What's Wrong with KCR Birthday Wishes to Revanth | రేవంత్ కు కేసీఆర్ బర్త్ డే విషెస్.. తప్పేంటి?

Kcr birthday wishes to revanth reddy

KCR, Revanth Reddy, Revanth Reddy Birthday, KCR Wishes Revanth Reddy, KCR Revanth Reddy Birthday

Telangana Chief Minister KCR Birthday wishes to Revanth Reddy. KCR Sents Flower Bouquet and Letter. Deep Discussion in Telangana.

రేవంత్ రెడ్డి బర్త్ డేకి కేసీఆర్ విషెస్

Posted: 11/10/2017 08:53 AM IST
Kcr birthday wishes to revanth reddy

టీఆర్ఎస్ అన్నా.. ముఖ్యంగా ఆ పార్టీ అధినేత, తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కే చంధ్రశేఖర్ రావు అన్నా కాంగ్రెస్ నేత రేవంత్ రెడ్డికి మంట. అలాంటిది ఇది ఖచ్ఛితంగా ఎవరూ ఊహించని ఘటనే. కాంగ్రెస్ నేత
రేవంత్‌రెడ్డికి ముఖ్యమంత్రి కె.చంద్రశేఖరరావు బర్త్ డే విషెస్ తెలియజేశారు.

బుధవారం(నవంబర్ 8) రేవంత్ రెడ్డి పుట్టినరోజు సందర్భంగా కేసీఆర్ బర్త్ డే విషెస్ చెబుతూ ఓ లేఖతోపాటు పుష్పగుచ్చాన్ని రేవంత్‌కు పంపారు. ఆంధ్రజ్యోతి కథనం ప్రకారం.. ‘‘దేవుడు మీకు ఆయురారోగ్యాలు ప్రసాదించాలి. ప్రజాసేవలో మీరు మరెన్నో ఏళ్లు కొనసాగాలి’’ అని లేఖలో పేర్కొన్నారంట.

ఓటుకు నోటు కేసు తర్వాత టీఆర్ఎస్.. ముఖ్యంగా ముఖ్యమంత్రి కేసీఆర్‌కు రేవంత్‌రెడ్డికి మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమనే స్థాయికి విభేదాలు చేరుకున్నాయి. సమయం చిక్కినప్పుడల్లా అటు టీఆర్ఎస్ నేతలు, ఇటు రేవంత్ రెడ్డి ఒకరిపై ఒకరు దుమ్మెత్తిపోసుకునేవారు. రేవంత్ టీడీపీని వీడి కాంగ్రెస్‌లో చేరిన సమయంలోనూ ‘ఇక ఆట మొదలైంది’ అని పరోక్షంగా టీఆర్ఎస్‌ను హెచ్చరించారు. ఇప్పుడు వీటన్నింటినీ మనసులో పెట్టుకోకుండా కేసీఆర్ బుధవారం రేవంత్‌కు బర్త్ డే శుభాకాంక్షలు చెబుతూ పుష్ప గుచ్చాన్ని పంపడం అందరినీ ఆశ్చర్యంలో ముంచెత్తుతోంది.

కారణం ఏంటి?

 

అయితే సాధారణంగానే ఎమ్మెల్యేలందరికీ శుభాకాంక్షలు తెలియజేయటం కేసీఆర్ కు అలవాటు అన్నది కొందరు చెబుతున్న వాదన. మరోపక్క విశ్లేషకులు మాత్రం శాసన సభ పక్ష నేత జానారెడ్డి లాంటి వాళ్లను సైతం దువ్వి మచ్చిక చేసుకునే కేసీఆర్ రాజకీయ వ్యూహాంలో భాగంగానే రేవంత్ కు విషెస్ తెలియజేసి ఉంటారన్నది విశ్లేషకులు చెబుతున్నారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles