Rs 5 lakh incentive for girl child రేపు జన్మించే ఆడపిల్లలు.. పుట్టుకతో లక్షాధికారులు

First girl born in 2018 in bengaluru to get free education

Cash incentive scheme for girl child,Bruhat Bengaluru Mahanagara Palike,Bengaluru girl child incentive scheme,BBMP

The Bruhat Bengaluru Mahanagara Palike (BBMP) has announce a cash incentive scheme for girl child born on January 1 at the civic body-run hospitals through normal delivery procedure.

రేపు జన్మించే ఆడపిల్లలు.. పుట్టుకతో లక్షాధికారులు

Posted: 12/29/2017 02:55 PM IST
First girl born in 2018 in bengaluru to get free education

ఎవరో వస్తారని, ఏదో చేస్తారని కొందరు.. ప్రభుత్వాలే చేయాలి, పాలకులే పట్టించుకోవాలని మరికోందరు ఎదరుచూస్తునే వుంటారు. అలాంటి వారికి మన వంతుగా ఏం చేస్తున్నామని ప్రతీ ఒక్కరు అలోచించి ఎంతో కొంత సాయం అందిస్తే జీవితాలు బాగుపడతాయని ఎందరో పెద్దలు చెప్పిన ఉవాచ. ముఖ్యంగా సమాజ రుగ్మతలను రూపుమాపేందుకు ప్రభుత్వాల నుంచి ప్రోత్సాహాలు లేకున్నా.. పాలకుల పర్యవేక్షణ కరువైనా కొందరు మాత్రం తమ బాధ్యతగా ముందుకు వచ్చి వాటిని నివారణకు ప్రయత్నాలు చేస్తున్నారు.

ఇటీవల కేరళలోని ఓ కౌన్సిలర్ తన వార్డు పరిధిలో ఎవరింటైనా అమ్మాయి పుడితే బంగారాన్ని బహుమతిగా ఇస్తానని చేసిన ఎన్నికల హామీని క్రమం తప్పకుండా పూర్తి చేస్తూ అందరి చేత శభాష్ అనిపించుకుంటున్నారు. ఇక తాజాగా అలాంటి అలోచనే చేశారు బెంగళూరు మేయర్ సంపత్ రాజ్. ఈ నూతన సంవత్సరం రోజున ఏ జంటైనా అమ్మాయిలకు జన్మనిస్తే ఆయా జంటలకు న్యూఇయర్ కానుకను ప్రకటించారు. అయితే ఇది తన పాలకమండలి నుంచి ఇస్తున్న బహుమతిగా పేర్కోన్నారు.

జనవరి 1న జన్మించే ఆడశిశువుకు బెంగళూరు మహానగర పాలికే నుంచి 5 లక్షల రూపాయలను బహుమతిని ఇస్తామని ఆయన ప్రకటించారు. కొత్త సంవత్సరం సందర్భంగా నగరవాసులకు ఉత్సాహాన్ని ఇచ్చే ప్రకటన చేశారు ఆయన. 2018 జనవరి ఒకటో తేదీన జన్మించే శిశువులకు ఈ అవకాశమని మేయర్ సంపత్ రాజ్ ప్రకటించారు. ఈ ఆఫర్ లో కొన్ని రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఉన్నాయి. ప్రైవేట్ ఆసుపత్రుల్లో పుట్టే శిశువులకు ఈ అవకాశం లేదు. ఆడశిశువులే అయినా.. ప్రైవేట్ ఆసుపత్రిలో గాక.. నగర పరిధిలోని ప్రభుత్వాసుపత్రుల్లో పుట్టిన వారికే ఈ ఐదు లక్షల రూపాయల ప్రైజ్ మనీ దక్కుతుంది.

ఇక మామూలు కాన్పు అనే షరతును కూడా పెట్టినట్టుగా తెలుస్తోంది. సిజేరియన్ ద్వారా కాకుండా.. సహజంగా  న్యూ ఇయర్  మొదటి రోజున పుట్టిన ఆడ శిశువులకు బీబీఎంపీ తరఫు నుంచి ఐదు లక్షల రూపాయల బహుమతి దక్కుతుందని తెలిపారు మేయర్. ఆడపిల్లలు పుట్టడంపై కొంతమంది తల్లిదండ్రుల్లో ఉండే వ్యతిరేకతను తగ్గించడానికే ఈ బహుమతిని అనౌన్స్ చేసినట్టుగా మేయర్ వివరించారు. ఎక్కువమంది ఆడపిల్లలు పుట్టినా.. వాళ్లందరికీ బీబీఎంపీ ఈ బహుమతి ఇస్తుందన్నారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles