Pawan Kalyan calls TRS MP KAVITHA as Chelli చెల్లెలు కవిత గారికి ధ్యాంక్యూ అంటూ పవన్ కల్యాన్ ట్విట్..

Pawan kalyan thanks mp kavitha call her as chelli

AP Special status, Janasena, Pawan Kalyan, TRS, TRS MP Kavitha, KCR, Twitter, social media, union budget alloctions, to AP, Arun Jaitley, PM Modi, Lok sabha, Parliament

Power Star, Janasena President Pawan kalyan has got some new twitter post that he gave out a tweet praising TRS MP KAVITHA as Chelli (younger sister) for supporting Andhra pradesh MP's protest about Special status in Parliament.

చెల్లెలు కవిత గారికి ధ్యాంక్యూ అంటూ పవన్ కల్యాన్ ట్విట్..

Posted: 02/10/2018 11:16 AM IST
Pawan kalyan thanks mp kavitha call her as chelli

రాష్ట్రంలో వ్యవసాయానికి నిరంతర విద్యుత్ పథకాన్ని ఈ ఏడాది జనవరి 1న నుంచి ప్రారంభించిన క్రమంలో తెలంగాణ ముఖ్యమంత్రికి ప్రగతికాంక్షకుడంటూ కేసీఆర్ ను ప్రశంసించి.. అటు విపక్షాల నుంచి విమర్శలను ఎదుర్కొన్న జనసేన అధినేత, సినీనటుడు పవర్ స్టార్ పవన్ కల్యాణ్ వాటిని సమర్థవంతంగా తిప్పికొట్టారు, ఎవరెన్ని విమర్శలు చేసినా మంచిని అభినందించడంలో, ప్రశంసించడంతో అది మరిన్నీ మంచి కార్యక్రమాలకు నాంది పలుకుతుందని చెప్పిన ఆయన ఇవాళ మరోమారు తెలంగాణ ఎంపీకి ధన్యవాదాలు తెలిపారు.

'రాష్ట్ర విభజన సమయంలో నవ్యాంద్రప్రదేశ్ కు కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన హామీలపై పార్లమెంటు సాక్షిగా కేంద్రాన్ని నిలదీసిన టీఆర్ఎస్ ఎంపీ చెల్లెలు కవిత గారికి మనస్పూర్తిగా ధన్యవాదాలు చెబుతున్నా' అంటూ ఆయన ట్వీట్ చేశారు. రాష్ట్రానికి ప్రత్యేక హోదా విషయమై కవిత ఏకంగా పార్లమెంటులో సభ్యుల గుండుసూది నిశబ్దం మధ్య ప్రసంగించి అటు అంధ్ర ప్రజలను, ఇటు తెలంగాణ ప్రజలను అకట్టుకున్న విషయమై స్పందించిన పవన్ కల్యాన్ అమెకు ధన్యావాదాలు చెప్పారు.

బడ్జెట్ సమావేశాల సందర్భంగా కవిత మాట్లాడుతూ, ఏపీకి ఇచ్చిన హామీలను నెరవేర్చాలని కేంద్ర ప్రభుత్వాన్ని కోరారు. రాష్ట్ర ప్రయోజనాల సాధన కోసం ఏపీ ఎంపీలు చేస్తున్న పోరాటానికి తమ మద్దతు ఉంటుందని తెలిపారు. మిత్రపక్షంగా ఉన్న పార్టీ ఎంపీలే ఆందోళన కార్యక్రమాలను చేపడితే, దేశ ప్రజలకు నెగెటివ్ మెసేజ్ వెళుతుందని... హామీలను నెరవేర్చే ప్రయత్నం చేయాలని కేంద్రాన్ని కోరారు. ఈ నేపథ్యంలోనే కవితకు పవన్ కల్యాణ్ ధన్యవాదాలు తెలిపారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : AP Special status  Janasena  Pawan Kalyan  TRS  TRS MP Kavitha  KCR  Twitter  

Other Articles