Sasikala to be Questioned After IT Sleuths శశికళపై ఐటీ దాడులు: రూ.1430 కోట్ల నల్లధనం స్వాధీనం

Raids on sasikala jaya tv unearth rs1 430 cr black money

aiadmk, AIADMK income tax raids, Chennai, chennai tax raids, Dhinakaran, Dinakaran, income tax, income tax raids, it raids, Jaya TV, Jaya TV raids, multi-city raids, Palaniswami, Sasikala, sasikala income tax raids, sasikala questioning, sasikala tax, sasikala tax evasion, Sasikala tax raids, Sasikala undisclosed income, Tamil Nadu, TTV Dhinakaran, TTV Dinakaran, Undisclosed income, VK Sasikala, VK Sasikala in Jail

Income Tax officials have found Rs 1,430 crore undeclared income after the 5-day search at the Jaya TV office and residences and offices of family members of jailed AIADMK party leader VK Sasikala

శశికళపై ఐటీ దాడులు: రూ.1430 కోట్ల నల్లధనం స్వాధీనం

Posted: 11/15/2017 02:12 PM IST
Raids on sasikala jaya tv unearth rs1 430 cr black money

తమిళనాడు దివంగత ముఖ్యమంత్రి జయలలిత అక్రమాస్థుల ఆస్తుల కేసులో బెంగళూరులోని పరప్పన అగ్రహార జైలులో శిక్ష అనుభవిస్తున్న ఆమె నెచ్చెలి శశికళ చుట్టూ మరోమారు ఉచ్చు బిగుసుకుంటుంది. పన్ను ఎగవేతకు పాల్పడ్డారన్న అభియోగాలు ధాఖలైన నేపథ్యంలో శశికళపై గత అరో రోజులుగా అదాయపన్ను శాఖ అధికారులు అకస్మిక తనిఖీలు చేస్తూనే వున్నారు. కాగా ఐటీ అధికారుల దాడుల్లో పెద్దఎతున నల్లధనం బయటపడినట్లు సమాచారం.

శశికళ ఇల్లు, జయ టీవీ.. సహా అమెకు సంబంధించిన అన్ని సంబంధికులు ఇళ్లు కార్యాలయాలతో కలిపి 187 ప్రాంతాలపై ఏకకాలంతో దాడులు నిర్వహించిన అధికారులు.. అనుమానాలు వున్న చోటు ఇవాల్ి వరకు దాడులు జరుపుతూనే వున్నారు. దీంతో ఏకంగా రూ.1430 కోట్ల రూపాయల నల్లధనం బయటపడినట్లు అనధికారవర్గాల సమాచారం. కార్జన్ టీ ఎస్టేట్ సహా పలు చోట్లు ఇవాళ ఉదయం అదాకారులు తనిఖీలు ముగింపు దశకు చేరుకున్నాయి.

కాగా అదాయపన్ను అధికారులు తనిఖీలలో లభ్యమైన సాక్ష్యాలు అధారాలతో మరో అడుగు ముందుకు వేయనున్నారని సమాచారం. బెంగళూరులోని పరప్పన అగ్రహారం జైల్లో శిక్ష అనుభవిస్తున్న శశికళను ప్రశ్నించేందుకు ఐటీ అధికారులు త్వరలోనే సన్నాహాలు చేస్తున్నారన్ని తెలుస్తుంది. అమెకు చెందిన దాదాపు 200 సంస్థల్లో తనిఖీలు చపట్టిన అధికారులు కంపెనీలన్నీ నకిలీవిగా గుర్తించారు. ఈ కంపెనీలతో ఏకంగా వేలాది కోట్ల అక్రమాస్తులను అమె అర్జించి పన్ను ఎగవేశారని గుర్తించారు.

దీంతో అక్రమార్జనలకు అడ్డగా మారిన అమె సూట్ కేస్ కంపెనీలపై అమెను విచారించనున్నట్లు సమాచారం. అమె వద్ద నుంచి ఏకంగా ఏడు కోట్ల రూపాయల నగదు, 5 కోట్ల రూపాయల విలువైన బంగారు అభరణాలను స్వాధీనం చేసుకున్నారు. దీంతో పాటు ఏకంగా 15 బ్యాంకు లాకర్లలో తాలుకు వివరాలను కూడా కనుగొన్నామని ఐటీ అనధికార వర్గాల సమాచారం. ఆధాయపన్నుశాఖ సిబ్బంది నిర్వహించిన ఐదు రోజుల మెగా ఆపరేషన్ శశికళ అమె అనుయాయువుల డొంక మొత్తం కదిలిందన్న వార్తులు కూడా గుప్పమంటున్నాయి.
 
పన్ను ఎగవేతతోపాటు షెల్ కంపెనీలపై అధికారులు శశికళ బంధువులను ఇప్పటికే ప్రశ్నిస్తున్నారు. ఇప్పుడు ఏకంగా శశికళనే విచారణ చేసేందుకు సిద్ధమవుతున్నారు. ఇలవరసి కుమార్తె.. శశికళ మేనకోడలిని అధికారులు ప్రశ్నిస్తున్నారు. జయ టీవీ సీఈవో వివేక్ జయరామన్, శశికళ వైద్యుడు సహా చాలామందిని ప్రశ్నిస్తామని అధికారులు చెప్పారు. అధికారులకు సహకరిస్తామని చెప్పిన అమె మేనల్లుడు జయరామన్.. ఈ దాడుల వెనుక ఎలాంటి రాజకీయ కక్ష సాధింపు చర్యలు లేవన్నారు. ఇక త్వరలోనే శశికళను కూడా విచారించనున్నారని సమాచారం.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : sasikala  IT raids  jaya tv  rs 1430 crores  chennai  parappana agrahara jail  bengaluru  

Other Articles