Man Bites Off Snake Head in Revenge Attack | కాటేసిందన్న కోపంతో తల కొరికి మింగేశాడు.. చివరల్లో చిన్న ట్విస్ట్

Man revenge attack on snake in up

Snake Bite, Revenge Attack, Uttar Pradesh, Hardoi, Sonelal, Snake Head Chew, Revenge Attack on Snake, Man Bites Snake

Man Bites Snake to Death in Revenge in Uttar Pradesh. In a bizarre incident, Sonelal a Farmet from Hardoi.. Bites Off Snake’s Head in Revenge Attack bit off a snake’s head and chewed it before spitting it out to take revenge. The man claimed he did it because the snake had bitten him. However, the doctor could not find any bite marks on him.

పాము కాటేసిందన్న కోపంతో...

Posted: 02/21/2018 11:44 AM IST
Man revenge attack on snake in up

పాము కాటేస్తే వెంటనే ఆస్పత్రికి వెళ్లటమో లేక ఊళ్లలో అయితే మూలికల మందులను ఆశ్రయించటం చేస్తుంటాం. కానీ, ఇక్కడో వ్యక్తి పాము కాటు వేసిందని రగిలిపోయాడు. అమాంతం దాని తలను దొరకబుచ్చుకుని కరకరా నమిలి మింగేశాడు. ఉత్తరప్రదేశ్‌లో జరిగిన ఈ ఘటన ఆలస్యంగా వెలుగుచూసింది.

హర్దోయ్‌ జిల్లాలో శుక్లాపూర్‌భగర్‌ గ్రామానికి చెందిన సోనేలాల్‌ అనే రైతు శనివారం పొలం పనులకు వెళ్లాడు. ఇంతలో ఏదో కాలికి కుట్టినట్లు అతనికి అనిపించింది. చూస్తే పక్కనే ఓ పాము కనిపించింది. పాము తలను కొరికి తినేశాడు. కాసేపటికే అతను స్పృహతప్పి పడిపోయాడు. అటుగా వచ్చిన గ్రామస్తులు.. అంబులెన్స్ కి ఫోన్‌చేసి సోనేలాల్‌ను ఆస్పత్రిలో చేర్పించారు. పాము తలను తినడం వల్ల ఆ విషప్రభావానికి లోనై అతను స్పృహకోల్పోయాడంట.

‘రోగనిరోధక శక్తి బలంగా ఉండటంతో ప్రాణాపాయం తలెత్తలేదు. ముందుజాగ్రత్తగా యాంటీవెనం ఇంజెక్షన్‌ ఇచ్చాం’ అని వైద్యులు వెల్లడించారు. కొన్ని గంటల్లోనే సోనేలాల్‌ ఆస్పత్రి నుంచి డిశ్చార్జై ఇంటికి వెళ్లిపోయాడు. అయితే సోనేలాల్‌ను క్షుణ్నంగా పరీక్షించిన వైద్యులు అతన్ని పాము కరవనేలేదని వైద్యులు తేల్చటం అసలు కొసమెరుపు.

Revenge Attack UP Man Eats Snake Head

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles