pave the road for the party menbers group discussion on this digital platform.

17 లక్షలకుపైగా జనసేన సభ్యత్వాలు.. త్వరలో ప్రత్యేక యాప్

Posted: 03/31/2018 04:33 PM IST
17 lakh membership enrollments janasena to bring new app

జనసేన పార్టీ సభ్యత్వ నమోదు కోసం ఓ మిస్డ్ కాల్ ఇస్తే చాలునని గుంటూరులోని మంగళగిరి సభలో జనసేనాని పవర్ స్టార్ పవన్ కల్యాన్ ప్రకటించి సరిగ్గా నేటికి 19 రోజులు.కానీ సభ్యత్వాలు సంఖ్య మాత్రం ఏకంగా 17 లక్షలు. రమారమి రోజుకు లక్ష మంది చొప్పున జనసేన సభ్యత్వాలు నమోదువుతున్నాయంటే.. పార్టీ అధినేతపై అభిమానంతో పాటు పార్టీని విశ్వసిస్తున్న వారి సంఖ్యకూడా ఇక్కడ ప్రతిభింబిస్తుంది. ఇదే జోష్ లో అభిమానులకు మరింతగా చేరువయ్యేందుకు జనసేన సరికొత్త యాప్ ను కూడా తీసుకురానుంది.

జనసేన ఆవిర్భావ మహాసభలో అధినేత పవన్ పిలుపు మేరకు మిస్డ్ కాల్ తో ఇప్పటికి 17 లక్షల మందికి పైగా సభ్యులుగా చేరారని ఆ పార్టీ ఓ ప్ర‌క‌ట‌న‌లో తెలిపింది. దీంతో మిస్డ్ కాల్ తో పాటుగా మరో విధంగా కూడా సభ్యత్వాలను నమోదు చేయడం కోసం ప్రత్యేకంగా జనసైన్యం పేరుతో ప్రత్యేక యాప్ ను కూడా ఏప్రిల్ 2 నుంచి సభ్యులకు అందుబాటులోకి తీసుకురాన్నామని జనసేన ఐటీ విభాగం వెల్లడించింది. దీంతో జనసేన కార్యక్రమాలన్ని ఎప్పటికప్పుడు పార్టీ సభ్యులతో పంచుకునే అవకాశం వుంటుందని తెలిపారు.

నిజాయతీగల రాజకీయాలతో పటిష్ఠ‌మైన పౌర సమాజం నిర్మించేందుకు జనసేన కట్టుబడి ఉందని జనసేన ప్రతినిధి విజయ నిర్మల అన్నారు. పార్టీ సభ్యులుగా కేవలం పార్టీ అధినేత దర్శనీకతలో నడుస్తామని విశ్వాసమున్న సభ్యులందరినీ చేర్చుకుంటామని అమె తెలిపారు. మరీ ముఖ్యంగా ఇప్పటి వరకు దరఖాస్తు చేసుకున్నవారిలో యువతే అధికంగా వున్నారని తెలిపారు. సుమారుగా 40 శాతం మంది పార్టీకి వాలంటీర్లుగా సేవ చేసేందుకు సుముఖత వ్యక్తం చేశారు. యాప్ ద్వారా సభ్యత్వ నమోదు ప్రక్రియ మరింత సులభం అవుతుంది. జనసైన్యం పేరుతో సభ్యత్వ నమోదు కార్యక్రమం ఉంటుంది' అని చెప్పారు.

 ఐటీ విభాగం తరఫున శ్రీనివాస్ మిరియాల మాట్లాడుతూ.. '93940 22222 నంబర్‌కు మిస్డ్ కాల్ ఇస్తే చాలు సభ్యులు కావచ్చు. వారి ఫోన్ కి యూనిక్ మెంబర్ షిప్ ఐడీ వస్తుంది. మెంబర్ షిప్ వెబ్ సైట్ లోకి లాగిన్ కావడానికి ఒక లింక్ కూడా పంపిస్తాం. తమ ఫోటో, ఎంపిక చేసుకున్న భాషలో ఈ-మెంబర్ షిప్ కార్డు కూడా తీసుకోవచ్చు. ఈ ప్రక్రియ ఒక నిమిషం కంటే తక్కువ వ్యవధిలో పూర్తవుతుంది. పార్టీ కోసం వారు ఎక్కడ, ఎలాంటి పని చేయదలచుకున్నారో కూడా తెలియజేసే వెసులుబాటు అందులో ఉంటుంది. పార్టీ వాలంటీర్లు తమ చుట్టుపక్కల వారిని సభ్యులుగా నమోదు చేసే యాప్ ద్వారా ఏప్రిల్ 2 వ తేదీ నుంచి సభ్యత్వ నమోదు కార్యక్రమం చేపడుతున్నామని అన్నారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles