Former Governor ND Tiwari's condition worsens | మన మాజీ గవర్నర్ పరిస్థితి విషమం

Nd tiwari health condition

ND Tiwari, Naryan Dutt Tiwari, ND Tiwari Health, ND Tiwari Critical, Former Uttar Pradesh Chief Minister Critical, Andhra Pradesh Former Governor,

Former Uttar Pradesh Chief Minister ND Tiwari's condition worsens, on life support. Congress senior leader also serviced as United Andhra Pradesh's Governor. Now, Tiwari Condition Extremely Critical', Put On Life Support.

ఆ మాజీ గవర్నర్ పరిస్థితి విషమం

Posted: 11/06/2017 08:28 AM IST
Nd tiwari health condition

గతంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి గవర్నర్ గా పని చేసిన నారాయణ్ దత్ తివారీ (92) పరిస్థితి విషమంగా ఉంది. గత కాలంగా తీవ్ర అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన ప్రస్తుతం వెంటిలేటర్ పై ఉన్నట్లు సమాచారం.

సెప్టెంబరులో బ్రెయిన్ స్ట్రోక్‌కు గురైనప్పటి నుంచి తివారీ ఆరోగ్యం క్షీణిస్తూ వస్తోంది. తీవ్ర జ్వరం, న్యూమోనియాతో బాధపడుతున్న తివారీని అక్టోబరు 26న ఇక్కడి మ్యాక్స్ సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రిలో చేర్చారు. ఐసీయూ లో ఉన్న తివారీకి రక్తపోటు పడిపోయిందని, ఆరోగ్యం కూడా బాగా క్షీణించిందని వైద్యులు తెలిపారు.

కాగా, ఉత్తర ప్రదేశ్, దాని నుంచి విడిపోయిన ఉత్తరాఖండ్ రెండు రాష్ట్రాలకు ముఖ్యమంత్రిగా పనిచేసిన నేతగా తివారీ రికార్డు సృష్టించారు. కాంగ్రెస్ ప్రభుత్వాల హయాంలో పలుమార్లు కేంద్రమంత్రిగా పనిచేశారు. అవిభాజ్య ఆంధ్రప్రదేశ్ గవర్నర్‌గానూ తివారీ సేవలందించారు. ఆ సమయంలో రాజ్ భవన్ లోనే రాసలీలలు నడిపించి ఓ ఛానెల్ నిర్వహించిన స్టింగ్ ఆపరేషన్ లో దొరికిపోయి.. పదవి నుంచి తప్పుకున్నారు. ఆపై ఓ వ్యక్తి ఆయన కొడుకుని అంటూ చేసిన న్యాయ పోరాటం తెలిసిందే.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles