Time slot system for sri vari sarva darshanam తిరుమల శ్రీవారి దర్శనం ఇక చాలా ఈజీ..

Time slot system for sri vari sarva darshanam

tirumana srivari darshanam, lord venkateshwara darshanam, devotees, long hour queues, time slot system, time slot system to srivari devotees, TTD, tirumala tirupathi devasthanam, Time slot system, slot system for sri vari sarva darshanam, sarva darshanam Time slot, Time slot system, sarva darshanam devotees

tirumala tirupathi devasthanam has decided to put an end to the long hour queues for the devotees to have darshan of lord venkateswara swamy by introducing time slot system.

తిరుమల శ్రీవారి దర్శనం ఇక చాలా ఈజీ..

Posted: 11/17/2017 11:10 AM IST
Time slot system for sri vari sarva darshanam

తిరుమల తిరుపతి శ్రీవారం దర్శనం ఇక చాలా ఈజీగా కానుంది. ఇందుకోసం షిరిడీలోని సాయినాథుడ్ని దర్శంచేందుకు ప్రవేశపెట్టిన విధానాన్నే ఏడుకొండలవాడి దర్శనాన్ని కూడా ప్రవేశపెట్టేందుకు తిరుమల తిరుపతి దేవస్థానం కమిటీ అమలుపర్చేందుకు సిద్దమైంది. దీంతో ఇక భక్తులకు కేవలం 2 నుంచి 3 గంటల వ్యవధిలోనే దర్శనం కలగనుంది. మరోరకంగా చెప్పాలంటే ఇక అందరూ భక్తులు విఐపీ దర్శనం చేసుకోనున్నట్లే. అదే టైమ్ స్లాట్ విధానం.. ఈ విధానాన్ని వచ్చే నెల రెండో వారం నుంచి అమలు చేసేందుకు టీటీడీ అలయ కమిటీ సన్నహాలు చేస్తుంది.

ఈ విధానం అమల్లోకి వచ్చిన తరువాత ఇక గంటల తరబడి క్యూలైన్లలో భక్తులు వేచి ఉండాల్సిన అవసరం లేదు. దేశం నలుమూలల నుంచీ అనేక వ్యయ ప్రయాసలకు ఓర్చి తిరుమలకు వచ్చే సాధారణ భక్తులు జనరల్‌ క్యూలైన్ల ద్వారా స్వామివారిని దర్శించుకొంటున్నారు. పేద, దిగువ మధ్యతరగతి భక్తులు సర్వదర్శనం క్యూలైన్లలో రద్దీ పెద్దగా లేని రోజుల్లో కూడా అయిదారు గంటలు వేచి ఉండాల్సి వస్తోంది. దీంతో టైమ్ స్లాట్ విధానాన్ని ప్రవేశపెడుతోంది టీటీడీ.

సర్వదర్శనం ద్వారా శ్రీవారి దర్శనం చేసుకునే భక్తులకు సాధారణ రోజుల్లో 5 నుంచి 6 గంటలు.. శుక్ర, శని, ఆదివారాల్లో 8 గంటల సమయం పడుతున్న నేపథ్యంలో విరి సమయాన్ని తగ్గించేందుకు అలయకమిటీ దృష్టి సారించింది. దీంతో టైమ్ స్లామ్ విధానాన్ని అమలు చేయాలని భావిస్తున్నారు. దీంతో పాటు సాధారణ క్యూలైన్‌ పద్ధతి కూడా కొనసాగనుంది. తిరుమలలో 21 ప్రాంతాల్లో 150 టైంస్లాట్‌ కౌంటర్లలో భక్తులకు దర్శనానికి స్లాట్ కేటాయిస్తారు. నిర్ధేశిత సమయానికి క్యూలైన్లో ప్రవేశిస్తే.. 2గంటల్లోపే దర్శనం పూర్తయి బయటకు వచ్చే అవకాశముంది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles