sonia gandhi letter to daughter of her favourite hero అభిమాన హీరో కూతురికి సోనియాగాంధీ లేఖ

Sonia gandhi in condolence letter have been admirer of shashi kapoor

Congress President Sonia Gandhi in a condolence letter to the daughter of veteran actor-filmmaker Shashi Kapoor, said she has been an admirer of the late actor ever since she first saw his film 'Shakespearewallah' in 1966 in England, along with Rajiv Gandhi.

Congress President Sonia Gandhi in a condolence letter to the daughter of veteran actor-filmmaker Shashi Kapoor, said she has been an admirer of the late actor ever since she first saw his film 'Shakespearewallah' in 1966 in England, along with Rajiv Gandhi.

అభిమాన హీరో కూతురికి సోనియాగాంధీ లేఖ

Posted: 12/07/2017 04:42 PM IST
Sonia gandhi in condolence letter have been admirer of shashi kapoor

సోనియాగాంధీకి అభిమాన హీరో లేఖ అని రాసేందుకు ఇలా రాశారా..? అన్న భావన మీలోనూ కలుగుతుందా..? కానీ మేము రాసిన శీర్షిక కరెక్టే.. అభిమాన హీరో కూతురికి కాంగ్రెస్ పార్టీ అధినేత్రి సోనియాగాంధీ లేఖ రాశారు. తాను బాలీవుడ్ నటుడు శశికపూర్ కి తాను వీరాభిమానినని అమె స్పష్టం చేశారు. కొంతకాలం పాటు అనారోగ్యంతో బాధపడిన శశికపూర్ మూడు రోజుల క్రితం మృతి చెందిన విషయం తెలిసిందే. ఈ సందర్భంగా శశికపూర్ కుమార్తె సంజనాకపూర్ కి ఆమె లేఖ రాశారు. శశికపూర్ మృతి వార్త తెలిసి తీవ్ర దిగ్భ్రాంతికి లోనయ్యానని, అదే సమయంలో సంజనా కపూర్ కు తన ప్రగాఢ సానుభూతిని కూడా వ్యక్తం చేశారు.

శశికపూర్ నటించిన ఆంగ్ల చిత్రం ‘షేక్ స్పియర్ వాలా’ చూసి ఆయనకు అభిమానిగా మారానని అమె లేఖలో పేర్కోన్నారు. ఈ చిత్రాన్ని 1966లో ఇంగ్లాండ్ లో రాజీవ్ గాంధీ తనను తీసుకువెళ్లారని ఆ లేఖలో ఆమె పేర్కొన్నారు. ఆ సినిమా చూడటం మర్చిపోలేని అనుభవంగా ఆమె అభివర్ణించారు. ఆ తరువాత అయనకు అభిమానిగా మారిన తాను అనేక శశికపూర్ నటించిన పలు చిత్రాలు చూశానని పేర్కోన్నారు.

శశికపూర్ చాల గొప్పనటుడని, ఎలాంటి పాత్రల్లోనైనా ఇట్టే ఒదిగిపోయి నటిస్తారని అమె అన్నారు. వెండితెరపై అయినా, లేక చిన్న అర్ట్ చిత్రమైనా ఆయన తన వంతుగా తనను ఎంచుకన్న పాత్రలకు న్యాయం చేసేవారని సోనియాగాంధీ పేర్కొన్నారు. ఈ మధురమైన చిత్రాలు మనకు శశికపూర్ ఇచ్చిన గోప్ప కానుకలని ఎలాంటి పాత్ర, కష్టపడి పని చేసే వ్యక్తి అని ఆమె ప్రశంసించారు.  ఆయన జ్ఞాపకాలు ఎప్పటికీ మీతోనే వుంటాయని పేర్కోంటూ సోనియాగాంధీ సంజనా కపూర్ కు లేఖ రాశారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles