Miss Kazakhstan turned out to be a young man అంతఃసౌందర్యమే మిన్న.. నెగ్గిన అందాలపోటీ ఫైనలిస్ట్ వాదన

Miss kazakhstan arena aliva who turned out to be a young man named elie diaghilev

miss, beauty, russian girls, photo, Video, Miss Kazakhstan turned out to be a young man, Miss Kazakhstan, Arena Aliva, man, model, Eli Diaghilev, natural beauty, artificial beauty, Almaty, Kazakhstan

"I always defend natural beauty, not artificiality," said Miss Kazakhstan Arena Aliva, who has hidden a secret after reaching the finals.

ITEMVIDEOS: అంతఃసౌందర్యమే మిన్న.. నెగ్గిన అందాలపోటీ ఫైనలిస్ట్ వాదన

Posted: 02/06/2018 11:43 AM IST
Miss kazakhstan arena aliva who turned out to be a young man named elie diaghilev

అమ్మాయిలకు అంతఃసౌదర్యం గురించి అసలు పట్టకుండా. కేవలం బాహ్యసౌందర్యం కోసమే పాకులాడుతున్నారని వాదించిన ఓ యువకుడు.. తాను చేసిన వాదనల్లో చాలా పస వుందని చాటాడు. ఏకంగా 2018 మిస్‌ వర్చ్యువల్‌ కజకిస్తాన్‌ అందాల పోటీలను తాను వేదికగా చేసుకున్నాడు. ఈ పోటీలలో పైనల్ వరకు వెళ్లిన తరుణంలో తన ఉద్దేశ్యాన్ని బయటపెట్టాడు. అందమైన అమ్మాయిలు అనగానే బాహ్యసౌందర్యానికే పెద్దపీట వేస్తున్నారని, కానీ వారి అంతఃసౌందర్యమే గొప్పదని చాటాడు. అసలు అమ్మాయిల అందాల పోటీల్లోకి అయనెలా ఎంపికయ్యాడు.?

ఒకనాడు యువతులకు ఉన్నత ఔనత్యం వుండేదని, భూదేవంత సహనం వుండేదని, వారు అలోచన విధానాల్లో సమాజహితం కనబడేదని, దీంతో వారిలో అంతఃర్గతంగా సౌందర్యముండేదని అభిప్రాయపడిన అబ్బాయి ఇందుక అబ్బాయిగా తాను అమ్మాయిల కన్నా మెరుగ్గా, అందంగా కనిపించగలనని చాటాడు. మిస్ కజకిస్తాన్ అందాల పోటీలలో ఫైనలిస్ట్‌గా ఎంపికైయ్యాడు. అందుకని తన పేరును  అరినా గా మార్చుకున్నాడు. ఈ తరుణంలో ఊహించని ట్విస్ట్ ఇస్తూ తాను అమ్మాయిని కాదని, యువకుడినని తన అసలు పేరు ఎలీ డయాగ్లెవ్ అని సోషల్ మీడియా ద్వారా వెల్లడించాడు.

అసలు తానెందుకు అమ్మాయిల అందాల పోటీల్లో పాల్గొనాల్సి వచ్చిందో తెలిపాడు. ఎలీ డయాగ్లెవ్ ఒక మోడల్‌.. ఓ రోజు తన ఫ్రెండ్స్‌ తో కాఫీ షాపులో కూర్చుని ఉండగా, వారి మధ్య అమ్మాయిల సౌందర్యంపై ఒక చర్చ మొదలైంది. ఒకప్పుడు మహిళలు అంతర్గత సౌందర్యానికి ప్రాధాన్యత ఇచ్చేవారని, దీంతో ఉన్నత వ్యక్తిత్వంతో ఉండేవారని, ఆధునిక మహిళలు బాహ్యసౌందర్యానికి మాత్రమే ప్రాధాన్యత ఇస్తున్నారని, దీంతో వ్యక్తిత్వం కోల్పోయి, ట్రెండ్‌ ఎటు ఉంటే అటు పోతున్నారని వాదించాడు.

ఫ్యాషనబుల్‌ గా దుస్తులు ధరించడం, మేకప్‌ వేసుకుంటే చాలు, తాము అందంగా ఉంటామని అనుకుంటున్నారని పేర్కొన్నాడు. ప్రస్తుతం అందుబాటులో ఉన్న ఆధునిక పద్ధతులతో ఓ మగాడు కూడా అందమైన మహిళగా మారిపోవచ్చని అన్నాడు. అతని వాదనను అతడి స్నేహితులు వ్యతిరేకించారు. అయితే తన వాదన సరైనదేనని నిరూపించాలని నిర్ణయించుకున్నాడు. దీంతో మేకప్‌ ఆర్టిస్టు సాయం తీసుకున్నాడు. ఎలీ కాస్తా అందమైన అరినాగా మారిపోయాడు. వర్చ్యువల్‌ కజకిస్తాన్‌ అందాల పోటీలో భాగంగా ఆన్‌ లైన్లో తన ఫొటోలను పెట్టాడు.

తన ఫొటోలకు నెటిజన్ల స్పందన అదిరిపోయింది. దీంతో ఈ పోటీల్లో ఫైనలిస్టుగా ఎంపికయ్యాడు. తన మాట నెగ్గింది. ఇక నిజం చెప్పాల్సిన టైమొచ్చిందని భావించిన ఎలీ తాను అమ్మాయిని కాదని, తన పేరు కూడా అరినా కాదని చెబుతూ ఒక వీడియో పోస్టు చేసి, ‘కొంత మంది అమ్మాయిలు ఈ మధ్య బాహ్య సౌందర్యానికి ఎక్కువ ప్రాధాన్యతనిస్తున్నారు. ఆ బాహ్య సౌందర్యాన్ని ఓ మగాడు కూడా సాధించగలడు. వ్యక్తిత్వం, అంతః సౌందర్యం అన్నవి అన్నింటికన్నా ముఖ్యం. నా ఈ పని కొంతమందైనా అమ్మాయిలను ఆ దిశగా ఆలోచించేలా చేస్తుందని భావిస్తున్నాను’ అంటూ పేర్కొన్నాడు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Miss Kazakhstan  Arena Aliva  man  model  Eli Diaghilev  natural beauty  artificial beauty  Almaty  Kazakhstan  

Other Articles