AAP Eyed on Karnataka Politics | ఆప్.. నెక్స్ట్ టార్గెట్ ఆ రాష్ట్రమేనా?

Aap may contest in karnataka election

Aam Admi Party(AAP), Karnataka, Semmbly Elections 2018, AAP Karnataka, Karnataka Poll, Aravind Kejriwal, AAP Karnataka Elections

AAP Now Eyed on Karnataka Politics. Aravind Kejriwals' AAP which has contested assembly elections in Punjab, Goa and Gujarat for the first time, currently holds power in Delhi.

కర్ణాటకపై ఆప్ కన్ను?

Posted: 12/21/2017 08:18 PM IST
Aap may contest in karnataka election

క‌ర్ణాట‌క అసెంబ్లీ ఎన్నిక‌లు వచ్చే ఏడాది జ‌ర‌గ‌నున్న విష‌యం తెలిసిందే. వ‌రుస‌గా విజ‌యాలు సాధిస్తూ ఇప్ప‌టికే 19 రాష్ట్రాల్లో అధికారంలో ఉన్న భార‌తీయ జ‌న‌తా పార్టీ త‌మ త‌దుప‌రి టార్గెట్‌గా క‌ర్ణాట‌క‌నే పెట్టుకుంది. కాగా, ఆమ్‌ ఆద్మీ పార్టీ కూడా క‌ర్ణాట‌క‌లో పోటీ చేస్తామ‌ని ప్ర‌క‌ట‌న చేసింది.

తాజాగా ఆ పార్టీ నేత‌ సంజయ్‌ సింగ్‌.. కర్ణాటక ఎన్నికల గురించి స్థానిక నేతలతో చర్చించేందుకు బెంగళూరుకు వెళ్లారు. ఆ రాష్ట్ర‌ ఎన్నికల్లో పోటీ చేయడంపై చ‌ర్చ‌లు జ‌ర‌పుతామ‌ని తెలిపారు. త‌మ‌ పార్టీకి ఆ రాష్ట్రంలో నాయకత్వ సమస్య ఉన్నప్ప‌టికీ త‌మ‌ కార్యకర్తలు మాత్రం ఎన్నికల్లో పోటీ చేసేందుకు రెడీగా ఉన్నార‌ని తెలిపారు.

మ‌రోవైపు ఆ రాష్ట్ర ముఖ్య‌మంత్రి సిద్ధ‌రామ‌య్య ఇటీవ‌ల మాట్లాడుతూ మ‌రోసారి త‌మ రాష్ట్రంలో కాంగ్రెస్‌ని అధికారంలోకి తీసుకొచ్చి త‌మ పార్టీ అధ్యక్షుడు రాహుల్ గాంధీకి తొలి గిఫ్ట్ ఇస్తామ‌ని ఉద్ఘాటించిన విష‌యం తెలిసిందే.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles