Kannada film actor files false robbery case నటుడి ఫేక్ కేసు.. అంతా తూచ్ అని తేల్చిన పోలీసులు

All for publicity sandalwood actor karthik vikram fakes robbery

Karthik Vikram, Kannada actor karthik vikram, Karthik vikram attacked, Nagavalli Vs apthamithraru,Apthamithraru 2,Apthamitra 2, Sandalwood, Karnataka, CCTV, false robbery case, Kannada film actor, Police, Crim

Upcoming Kannada actor Karthik Vikram, who is making his debut with Nagavalli Vs Apthamithraru, was Tuesday, March 13, attacked by a group of eight men. He is out of danger and currently undergoing treatment at a private hospital in the same locality.

నటుడి ఫేక్ కేసు.. అంతా తూచ్ అని తేల్చిన పోలీసులు

Posted: 03/15/2018 10:04 AM IST
All for publicity sandalwood actor karthik vikram fakes robbery

సినీరంగంలో తనకంటూ గుర్తింపును సొంత చేసుకునేందుకు హీరోలు ఎన్నో ప్రయత్నాలు చేస్తుంటారు. మరీ ముఖ్యంగా తమ చిత్రాలను ప్రమోట్ చేయడం కోసం ఊరువాడ యాత్రలు చేస్తుంటారు. అయితే ఇందుకు పూర్తి భిన్నంగా తనపై సానుభూతి వ్యక్తం కావడానికి ఓ కన్నడ నటుడు ఏకంగా ఫేక్ యాక్సిడెంట్ కేసుతో పాటు దోపిడి కేసును కూడా సృష్టించాడు. ఇంతకీ ఎవరా నటుడు అని అంటారా..? నాగవళ్లి వర్సెస్ అప్తమిత్రుడు చిత్రంతో శాండిల్ వుడ్ లోకి ఎంట్రి ఇచ్చిన హీరో విక్రమ్ కార్తీక్, తనపై దాడి జరిగినట్టు తప్పుడు దోపిడీ కేసు పెట్టి, పోలీసులను తప్పుదారి పట్టించాడు.

కార్తీక్ పెట్టిన కేసుపై విచారణ జరిపిన పోలీసులు ఇదంతా ఫేక్ కేసుగా తేల్చారు. ఇందుకు సంబంధించిన వివరాలను వెల్లడిస్తూ, బసవేశ్వర నగర్ లో నివసిస్తున్న ఆయన, శంకర్ మఠ్ ప్రాంతంలో తన కారు ప్రమాదానికి గురైందని, దీంతో తనపై ఆరుగురు దాడి చేశారని, తన కారుతో పాటు సెల్ ఫోన్ ను కూడా ఎత్తకెళ్లారని ఫిర్యాదు ఇచ్చారని..పోలీసులు తెలిపారు. దీనిపై విచారించిన తాము స్థానికంగా ఏర్పాటు చేసిన సిసిటీవీ ఫూటేజీని పరిశీంచామని అయినా ఎలాంటి దాడి ఘటన కానీ, దోపిడి ఘటన దృశ్యాలు కానీ తమ పరిశీలనలో కనిపించలేదని తెలిపారు.

దీంతో కార్తీక్ ను తమదైన స్టైల్లో విచారించిన తరువాత కార్తీక్ నిజాన్ని అంగీకరించాడని, కేవలం ప్రజల్లో సానుభూతికి సంపాదించుకునేందుకే ఈ నాటకానికి తెరతీశానని పోలీసుల ఎదుట అంగీకరించాడు. అసలు జరిగిందేంటంటే.. తన కారును అతి వేగంతో నడిపిస్తూ, రోడ్డు పక్కనే నిలిపి ఉన్న మరో కారును ఢీకొట్టాడు కార్తీక్.. సదరు వాహనం యజమాని కార్తీక్ ను నిలువరిస్తే, కారుకయ్యే మరమ్మతు డబ్బులు తాను ఇస్తానని చెప్పాడని పోలీసులు తెలిపారు. డబ్బు తెచ్చేంతవరకూ కారును, మొబైల్ ఫోన్ నూ ష్యూరిటీగా ఉంచుకోవాలని నమ్మబలికి, వాటిని ఇచ్చి వెళ్లాడని, ఆపై స్టేషన్ కు వచ్చి తనపై దాడి జరిగినట్టు తప్పుడు కేసు పెట్టాడని తెలిపారు. ఈ మేరకు అతనిపై కేసు నమోదు చేయనున్నట్టు అధికారులు వెల్లడించారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles