Ashok Gajapathi Raju in a row on molestation complaint మహిళా సెలబ్రిటీలపై కేంద్రమంత్రి వివాదాస్పద వ్యాఖ్యలు

Ashok gajapathi raju draws controversy on molestation complaint

Civil Aviation minister, TDP leader, Ashok Gajapathi Raju, TDP, women celebrities, molestation complaints, dangal actress, zaira wasim, pv sindhu, social media

Civil Aviation minister and TDP leader Ashok Gajapathi Raju stated that some celebrities and actors have been complaining about the services in the aviation industry on social media just for some mileage!

మహిళా సెలబ్రిటీలపై కేంద్రమంత్రి వివాదాస్పద వ్యాఖ్యలు

Posted: 12/14/2017 02:24 PM IST
Ashok gajapathi raju draws controversy on molestation complaint

కేంద్రమంత్రులకు వివాదాస్పద వ్యాఖ్యలు చేయడం అలవాటుగా మారిందా..? అంటే అవుననే వాళ్ల సంఖ్య బలంగానే వినిపిస్తుంది. ఓ కేంద్రమంత్రి స్వయంగా ఉత్తర్ ప్రదేశ్ ముఖ్యమంత్రి వున్న సభలో అమ్మాయిలు జీన్స్ ధరిస్తే పెళ్లి చేసుకునే పురుషులు ఎంతమంది వుంటారని ప్రశ్నించారు..? ఆ వివాదం మర్చపోకముందే మరో కేంద్రమంత్రి పబ్లిసిటీ కోసం సెలబ్రిటీలు కొంతమంది విమానాల్లో తమకేదో జరిగిపోతోందని ఆరోపిస్తున్నారని వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. ఇంతకీ ఎవరాయన అంటే కేంద్ర విమానయాన శాఖ మంత్రి అశోక గజపతిరాజు.

విమానాల్లో వేధింపులు అత్యంత అరుదని, ఏ తప్పు చేసినా శిక్ష తీవ్రంగా ఉంటుందన్న విషయం ప్రతి ఒక్కరికీ తెలుసునని అన్నారు.  'దంగల్' నటి జైరా సంచలన ఆరోపణలు చేస్తూ, ఓ వ్యక్తి తనను విమానంలో తాకాడని, మెడ, వీపు నిమిరాడని ఏడుస్తూ సెల్ఫీ వీడియోను పోస్టు చేయడంపై కేంద్ర మంత్రి స్పందిస్తూ.. విమానాల్లో ప్రయాణికుల భద్రత తమకు అత్యంత కీలకమని, ఎక్కడైనా ఇటువంటి ఘటనలు చోటు చేసుకుంటే తక్షణం చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. అయితే కొందరి సెలబ్రిటీల విషయం మాత్రం ఇలా వుందని అసహనం వ్యక్తం చేశారు.

అయితే తమకేమీ జరగకుండా సెలబ్రిటీలు ఏదో జరిగిపోయిందన్న విలపిస్తూ వీడియోలు సోషల్ మీడియాలో పోస్ట్ చేసి పబ్లిసిటీ పొందాలని భావిస్తార్నన వ్యాఖ్యలు వివాదాస్పదం అయ్యాయి. ఓ వైపు ప్రపంచ వ్యాప్తంగా తమకు గుర్తింపు వచ్చిన జైరా వసీమ్ లాంటి నటీమణులు ఇలాంటి చీఫ్ పబ్లిసిటీ కోసం వెంపర్లాడుతారా..? అన్న ప్రశ్నలు కూడా తెరపైకి వస్తున్నాయి.  అయితే మంత్రి వ్యాఖ్యలను సమర్థిస్తున్న వారి సంఖ్య కూడా లేకపోలేదు. అయితే తోటి ప్రయాణికుడు ఒకరు పోలీసులకు ఇచ్చిన వాంగ్మూలంలో జైరాను వేధించలేదని పేర్కొన్నారు. ఈ మేరకు నిందితుడు వికాస్‌ సచ్ దేవ్ తరపు న్యాయవాది హెచ్‌ ఎస్‌ ఆనంద్‌ కోర్టులో వాదనలు వినిపించారు.

‘‘తాను అదే విమానంలో ప్రయాణించానని, వారికి సమీపానే కూర్చున్నానని.. అతను సీటుపై కాలుపెట్టిన మాట వాస్తవం. అయితే ఫ్లైట్‌ టేకాఫ్ తీసుకున్నాక కూడా అతను కాలును అలాగే ఉంచాడు. అతనేం లైంగిక వేధింపులకు పాల్పడలేదు. ముంబైలో విమానం ల్యాండ్ అయ్యాక ఆమె అతనిపై గట్టిగా అరిచింది. వెంటనే కాలు పెట్టినందుకు అతను క్షమాపణలు కూడా తెలియజేశాడు. వివాదం అంతటితో సర్దుమణిగింది’’ అని చతుర్వేది అనే ప్రయాణికుడు ముంబై పోలీసులకు వాంగ్మూలం ఇచ్చాడు.

కాగా, నటి జైరా వసీమ్ కు మద్దతు పెరిగిపోతూ వస్తోంది. పలువురు బాలీవుడ్ నటులు ఇప్పటికే ఆమెకు మద్దతుగా ట్వీట్లు చేయగా.. తాజాగా అమీర్ ఖాన్ భార్య కిరణ్‌, నటి కంగనా రనౌత్ స్పందించారు. జైరా స్థానంలో తాను ఉండి ఉంటే అతని కాళ్లు విరగొట్టి ఉండేదానినని కంగనా వ్యాఖ్యానించారు. మరోవైపు క్రికెటర్ విరాట్‌ కోహ్లి కూడా ఘటనను తీవ్రంగా ఖండించారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles