Paytm to offer small digital loans అడిగిందే తడవుగా ఉచిత అప్పులిస్తాం: పేటియం

Paytm to offer interest free short term credit loans

ICICI Bank, Paytm, instant loans, Paytm ICICI Bank Postpaid, credit card, ICICI Bank loans, online loans, fintech start-ups, start-ups

Paytm, the largest digital payments platform in India, to offer short-term credit to their common customers.

అడిగిందే తడవుగా ఉచిత అప్పులిస్తాం: పేటియం

Posted: 11/20/2017 05:57 PM IST
Paytm to offer interest free short term credit loans

పేటియం అంటే తెలియని వారు లేరని చెప్పడం అతిశయోక్తి కాదు. నోట్ల రద్దు సమయంలో పేటీయం కరో అంటూ వచ్చి. దేశప్రజలందరికీ సుపరిచితమైన పేటీయం.. తాజాగా చిన్న అవసరాలను తీర్చే రుణదాత అవతారాన్ని కూడా ఎత్తింది. ఐదో పదో, పదిహేనో లేక ఇరవై వేల రూపాయలే మీ అవసరమైతే.. మీకు చటుక్కున రుణం అందించే ప్రయత్నం చేస్తుంది. ఇది ఒకలా మీ క్రెడిట్ కార్డులా కూడా ఉపయోగపడనుంది. చేతిలో క్రెడిట్ కార్డు లేని వారికి పేటీయం యాప్ అందివచ్చిన క్రెడిట్ కార్డు. తీసుకున్నవాళ్లకు తిరిగిచెల్లించిన మీదట మళ్లీ రుణాన్ని పోందవచ్చు.

అయితే ఇలాంటి రుణం మీకు లభించాలంటే.. మీరు పేటియం కస్టమర్లు అయ్యివుండాలి.. పేటీయం యాప్ ద్వారా చెల్లింపులు చేస్తుండాలి.. లేదా ఈ యాప్ ద్వారా.. కొనుగోళ్లు చేస్తుండలి.. లేదా బస్సు టిక్కెట్లో, లేక రైలు టిక్కెట్లో లేదా విమాన టిక్కెట్ల లాంటివి ఏమైనా చశారా..? పేటియం యాప్ వినియోగించటంలో మీ ట్రాక్ రికార్డ్ బాగుందా.. అయితే మీకు ఈ రుణం ఈజీగానే అందుతుందండోయ్, అడిగిన వెంటనే 20వేల రూపాయల అప్పు మీ పేటియం ఖాతాలో జమ అయిపోతుంది.

దీనిని నగదు రూపంలో కానీ లేక షాపింగ్ లోనూ 20వేల విలువైన వస్తువులను కొనుగోలు చేయవచ్చు. అదే విధంగా సినిమా టికెట్లు, ఫ్లయిట్ టికెట్లను కూడా మీ పేటియం అకౌంట్ లో డబ్బులు లేకపోయినా అప్పు కింద చెల్లింపులు చేసుకోవచ్చు. ఎమర్జెన్సీ సమయంలో కస్టమర్లను ఆదుకోవటం కోసం పేటియం కొత్త అప్పు స్కీమ్ తీసుకొచ్చింది. అందుకుగాను ఐసిఐసిఐ బ్యాంక్ తో ఒప్పందం చేసుకుంది. పేటియం ద్వారా.. ఐసిఐసిఐ బ్యాంక్ ఇచ్చే 20వేల అప్పుపై 40 రోజుల వరకు వడ్డీ ఉండదు.

గడువులోగా తిరిగి చెల్లించకపోతే రూ.50 జరిమానాతోపాటు 3శాతం వడ్డీ చెల్లించాల్సి ఉంటుంది. ఈ రూ.20వేల అప్పు చెల్లించిన తర్వాత మళ్లీ కావాలంటే వెంటనే మంజూరు అవుతుంది. ఈ అవకాశాన్నికస్టమర్లు ఉపయోగించుకుని లబ్దిపొందవచ్చని బ్యాంక్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ అనూప్ వెల్లడించారు. కేవలం ఖాతాదారులకే కాకుండా.. మిగతా వారిని కూడా ఐసిఐసిఐ బ్యాంక్ కస్టమర్లుగా మార్చుకునేందుకు ఈ స్కీమ్ ఎంతగానో ఉపయోగపడుతుందన్నారు. ప్రస్తుతం వ్యక్తిగత ఖాతాలకు మాత్రమే దీన్ని అమలు చేస్తున్నామని.. రాబోయే రోజుల్లో వ్యాపార సంస్థలకు కూడా విస్తరించనున్నట్లు ప్రకటించారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles