Pawan Kalyan's Tweet Slaps Critics​ కులరాజకీయాలు అర్థికప్రగతికి అవరోధాలు: పవన్

Caste division power politics will affect economic progress pawan

Janasena, Pawan Kalyan, Pawan Tweets, JanaSena tweets, critics, senior journalist greeting, ecomomy progress, andhra pradesh, politics

power star Pawan Kalyan was targeted by Big Boss contestant and film critic Mahesh Kathi, who made acerbic comments on the actor.

కులరాజకీయాలు అర్థికప్రగతికి అవరోధాలు: పవన్

Posted: 01/06/2018 02:02 PM IST
Caste division power politics will affect economic progress pawan

సినీనటుడు, జనసేన అధినేత పవర్ స్టార్ పవన్ కల్యాన్.. ఎంతో అచితూచి మాత్రమే తన సామాజిక మాద్యమాన్ని వాడుతారు. అయితే పార్టీకి చెందిన అంశాలను, కార్యక్రమాలను అభిమానులతో పంచుకునేందుకు నిత్యం వారితో టచ్ లో వుండేందుకు దీనినే వంతెనగా వాడుతున్న పవర్ స్టార్.. ఇవాళ మాత్రం తనకు వచ్చిన ఓ ట్విట్ ను షేర్ చేస్తూ అన అభిమానులకు శుభోదయం తెలిపాడు. సరిగ్గా గత అసెంబ్లీ ఎన్నికలకు ముందు పవన్ తో పాటు జనసేన పార్టీని, పార్టీ కార్యకర్తల సేవలన్నింటినీ వినియోగించుకున్న పలువురు రాజకీయ పార్టీలు.. ఆయన ప్రశ్నించడం ప్రారంభించే సమయానికి కులం, మతం, వర్ణం, ధనం అన్ని అంశాలను తెరపైకి తీసుకువచ్చిన విషయం తెలిసిందే.

ఇక క్రీయాశీలక రాజకీయాల్లోకి వస్తున్నానని, మరీ ముఖ్యంగా ప్రజాసమస్యలపై తాను ఉద్యమిస్తానని చెప్పగానే.. జనసేన పార్టీపై.. పవన్ కల్యాన్ కేంద్రంగా పెద్ద ఎత్తున ఆరోపణలు, ప్రత్యారోపణలతో సోషల్ మీడియా వేడెక్కడ ప్రారంభమైంది. తనను ఎవరెవరు ఎలా టార్గెట్ చేస్తున్నారన్న విషయాన్ని కూడా పవన్ కల్యాన్ తన సమావేశాల్లో నిర్మోహమాటంగానే చెప్పారు. మరీ ముఖ్యంగా ఓ పత్రిక, అదే పత్రికకు చెందిన టీవీ ఛానెల్ తన సమావేశాలపై ఎలా విషం కక్కిందో.. ఎలాంటి కులచట్రంలో తనను బంధీని చేయాలని ప్రయత్నించిందో కూడా చెప్పేశారు.

ఇక తాజాగా ఇలాంటి విమర్శలు, అరోపణలు ఎక్కువవుతున్నాయి. ఈ నేపథ్యంలో, పవన్ తన ట్విట్టర్ అకౌంట్ ద్వారా స్పందించారు.  'వ్యక్తిత్వంలో నిన్ను ఓడించడం చేతకాని వాళ్లే... నీ కులం, ధనం, వర్ణం గురించి మాట్లాడతారు' అంటూ ఓ మెసేజ్ ను పోస్ట్ చేశారు. దీన్ని ఎవరు చెప్పారో తనకు తెలియదు కానీ... గౌరవనీయ ఓ సీనియర్ జర్నలిస్టు తనను ఈ విధంగా గ్రీట్ చేశారంటూ ట్విట్టర్ లో పేర్కొన్నారు. దీన్ని షేర్ చేసుకోవాలనిపించిందని చెప్పారు.

కులాల పరంగా విడిపోవడం, అధికారమే పరమావధిగా సాగే రాజకీయాలు ప్రస్తుత తరుణంలో పోషిస్తున్న పాత్ర ప్రమాద ఘంటికలను మోగిస్తోందని పవన్ అన్నారు. ఇది మన ఆర్థిక మందగమనానికి కారణం కావడమే కాక, మన సమాజానికి అత్యంత కీడును కలగజేస్తుందని చెప్పారు. అయినా విమర్శలు మాత్రం అగడం లేదు. గజరాజు రాజసంభుగా వెళ్తుండ.. గ్రామసింహాలు సింహాలుగా భ్రమించి మొరుగవే అన్నట్లు పవన్ కు రాజకీయాంగా లభిస్తున్న అదరణ, ఆయన అలోచనలు బడుగు బలహీన వర్గాలను అలోచింపజేస్తుండగా, ఉన్నతమైన ఔనత్యం, వ్యక్తిత్వానికి తెలుగువారు బ్రహ్మరథం పడుతున్నారు. అదుకునేందుకు ముందుండే చేతులే తప్ప ప్రార్థించే పదవులతో పనిలేదని చెప్పిన పవన్ ను.. విమర్శించే మాటలు అనేకం కానీ.. ఆయనలా అచరించేవారు మాత్రం కనరారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles