Hardik says Nitin Patel to join Congress 'with 10 BJP MLAs' నితిన్ పటేల్ ను కాంగ్రెస్ లోకి అహ్వానించిన హార్థిక్ పటేల్

Hardik patel invites gujarat deputy cm to join congress

Hardik Patel, Patidar Anamat Andolan Samiti, Gujarat, Deputy CM Nitin Patel, Vijay Rupani, Bharatiya Janata Party, Congress

Amid political drama in Gujarat which has begun right after the new government took the charge, Patidar Anamat Andolan Samiti (PAAS) convenor Hardik Patel has invited deputy chief minister Nitin Patel to join congress.

నితిన్ పటేల్ ను కాంగ్రెస్ లోకి అహ్వానించిన హార్థిక్ పటేల్

Posted: 12/30/2017 12:51 PM IST
Hardik patel invites gujarat deputy cm to join congress

గుజరాత్ లో రెండు దశాబ్దాలకు పైగా అధికారంలో ఉండి, ప్రజా వ్యతిరేకత పెరిగినా, ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికలలో చావు తప్పి కన్ను లోట్టబోయిన చందంగా అధికారాన్ని నిలబెట్టుకోవడంలో సఫలమైన బీజేపీకి ఇప్పుడు అసలు సమస్యలు ఉత్పన్నమయ్యాయి. ఇన్నాళ్లు ఐక్యత కనిపించిన పార్టీలో ఇప్పుడు అంతర్గత కుమ్ములాటలకు వేదికగా నిలుస్తున్నాయి. శాఖల కేటాయింపులో తాను గతంలో నిర్వహించిన శాఖలనే కేటాయించాలని డిమాండ్ తో ఏకంగా ఉపముఖ్యమంత్రి బాధ్యతలను కూడా చేపట్టడం లేదంటే పరిస్థితి ఎంతవరకు ‘సా’గిందో అర్థం చేసుకోవచ్చు.

గుజరాత్ విజయ్ రూపానీ ప్రభుత్వంలో ఉప ముఖ్యమంత్రిగా, అటు పార్టీలో ఇటు ప్రభుత్వంలో నెంబర్ 2గా వున్న నితిన్ పటేల్ కు ప్రస్తుతం క్యాబినెట్ ర్యాంకుల కేటాయింపులలో కేటాయించిన శాఖలు అయనను అవమానించేలా వున్నాయని ఆయనే భావిస్తున్నారు. గతంలో కేటాయించిన ఆర్థిక, పట్టణాభివృద్ధి, పెట్రోలియం శాఖలు ఈ సారి దక్కలేదు. శాఖల కోతను అవమానంగా భావిస్తోన్న నితిన్‌.. విధుల్లో చేరేందుకు విముఖంగా ఉన్నారు. ఇప్పటివరకూ బాధ్యతలు స్వీకరించలేదు సరికదా, కనీసం సచివాలయం వైపు కూడా కన్నెత్తి చూడలేదు.

గతంలో నితిన్ కీలకమైన ఆర్థిక, పట్టణాభివృద్ధి, పెట్రోలియం శాఖలను నిర్వహించగా, వాటిని ఇప్పుడాయనకు ఇవ్వలేదు. ఇదే నితిన్ అలకకు అసలు కారణంగా తెలుస్తోంది. డిప్యూటీ సీఎంగా ఉన్న తనకు సరైన ప్రాతినిధ్యం లభించలేదని ఆయన తన వర్గం ఎమ్మెల్యేల వద్ద వాపోయినట్టు తెలుస్తోంది. గతంలో తాను చూసిన శాఖలనే తిరిగి అప్పగించాలని ఆయన డిమాండ్ చేస్తున్నట్టు సమాచారం. నితిన్ కు ఎంతోకాలంగా జూనియర్ గా ఉన్న సౌరభ్ పటేల్ కు రెండు ముఖ్యమైన శాఖలను ఇవ్వడం కూడా నితిన్ కు ఇబ్బందికరమైన పరిస్థితిని కల్పించిందని రాజకీయ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. ఈ క్రమంలో ఆయన తన వర్గానికి చెందని పది మంది ఎమ్మెల్యేలతో కాంగ్రెస్ లో చేరాలని పటేదార్ అందోళన సమితి అధ్యక్షుడు హార్ధిక్ పటేల్ సూచించారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles