SC Lawyer Harish Salve alleges threat సుప్రీంకోర్టు సీనియర్ న్యాయవాదికి బెదిరింపులు..

Padmaavat advocate harish salve gets threat calls files complaint

Harish Salve, Harish Salve threat calls, harish salve police complaint, sanjay leela bhansali, Padmavati, Padmaavat ban, padmaavat, Central Board of Film Certification, padmaavat row, supreme court

Harish Salve had received a phone call on his office landline and was allegedly threatened for speaking in favour of the film, the police said.

సుప్రీంకోర్టు సీనియర్ న్యాయవాదికి బెదిరింపులు..

Posted: 01/20/2018 10:56 AM IST
Padmaavat advocate harish salve gets threat calls files complaint

దేశ సర్వోన్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు న్యాయమూర్తి జస్టిస్ లోయా హత్య విషయంలో స్పందించిన సీనియర్ న్యాయమూర్తుల అంశం యావత్ దేశవ్యాప్తంగా సంచలనం రేపింది. న్యాయవ్యవస్థ పూర్తిగా అందోళనకర పరిస్థితులను ఎదుర్కోన్న ఈ నేపథ్యంలో ఆ విషయం సద్దుమణగకముందే మరో సుప్రీంకోర్టు సీనియర్ న్యాయవాది హరీష్ సాల్వేకు బెదిరింపు ఫోన్ కాల్స్ రావడం సంచలనంగా మారింది.

గతంలో కేవలం వ్యక్తిగత కక్షలకు మాత్రమే పరిమితమైన బెదరింపులు.. ఈ మధ్యకాలంలో ప్రముఖులకు కూడా వదలడం లేదు. ఏకంగా ప్రముఖులను కూడా టార్గెట్ చేస్తూ చంపుతామంటూ బెదిరింపులు ఫోన్ కాల్స్ రావడం తీవ్ర కలకలం రేపుతుంది 'పద్మావత్' సినిమాకు సంబంధించి ఆ చిత్ర నిర్మాతల తరపున సుప్రీంకోర్టులో సాల్వే వాదనలు వినిపించారు.

దీంతో, రాజ్ పుత్ కర్నిసేనకు సంబంధించిన వ్యక్తులు ఈ బెదిరింపులకు దిగారు. 'పద్మావత్'కు అనుకూలంగా వాదించినందుకు తీవ్ర పరిణామాలు ఎదుర్కోక తప్పదు అంటూ ఫోన్ ద్వారా బెదిరించారు. అంతేకాదు, దమ్ముంటే పోలీసులకు ఫిర్యాదు చేసుకోవాలని కూడా సవాల్ విసిరారు. ఈ విషయాన్ని మీడియాకు స్వయంగా సాల్వే తెలిపారు. కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తును ప్రారంభించారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : delhi  delhi police  Harish Salve  Padmaavat  padmaavat row  supreme court  

Other Articles