elephant lakshmi performed abhishekam to shivling అధ్భుతం: శివలింగానికి అభిషేకం చేస్తున్న గజ'లక్ష్మి'

Virupaksha temple elephant lakshmi performed abhishekam to shivling

hampi verupakshi temple, elephant lakshmi, River Tungabadra, abhishekam, shivaling, devotees, tourists, udagi, auspicious day

The elephant of hampi virupaksha temple lakshmi, which was taken to bath in tungabadra river, intrestingly performed abhishekam to shivling on the holy day of ugadi.

అధ్భుతం: శివలింగానికి అభిషేకం చేస్తున్న గజ'లక్ష్మి'

Posted: 03/19/2018 11:03 AM IST
Virupaksha temple elephant lakshmi performed abhishekam to shivling

కర్ణాటకలో అధ్భుతం జరిగింది. అందులోనూ పరమపవిత్రమైన హంసీ దేవాలయంలో ఈ ఘటన చోటుచేసుకుంది. సకలచరాచర సృష్టికి ఆ పరమాత్ముడే అధారమని, సృష్టిలోని లయకారుడి అజ్ఞ లేకుండా చీమైనా కుట్టదని ఇప్పటికే మన వేదపండితులు ఎందరో ఉద్ఘాలించిన విషయం తెలిసిందే. అయితే అలాంటి శివయ్యను ప్రస్నం చేసుకునేందుకు ఏకంగా ఓ గజలక్ష్మీ చేసిన పూజలు ఇప్పుడు నెట్టింట వైరల్ గా మారింది. అటు భక్తులు, ఇటు పర్యాటకులు ఈ చిత్రమైన పూజలను చూసి సంభ్రమాశ్చర్యాలకు లోనయ్యారు.

వివరాల్లోకి వెళ్తే.. పవిత్రమైన ఉగాది పర్వదినం రోజున హంపిలో కొలువైన విరూపాక్ష ఆలయానికి చెందిన లక్ష్మీ అనే ఏనుగును.. తుంగభద్రా నదిలో స్నానం చేయించేందుకు తీసుకెళ్లారు అలయ సిబ్బంది. దీంతో నదిలోకి ప్రవేశించిన ఏనుగు లక్ష్మీ.. తాను స్నానాదులను అచరించిన తరువాత లక్ష్మీ.. కాసింత ముందుకు వెళ్లింది. నిత్యం నదీజలాలలో అభిషేకం అవుతున్న అక్కడే వున్న శివలింగానికి లక్ష్మీ తన తొండంతో జలాన్ని తీసుకుని తనవంతు అభిషేకం చేసింది.

ఉగాధి పర్వదినం రోజున ఈ విధంగా గజలక్ష్మీ శివలింగానికి జలాభిషేకం చేయడం.. భక్తులు, పర్యాటకులను విశేషంగా ఆకర్షించింది. కొందరు భక్తులు ఈ దృశ్యాలను తమ సెల్ ఫోన్లతో ఫోటోలు తీసి వాటిని సోషల్ మీడియాలో పెట్టడంతో ఇది కాస్తా చర్చనీయాంశంగా మారింది. పరమ శివుడు ప్రకృతిలో మమేకమై వున్నాడని, ఆయన చల్లని చలువతోనే సకలచరాచర సృష్టి హాయిగా నడుస్తుందని అంటున్నారు కొందరు భక్తులు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles