Govt forms panel to review rule on National anthem జాతీయ గీతాలపనపై కేంద్రం యూటర్న్.. సుప్రీంలో పిటీషన్

Centre hits pause button on national anthem in cinema halls

National anthem, Supreme Court, Free speech, national anthem in theatres, committee on national anthem, centre u turn on nationa anthem, mandatory in theatres, government panel, centre, u turn

In an affidavit filed by the home ministry, the government asked for a “restoration of the status quo ante” until the guidelines were formalised.

జాతీయ గీతాలపనపై కేంద్రం యూటర్న్.. సుప్రీంలో పిటీషన్

Posted: 01/09/2018 10:53 AM IST
Centre hits pause button on national anthem in cinema halls

సినిమా ధియేటర్లలో జాతీయ గీతాలాపనను తప్పనిసరి చేస్తూ ఉత్తర్వులు జారీ చేసిన కేంద్రం. దీనిపై విమర్శలు రావడంతో వెనక్కుతగ్గింది. సినిమా ధియేటర్లలో జాతీయ గీతం అలపించడంపై కేంద్రం యూటర్న్ తీసుకుంది. జాతీయ గీతాలపన విషయంలో తాము ఒక కమిటీని ఏర్పాటు చేశామని, అ కమిటీ నివేధిక వచ్చేంత వరకు.. తప్పని సరి పూర్వపు పరిస్థితిని కొనసాగించాలని కేంద్రం దేశసర్వోన్నత న్యాయస్థానానికి తెలియజేసింది.

ఈ మేరకు సుప్రీంకోర్టులో ఓ అఫిడవిట్ దాఖలు చేసిన కేంద్రం.. సినిమా ప్రారంభానికి ముందు హాళ్లలో జాతీయ గీతాన్ని ఆలపించాల్సిన అవసవరం లేదని కోర్టుకు తెలిపింది. జాతీయ గీతాన్ని ఎక్కడ? ఎప్పుడు? ఆలపించాలనే దానిపై అధ్యయనానికి తమ ప్రభుత్వం ఓ కమిటీని ఏర్పాటు చేసినట్టు అఫిడవిట్‌లో పేర్కొంది. ఆ కమిటీ ఆరు నెలల్లో నివేదిక ఇస్తుందని, అప్పటి వరకు 16 నవంబరు 2016లో ఇచ్చిన తీర్పు పూర్వపు స్థితిని కొనసాగించాలని కేంద్రం అత్యున్నత న్యాయస్థానాన్ని కోరింది
 
సినిమా హాళ్లలో జాతీయ గీతాలాపన తప్పనిసరి చేస్తూ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంపై దేశవ్యాప్తంగా విమర్శలు వెల్లువెత్తాయి. దేశభక్తిని ఇలా నిరూపించుకోవాల్సిన అవసరం దేశపౌరులకు లేదని కొందరు వాదించారు. సరదాగా సినిమా చేసేందుకు సినిమా హాళ్లుకు వస్తే అవి కాస్తా జాతీయ గీతాలాపనకు వేదికగా మారుతున్నాయని. ఇది సమంజసం కాదనిపలువురు అభిప్రాయపడ్డారు. దీంతో తర్జన భర్జన పడిన ప్రభుత్వం దిగి వచ్చి.. జాతీయ గీతాలాపనపై కమిటీని ఏర్పాటు చేసి.. ఆరు నెలల్లోపు నివేదిక ఇవ్వాలని అదేశించింది. ఇదే విషయాన్ని తెలియజేస్తూ సుప్రీంకోర్టులో కేంద్రం అఫిడవిట్ దాఖలు చేసింది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Supreme Court  National Anthem  mandatory  theatres  government panel  centre  u turn  

Other Articles