BJP Counter to Atchannaidu over Pawan, Jagan అచ్చెన్నాయుడికి పవన్, జగన్ లపై బీజేపి కౌంటర్

Bjp vishnu kumar counter to atchannaidu over pawan jagan

BJPLP leader, Vishnu Kumar Raju, Andhra Pradesh Assembly, AP minister, Atchannaidu, Pawan Kalyan, Jana Sena, YSRCP, YS Jagan, Chandrababu, all party meet, latest news

BJPLP leader of Andhra Pradesh Assembly Vishnu Kumar Raju gives counter to AP minister Atchannaidu over Jana Sena, YSRCP not attending to chandrababu all party meet.

ITEMVIDEOS: అచ్చెన్నాయుడికి పవన్, జగన్ లపై బీజేపి కౌంటర్

Posted: 03/28/2018 02:36 PM IST
Bjp vishnu kumar counter to atchannaidu over pawan jagan

అంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నేతృత్వంలో రాష్ట్రానికి ప్రత్యేక హోదా తీసుకువచ్చేందుకు నిర్వహించిన అఖిలపక్ష సమావేశానికి రాష్ట్రంలోని అన్ని ప్రజాసంఘాలు, రాజకీయ పార్టీలు వచ్చినా.. కేవలం బీజేపి సహా ఆ పార్టీతో తెర వెనుక ఒప్పందాలు పెట్టుకున్న పార్టీలు మాత్రమే రాలేదని మంత్రి అచ్చెన్నాయుడు చేసిన విమర్శలపై బీజేపీ శాసనసభాపక్ష నేత విష్ణుకుమార్ రాజు ఘటుగా స్పందించారు. తమ పార్టీ ఏకగ్రీవంగా తీసుకున్న నిర్ణయం మేరకే తాము గైర్హాజరు అయ్యామని, చంద్రబాబు తన రాజకీయ ప్రయోజనాల కోసం సమావేశం పెడితే తామెందుకు హాజరు కావాలని ప్రశ్నించారు.

ఈ క్రమంలో పవన్ కల్యాన్, జగన్ లను అడ్డు పెట్టుకుని బీజేపీ నాటకాలు ఆడుతోందన్న టీడీపీ విమర్శలపై స్పందించిన ఆయన.. మీరు అఖిలపక్ష సమావేశానికి మీరు పిలిస్తేనే రానీ పార్టీలు.. మేం చెబితే వింటాయా.? అని ప్రశ్నించారు. జగన్ మేం చెబితే వింటారా..? లేక పవన్ మేం చెబితే వింటారా..? ఎవరి పార్టీల కోసం ఆయా పార్టీల నేతలు స్వతంత్రంగా వ్యవహరించి నిర్ణయాలు తీసుకుంటారని చెప్పారు. తాము చెబితే అచ్చెన్నాయుడే వినడు... వారెందుకు వింటారని అన్నారు. బీజేపీతో పొత్తు విషయంలో తన స్వార్థం కోసం టీడీపీ యూ-టర్న్ తీసుకుందని, టీడీపీ కుట్రలో తాము భాగం కాబోమని అన్నారు.

బీజేపీలో బీ అంటే భారతీయ జనతా పార్టీ అని, జే అంటే జగన్ అని, పీ అంటే పవన్ అని అచ్చెన్నాయుడు కామెంట్ చేస్తున్నారని... వాళ్లతో తాము ఎక్కడ కలిశామని ఆయన ప్రశ్నించారు. తాము కలిసినట్టు మీరెక్కడైనా చూశారా? కెమెరాలతో ఏమైనా షూట్ చేశారా? అని నిలదీశారు. అసెంబ్లీకి వచ్చినప్పుడు మాత్రమే తాను జగన్ ను కలిశానని... చాలా కాలంగా ఆయన సభకు కూడా రావడం లేదని చెప్పారు. ఎన్నికల సమయంలో పవన్ కల్యాన్ ను ఒక్కసారి చూశామని తెలిపారు.

అచ్చెన్నాయుడు ఉన్నది లేనట్లుగాను, లేనిది ఉన్నట్లుగానూ చేసి రాష్ట్రప్రజలకు చూపే ప్రయత్నం చేస్తున్నారని.. ఈ అబద్దాలను కూడా నిజాలుగా చాలా గొప్పగా చెబుతున్నారని విమర్శించారు. జరగనిది జరిగినట్లు చేసి ప్రజలను మభ్యపెట్టేందుకు  అబ్బబ్బా ఎంత బాగా చెబుతారో అంటూ ఎద్దేవా చేశారు. ఆయన చెప్పిన దాంట్లో ఏ మాత్రం వాస్తవం లేదని... తాము చెబితే పవన్, జగన్ లు వింటారా అని ప్రశ్నించారు. అంతెందుకు... తాను చెప్పింది అచ్చెన్నాయుడు కూడా వినరని అన్నారు. ఎవరి పార్టీ స్టాండ్ వారికుంటుందని చెప్పారు. అఖిలపక్షానికి రాకపోవడానికి రకరకాల రాజకీయ కారణాలు ఉంటాయని తెలిపారు.

పదేళ్ల క్రితం ఆ ప్రభుత్వం అలా చేసింది, ఇలా చేసిందని అందరూ తనను చూపిస్తున్నారని విష్ణు అసహనం వ్యక్తం చేశారు. అప్పటి ప్రభుత్వంలో తాను లేదని, అప్పుడు తాను ఎమ్మెల్యేను కూడా కాదని చెప్పారు. అచ్చెన్నాయుడు గారైతే ఊగిపోతూ, తనపై వేలెత్తి చూపిస్తూ మాట్లాడుతున్నారని చెప్పారు. అధ్యక్షా, అచ్చెన్నాయుడిని చూస్తేనే తనకు భయం వేస్తోందని అన్నారు. ఆయన వస్తేనే తనకు దడ పుడుతోందని చెప్పారు. తనను వేలెత్తి చూపిస్తూ, లేనిపోని విమర్శలు చేస్తున్నారని అన్నారు. 'అధ్యక్షా... అచ్చెన్నాయుడు ఆయన ఉగ్రరూపాన్ని నాపై చూపించకూడదని మీ ద్వారా కోరుతున్నా' అని విష్టుకుమార్ రాజు చెప్పారు. 

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Vishnu Kumar Raju  Atchannaidu  Pawan Kalyan  YS Jagan  Chandrababu  all party meet  politics  

Other Articles