BJP Leader Warns Muslims About 'Difficulties' బరితెగించిన బీజేపి నేత.. ఓట్ల కోసం వార్నింగ్..

Vote my wife or else bjp leader warns muslims about difficulties

BJP leader threatens Muslims, Communal remarks, Narendra Modi, UP Municipal Elections, Yogi Adityanath, ranjeet kumar srivastava, bjp leader warns muslims, barabanki civic polls, bjp, uttat pradesh

Ranjeet Kumar Srivastava was campaigning for his wife earlier this week when he made the arrogant threat in presence of two ministers Dara Singh Chauhan, Ramapati Shastri.

బరితెగించిన బీజేపి నేత.. ఓట్లర్లకు బీజేపి నేత వార్నింగ్..

Posted: 11/17/2017 02:26 PM IST
Vote my wife or else bjp leader warns muslims about difficulties

కేంద్ర రాష్ట్రాల్లో అధికారంలో వున్న కమల పార్టీ నేతలు అదే అధికార మత్తులో తామేం చేస్తున్నామో కూడా మర్చిపోతున్నారు. ఎన్నికల వేళ.. ఓట్ల కోసం కష్టాలు పడే నేతలు ప్రజల గడ్డాలను మీసాలను పట్టుకుని బతిమాలడం చూశాం.. వారు చేస్తున్న పనులను చేస్తూ అకట్టుకునే నేతలను చూశాం.. కానీ ఇక్కడ ఓ బీజేపి పార్టీ నేత మాత్రం ఏకంగా ఓటర్లను భయభ్రాంతులకు గురిచేస్తున్నాడు. వార్నింగ్ ఇచ్చి జాగ్రత్తా అంటూ హెచ్చరిస్తున్నాడు.

తన భార్యకు ఓటు వేయకపోతే మాత్రం బాగోదని, అలా చేసి కష్టాలను తెచ్చుకోకండీ అంటూ హెచ్చరిస్తున్నాడు. ఆయన ఈ ప్రసంగం చేస్తున్న క్రమంలో ఆ రాష్ట్ర మంత్రులిద్దరు కూడా అదే వేదికపై అసీనులైన వున్నారు. అయినా వారి నుంచి ఎలాంటి స్పందనా లేదు. కనీసం ఇలాంటి హెచ్చరికలు జారీ చేయడంపై కనీసం ఎన్నికల సంఘం అధికారులు స్పందిస్తారా.. అని వేచిచూస్తే  అది కూడా కష్టమేనని తేలిపోయింది. ఎన్నికల సంఘం అధికారులు ఇంకా నిద్రలోనే జోగుతున్నారు.

ఈ ఘటన ఉత్తర్ ఫ్రదేశ్ రాష్ట్రంలోని బారాబంకీ స్థానిక సంస్థల ఎన్నికలలో భాగంగా చోటుచేసుకుంది. ఓ వార్డులో తన భార్యను ఎన్నికల బరిలో నిలిపిన బీజేపి నేత త‌న భార్య శశి శ్రీవాత్సవ త‌ర‌ఫున ప్రచారం చేస్తూ బీజేపీ కౌన్సిల‌ర్ రంజిత్ కుమార్ శ్రీవాత్సవ ఆమెకు ఓటు వేయ‌క‌పోతే ముస్లింలు క‌ష్టాలు ఎదుర్కోవాల్సి ఉంటుందని హెచ్చరించాడు. యోగీ అదిత్యనాథ్ క్యాబినెట్ లోని ఇద్దరు మంత్రులు దారా సింగ్ చౌహాన్‌, ర‌మాప‌తి శాస్త్రిలు అదే వేదికపై అసీనులై వుండగా... వారి ముందే రంజిత్ కుమార్ ఈ హెచ్చరికలు జారీ చేశాడు.

'ఇది స‌మాజ్‌వాదీ పార్టీ ప్రభుత్వం కాదు. మీ నాయ‌కులెవ‌రూ మీకు స‌హాయం చేయ‌లేరు. రోడ్లు, నాలాల మ‌ర‌మ్మత్తుతో పాటు ఇంకా చాలా ప‌నులు స్థానిక సంస్థల చేతిలోనే ఉంటాయి. ఇక్కడ బీజేపీకి ఎదురేలేదు. అందుకే వారి విజ‌యంలో మ‌రింత స‌హాయం చేయండి. మీరు రంజిత్ కుమార్ భార్యకు ఓటు వేయ‌క‌పోతే, ఎదుర్కోబోయే క‌ష్టాల నుంచి స‌మాజ్‌వాదీ పార్టీ కూడా మిమ్మల్ని కాపాడ‌లేదు. అందుకే ముస్లింలు అంద‌రికీ ఇదే నేను చెబుతున్నా... మాకు ఓటు వేయండి. నేను ఓట్లు అడ‌గ‌డం లేదు..ఒక‌వేళ ఓటు వేస్తే ప్రశాంతంగా ఉంటారు, లేదంటే క‌ష్టాల పాల‌వుతారు' అని రంజిత్ కుమార్ హెచ్చరించాడు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles