Man arrested for kidnapping daughter కూతురిని కిడ్నాప్ చేసిన తండ్రి

Man arrested for kidnapping daughter who married a dalit

father kidnaps daughter, dalit man's wife kidnapped, dad kidnaps daughter, kidnap, Trichy, suvitha, Selvam, Pudukottai, pettavaithalai, madurai keelavalavu, Keelavalavu, Keelaiyur, Tamilnadu crime

Keelavalavu police arrested a non-dalit man and his accomplices after he kidnapped his daughter from her dalit husband at Keelaiyur in Keelavalavu police limits

కూతురిని కిడ్నాప్ చేసిన తండ్రికి అరదండాలు

Posted: 12/14/2017 09:34 AM IST
Man arrested for kidnapping daughter who married a dalit

చిన్ననాటి నుంచి అత్యంత ప్రేమగా పెంచి, పెద్ద చేసిన కూతురిని అన్ని తామై పెంచారు. అయితే యుక్త వయస్సురాగానే అమె తన తల్లిదండ్రులందరినీ కాదనుకుని ఓ యువకుడిని ఇష్టపడింది. అయితే తమ కన్నా కులం తక్కువైన యువకుడితో ప్రేమ వ్యవహారాలు సాగించడం మంచిదికాదు.. వారిని కట్టుకుని ఇబ్బందులకు పడవద్దని తన కూతురి పెళ్లికి ఆ తండ్రి అడ్డుతగిలాడు. అయితే తండ్రి మాటను లక్ష్యపెట్టని కూతురు తన ప్రియుడిని కులాంతర వివాహం చేసుకుంది.

దీంతో సహించలేని తండ్రి అమెను సినిమా ఫక్కీలో కిడ్నాప్ చేసి కటకటాలపాలయ్యాడు. న్యాయస్థానానికి హాజరై తిరిగి భర్తతో కలిసి బస్సులో వెళ్తుండగా వాహనాల్లో వెంబడించిన కొందరు అగంతకులు అమెను అపహరించి బంధించారు. ఆమె భర్త ఫిర్యాదు మేరకు రంగంలోకి దిగిన పోలీసులు సకాలంలో స్పందించి అమెను కాపాడారు. ఈ కేసుకు సంబంధించి యువతి తండ్రి సహా 10 మందిని పోలీసులు అరెస్టు చేశారు.

పోలీసుల కథనం మేరకు.... తిరుచ్చి జిల్లా పెట్టవాయ్ తలయై ప్రాంతానికి చెందిన సెల్వం (54)కు శ్వేత అనే కూతరు వుంది. పుదుకోట్టై జిల్లా ఆలంకుడి సమీపంలోని మేలనిమ్మాకోట ప్రాంతానికి చెందిన మనిదనేయం అనే యువకుడితో ఆమె ప్రేమలోవుంది. వేర్వేరు కులాలు కావడంతో వీరి ప్రేమకు పెద్దలు అంగీకరించలేదు. ఈ నేపథ్యంలో వారు ఇళ్ల నుంచి వెళ్లిపోయి పెళ్లి చేసుకున్నారు. శ్వేత అదృశ్యమైనట్లు సెల్వం ఇటీవల మదురై హైకోర్టులో హెబియస్ కార్పస్ పిటిషన్ దాఖలు చేశారు.

దీని గురించి సమాచారం అందుకున్న శ్వేత... తన భర్త మనిదనేయంతో కలిసి హైకోర్టులో హాజరైంది. తనకు తల్లిదండ్రులతో కలిసి వెళ్లటం ఇష్టం లేదని, తన భర్తతోనే ఉంటానని చెప్పింది. శ్వేత ఇష్టప్రకారమే వెళ్లేందుకు న్యాయమూర్తి ఆదేశించారు. ఇక న్యాయస్థానంలో కేసు విచారణ తరువాత శ్వేత, మనిదనేయం దంపతులు బస్సులో పుదుకోట్టైకు బయలుదేరారు. వారు వెళ్తున్న బస్సు మేలూరు సమీపంలో కీళయూరు వద్దకు వచ్చింది.

ఇంతలో కారు, ఆమ్నీ వ్యానులో వచ్చిన సెల్వం సహా 10 మంది బస్సులోకి ఎక్కి శ్వేతను అపహరించుకెళ్లారు. మనిదనేయం దీని గురించి మేలూరు పోలీసుస్టేషన్ లో ఫిర్యాదు చేశాడు. శ్వేతను అపహరించుకెళ్లిన కారు నెంబరును పోలీసులకు తెలిపాడు. కరూరు వద్ద  సోదాల్లో ఆ కారు పోలీసులకు చిక్కింది. డ్రైవర్ ను ప్రశ్నించగా  శ్వేతను కరూరు సమీపంలోని రాయనూరులో ఉన్న ఓ ఇంట్లో బంధించినట్లు తెలిసింది. పోలీసులు ఆ ప్రాంతానికి చేరుకుని శ్వేతను కాపాడారు. సెల్వం సహా 10 మందిని పోలీసులు అరెస్టు చేశారు. కేసు దర్యాప్తులో ఉంది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : kidnap  Trichy  suvitha  Selvam  Pudukottai  pettavaithalai  madurai keelavalavu  Keelavalavu  Keelaiyur  Tamilnadu crime  

Other Articles