Girl-child brings not only joy but gold in this town! బంగారు తల్లులు.. అక్కడ కనమహాలక్ష్ములు..

Girl child brings not only joy but gold in this town

Kottakkal, Kerala, Malappuram, Girl Child, Gold, World Economic Forum, Global Gender Gap, India, Lancet, Sex Ratio, Gender Gap

Abdul Raheem has a unique way of celebrating the birth of a girl child in his ward. The independent councillor has been gifting a gold coin weighing one gram to mothers, who give birth to a girl, for the last two years.

బంగారు తల్లులు.. అక్కడ కనకమహాలక్ష్ములు..

Posted: 11/04/2017 11:03 AM IST
Girl child brings not only joy but gold in this town

బేటీ బచావో .. బేటీ పడావో అంటూ కేంద్రం తీసుకొచ్చిన పథకం ఎంత వరకు ప్రతిఫలిమిస్తుందో తెలియదు.. కనీసం శిశు కళ్యాణ్ పేరిట జీఎస్టీ అమలుకు ముందు వరకు దేశ ప్రజల కొన్న ప్రతీ వస్తువుపై అరశాతం మేర వసూలు చేసిన డబ్బు సక్రమంగా ఖర్చైందా..? లేదా.? అన్న విషయాలను పక్కనబెడితే.. ప్రభుత్వాలు కూడా యోచించని రీతిలో ఓ ప్రజా ప్రతినిధి అలోచన చేశాడు. మరీ ముఖ్యంగా అడపిల్ల పుడితే శాపమని భావించే నేటి సమాజంలో మార్పుకు ముందుడగు వేశాడు.

అడపిల్ల.. బంగారు తల్లులను కన్న ప్రతి తల్లికి కనకాన్ని అందించి.. అడ బిడ్డలు కనకమహాలక్ష్ములని తన చేతలతో చాటిచెప్పాడు. ఈయన అలోచన మాత్రం గత రెండేళ్లుగా పెద్ద ఫలితాలనే అందిస్తోంది. బాలికా సంరక్షణకు ఆయన చేస్తున్న కృషి అందరి చేత ప్రశంసలు అందిస్తోంది. కేరళలోని మలప్పురం జిల్లా కొట్టాక్కళ్‌ మున్సిపాల్టీలోని వెస్ట్ విల్లూర్ వార్డు కౌన్సిలర్ అబ్దుల్ రహీమ్. ఆయనకొచ్చిన ఆలోచన అక్కడి తల్లిదండ్రుల్లో మార్పు తీసుకువస్తోందంటున్నారు స్థానికులు.

గత మున్సిపల్ ఎన్నికలలో తాను గెలిస్తే ఆడపిల్ల పుడితే బంగారం బహుమతిగా ఇస్తామని హామి ఇచ్చిన అబ్దుల్ రహీమ్.. అన్న మాట ప్రకారం తను వార్డు కౌన్సిలర్ గా ఎన్నికైనప్పటి నుంచి తన వార్డు పరిధిలో ఆడపిల్లలు జన్మనిచ్చిన తల్లులకు ఒక గ్రాము బంగారు నాణేన్ని అందజేస్తున్నారు. ఇప్పటి వరకూ 16 మంది తల్లలకు బంగారు నాణాలు బహూకరించారు. దీనికోసం ఆయన తనకు కౌన్సిలర్ గా వచ్చే నెల జీతాన్ని వెచ్చిస్తున్నారు.

వృత్తిపరంగా వ్యాపారి అయిన రహీమ్.. ఒకరి నుంచి రూపాయి ఆశించకుండా తనకు ప్రజాసేవ ద్వారా వచ్చే మొత్తాన్ని అదే ప్రజలకు అందిస్తున్నారు. రాజకీయాల్లోకి వచ్చిందే సేవ చేయడానికి.. వ్యాపారాల కోసం కాదంటున్నారు రహీమ్. ఇక మీదట దాన్ని రెట్టింపు చేసే ఆలోచనలో ఉన్నామని చెప్పారు. కొందరు బంగారు వ్యాపారులు కూడా సహాయం చేయాలని ముందుకు వస్తున్నారు. అయితే రహీమ్ మాత్రం వారి సాయాన్ని సున్నితంగా తిరస్కరిస్తున్నారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Kottakkal  Kerala  Malappuram  Girl Child  Gold  World Economic Forum  Global Gender Gap  India  Lancet  Sex Ratio  Gender Gap  

Other Articles